గన్నవరం ( Gannavaram )  వైఎస్ఆర్‌సీపీలో విభేదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ లో చేరి వైఎస్ఆర్‌సీపీకి దగ్గరయిన వల్లభనేని వంశీని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని ఆయన వ్యతిరేకులు ఆందోళనలు చేస్తున్నారు.  ఎమ్మెల్యే వంశీ అసమ్మతి వర్గం 'ఛలో తాడేపల్లి'కి పిలుపిచ్చింది. బుధవారం నుంచి వైఎస్ఆర్‌సీపీ నేతలు గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన వంశీ ఆధ్వర్యంలో వద్దని.. కొత్త ఇంచార్జ్‌ను నియమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 


ఏపీ రాజకీయాల్లో దూకుడు పెంచనున్న బీజేపీ- పొత్తులపై జాతీయ లీడర్లతోనే క్లారిటీ ఇచ్చేలా ప్లాన్


వారంతా తమ అసంతృప్తిని నేరుగా పార్టీ అధ్యక్షుడు జగన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. బుధవారం సాయంత్రం 3 గంటలకు గన్నవరం నుంచి బైక్ ర్యాలీగా తాడేపల్లి ( Tadepalli 0 వైఎస్ఆర్సీపీ ( YSRCP )  కార్యాలయానికి వెళ్ళేందుకు వంశీ వ్యతిరేక వర్గం ఏర్పాట్లు చేసుకుంది. దుట్టా రామచంద్రరావు వర్గం ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. పోలీసులు అడ్డుకుంటున్నా ఛలో తాడేపల్లి కార్యక్రమం విజయవంతం చేస్తామని గన్నవరం వైసీపీ నేతలు స్పష్టం చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలన్నీ చలో ఉత్తరాంధ్ర- ఇంతకీ అక్కడేముందంటే?


 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన వంశీ. ( Vamsi ) అనంతరం సీఎం జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్‌సీపీ కి మద్ధతుపలికారు. వైఎస్ఆర్‌సీపీలో ఆయనకు వ్యతిరేకంగా పని చేసిన నేతల్లో అసంతృప్తి మొదలైంది. ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. తాజాగా 2024లో పార్టీ టికెట్ ఎమ్మెల్యే వంశీకి కేటాయిస్తే సహకరించమని పార్టీ అగ్రనేతలకు అసమ్మతి వర్గం హెచ్చరికలు చేసింది. నియోజకవర్గంలో వైసీపీకి కొత్త ఇంఛార్జ్ కావాలంటూ వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ‘మన ఇంట్లో శుభకార్యం మనమే చేసుకుందాం.. పక్కింటి వాడికి ఇవ్వొద్దు.. కొత్త ఇంఛార్జ్ కావాలని’.. ఫ్లెక్సీలు వెలిసాయి. 


టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే YSRCP కచ్చితంగా ఓడిపోతుంది: ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు


మరో వైపు వల్లభనేని వంశీ సీఎం జగన్ తనకే టిక్కెట్ ఇస్తారని భావిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో ఆయన వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు. సొంత అనుచరులతోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ఏడాదిలో అసెంబ్లీ, రెండేళ్లలో పార్లమెంట్ ఎన్నికలు - సజ్జల చెప్పింది ఇదేనా ?