Husband Stabs Wife : ఇటీవల కాలంలో భర్తలు, భార్యల హత్యలు కలకలం రేపుతున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట హత్య జరిగిన సంఘటనలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం.  తాజాగా హైదరాబాదులో జరిగిన మరో ఘటన సంచలనంగా మారింది. ఓ భార్త కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు.  ఈ నెల 4వ తేదీన హత్య జరుగగా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి కారణం కుటుంబ కలహాలే అని తెలుస్తోంది. ఈ కారణంగానే ఏడడుగులు వేసి.. జన్మనిచ్చిన తనను నమ్మి వచ్చిన భార్యను కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్త సుత్తితో కొట్టి, కత్తితో పొడిచి అతి కిరాతకంగా చంపేశాడు. 


వివరాల్లోకి వెళితే.. బాచుపల్లి బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి అనురాగ్ కాలనీలో నాగేంద్ర  భరద్వాజ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు తన భార్య మధులతను దారుణంగా హతమార్చాడు. మధులత తలపై సుత్తితో కొట్టి.. కత్తితో మెడపై పొడిచి చంపేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ముక్కలు ముక్కలుగా కోసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఇంట్లోని గ్యాస్ లీకేజీ చేసి ప్రమాదం చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.  బాధితురాలు హైదరాబాదులోనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నాగేంద్రని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.


గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నాగేంద్రను అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు. ఈ ఘటన 20 రోజుల క్రితం జరిగినట్లు నిందితుడు నాగేంద్ర రిమాండులో ఉన్నట్లు సీఐ తెలిపారు.  ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  


ఇక వరకట్నం కావాలంటూ తమ కూతురిని వేధించేవాడని మధులత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  కట్నం కోసమే అల్లారు ముద్దుగా పెంచుతున్న తమ కూతురిని అల్లుడు భరద్వాజ్ క్రూరంగా హత్య చేశాడని వారు అంటున్నారు. డబ్బులు తీసుకురావాలంటూ తమ కూతురిని వేధించేవాడని, పలుమార్లు ఈ విషయంలో పెద్ద ఎత్తున గొడవలు అయ్యాయని చెప్పారు. 2020లో వీరిద్దరికీ పెళ్లి జరిగిందని మధులత తల్లిదండ్రులు చెప్పారు. వీరి దాంపత్యానికి గుర్తుగా ఏడాది బాబు ఉన్నాడు. తమ కుమార్తెను భరద్వాజ్‌తో పాటు అతడి తల్లిదండ్రులు కూడా కొట్టేవారని.. వారిపై తాము బాచుపల్లి పీఎస్‌లో కూడా ఫిర్యాదు చేశామన్నారు.  నిందితుడిని కఠినంగా శిక్షించి.. తమ కూతురికి, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.