Hepatitis A outbreak in Kerala: భారీ వరదలు, కరోనాతో అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రాన్ని మరో విపత్తు కలవరపెడుతోంది. గత కొద్ది రోజులుగా  హెపటైటిస్ A వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ సోకి 2 వేల మందికి పైగా హాస్పిటల్ లో చేరారు. ఈ వైరస్ మలప్పురం, ఎర్నాకులం, కోజికోడ్‌, త్రిసూర్‌ జిల్లాలో మరింత తీవ్ర రూపం దాల్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కేసులు రోజు రోజుకు  పెరుగుతున్న నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించింది. కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాప్తి చెందే హెపటైటిస్ A వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆస్పత్రిలో చేరిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారులను ఆదేశించింది. వైరస్ అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని

  సూచించింది.   


ఇంతకీ హెపటైటిస్ A అంటే ఏంటి?


సాధారణంగా కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్ A వైరస్ సోకుతుంది. వైరస్ వల్ల వచ్చే ఈ వ్యాధిని వైరల్ హెపటైటిస్ అంటారు. ఈ హెపటైటిస్ ను మూడు రకాలుగా విభజించారు. హెపటైటిస్ A, B, C. హెపటైటిస్ A అనేది కాలేయం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. వైరస్ తీవ్రత పెరిగితే కాలేయం పని చేయడం మానేస్తుంది. ముందుగానే హెపటైటిస్ A సోకినట్లు గుర్తిస్తే చికిత్స చేసే అవకాశం ఉంటుంది. లేదంటే కాలేయం మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి చాలా మందిలో హెపటైటిస్ A లక్షణాలు పెద్దగా కనిపించవు. కానీ, కొంత మందిలో వ్యాధి తీవ్రరూపం దాల్చి చనిపోయే అవకాశం ఉంటుంది.


హెపటైటిస్ A ఎలా సోకుతుందంటే?


హెపటైటిస్ A ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తితో శారీరక సంబంధం కలిగి ఉన్నా, రక్త మార్పిడి చేసినా, గర్భిణీల నుంచి పుట్టబోయే పిల్లలకు సోకే అవకాశం ఉటుంది. కాలేయ సమస్యలతో బాధపడే వారిరితో పాటు మద్యం తాగే అలవాటు ఉన్నవారికి హెపటైటిస్ A సోకే అవకాశం ఉంటుంది.  


హెపటైటిస్ A లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు


హెపటైటిస్ A సోకిన వారిలో అలసట, వికారం, వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం, విరేచనాలు, ఎలర్జీ కలుగుతాయి. హెపటైటిస్ A లక్షణాలు పిల్లలతో పోల్చితే పెద్దవారిలోనే ఎక్కువగా కనిపిస్తాయి. హెపటైటిస్ A  సోకుకుండా ఉంటాలంటే, కాచి వడపోసిన నీళ్లు తాగాలి. ఆహారం తీసుకోవడానికి ముందుక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. రోడ్ సైడ్ ఫుడ్ కు దూరంగా ఉండటం మంచిది. బహిరంగ మల విసర్జన చేయకూడదు.


హెపటైటిస్ A నిర్ధారణ ఎలా? చికిత్స ఏంటి?  


హెపటైటిస్ Aను సోకిందా? లేదా? అని తెలుసుకోవాలంటే రక్త పరీక్ష చేసుకోవాలి. ఇమ్యునోగ్లోబులిన్ జి యాంటీబాడీస్ ను గుర్తించే టెస్ట్ ద్వారా హెపటైటిస్ Aను గుర్తించవచ్చు. RT-PCR పరీక్షల ద్వారా కూడా హెపటైటిస్ Aని గుర్తించే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ A సోకిన వాళ్లు పోషకాహారం, పండ్ల రసాలు తీసుకోడంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే హాస్పిటల్ లో చేరాలి. హెపటైటిస్ A టీకా వేసుకోవడంతో పాటు పరిసరాల పరిశ్రుభ్రత ద్వారా హెపటైటిస్ A రాకుండా కాపాడుకోవచ్చు.


Read Also: మీ పిల్లలు టీవీ చూస్తూ ఫుడ్ తింటున్నారా? జరిగేది ఇదే.. జాగ్రత్త!