ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో ఫెయిలయ్యాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మినారాయణ నేతృత్వంలోని బీజేపీ బృందం గవర్నర్ బిశ్వభూషణ్  హరిచందన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వ వైఫల్యంపై గవర్న‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, సంస్కృతిపై జరుగుతున్న దాడులను గవర్నర్‌కు వివరించారు. హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 


పథకాల డబ్బులు పన్నులుగా తిరిగి ఇచ్చేయండి - మేకపాటి వారసుడి సలహా !


గవర్నర్‌ను కలిసిన తర్వాత కన్నా లక్ష్మినారాయణ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్‌సీపీ  అధికారంలోకి వచ్చాక హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించారు.  హిందువులపై దాడులు జరిగితే ఎక్కడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో మత‌మార్పిడులు విచ్చల విడిగా జరుగుతున్నాయి… హిందువులపై దాడులు పెరిగాయన్నారు.  


అప్పు తిరిగివ్వమన్నందుకు దాడులు చేయిస్తున్నారు - మహిళా మంత్రిపై సొంత పార్టీ నేతల ఆరోపణలు !


మొత్తంగా ఏడు ప్రధాన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.  నెల్లూరులో హనుమాన్ జయంతి శోభాయాత్రపై  దాడులు చేశారని  .. ఆత్మకూరులో హిందువుల ప్రాంతంలో మసీదు కడుతున్నారని అడిగితే బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై దాడి చేశారన్నారు.  తెనాలిలో హిందూ మహిళని వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అగ్రహించారు. శ్రీశైలంలో అన్యమత మతస్తులే అత్యధికంగా దుకాణాలు కలిగి ఉన్నారని నిరూపించినా చర్యలు లేవని.. కాకినాడ జేఎన్టీయూలో అక్రమ నిర్మాణాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని స్పష్టం చేశారు.


గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యేకు వైఎస్ఆర్‌సీపీలో అసమ్మతి సెగ ! వంశీ ఏం చేయబోతున్నారు ?


ఏపి లో అంబేద్కర్ రాజ్యాంగం పనిచేయడం లేదని  ...జగన్ రాజ్యాంగం మాత్రమే పనిచేస్తుందన్నారు. ఐపిసి సెక్షన్ల కన్నా జగన్ సెక్షన్లే నడుస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు.    అత్యాచార సంఘటన ల పై రాష్ట్ర హోంమంత్రి భాద్యత రాహిత్యం గా మాట్లాడుతున్నారని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మండిపడ్డారు.  ఈ విషయమై మంత్రి  బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.చట్టాలు నిందితులకు చుట్టాలు గా మారుతున్నాయన్నారు.హోంమంత్రి ని బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు . గవర్నర్‌తో భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ఇతర కీలక నేతలు హాజరు కాకపోవడం ఆపార్టీ లో చర్చనీయాంశమయింది.