ముఖానికి నవ్వే అందం. నవ్వితే కనీసం పది దంతాలైనా బయటపడతాయి. ఆ పది దంతాలు పసుపచ్చగా ఉంటే చూసేవారికి అసహ్యంగా అనిపిస్తుంది. సరిగా బ్రష్ చేయకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది.  రోజూ బ్రష్ చేయడంతో పాటూ కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల దంతాలు శుభ్రపడపోతాయి. రోజూ వీటిని తింటే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. 


ఆపిల్స్
రోజుకో ఆపిల్ తింటే వైద్యుడి వద్దకు వెళ్లక్కర్లేదని అంటారు. అది నిజమే. అలాగే దంతాలు కూడా చాలా శుభ్రపడతాయి. దంతాల ఎనామెల్‌ను  శుభ్రపరచడంలో, తెల్లగా మార్చడంలో ఇవి సహాయపడతాయి. అలాగే నోటిలో లాలా జల స్రావాన్ని పెంచుతుంది, తద్వారా నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. ఈ పండ్లను క్రమం తప్పకుండా నమలడం వల్ల దంతాలు బలంగా కూడా మారతాయి. 


స్ట్రాబెర్రీలు
అనేక పోషకాలతో నిండుగా ఉండే పండు ఇది. సి విటమిన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటిని తినడం వల్ల దంతాలు తెల్లగా మారతాయి. పండులో ఉండే ఎంజైమ్ లాలాజల స్రావాన్ని పెంచడం ద్వారా బ్యాక్టిరియా, సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మాలిక్ యాసిడ్, ఎల్లాజిటానిక్‌లు... రెండు ఈ పండులో ఉండడం వల్ల మీ నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పసుపు దంతాలను తెల్లగా మార్చడంలో స్ట్రాబెర్రీలు ముందుంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తినడం మంచిది. 


పుట్టగొడుగులు
శరీరానికి కావాల్సిన విటమిన్ డిని అందించడంలో పుట్టగొడుగులు మొదటి స్థానంలో ఉంటాయి. విటమిన్ డి శరీరానికి అత్యవసరమైన పోషకం. ఇది శరీరం కాల్షియంను గ్రహించేలా చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి మేలు చేస్తుంది. ఎముకలను, దంతాలను బలంగా మారుస్తుంది. ఎండలో ఎండబెట్టిన పుట్టగొడుగులు తిన్నాక శరీరంలో విటమిన్ డి ప్రేరేపిస్తాయి. వీటిని తినడం వల్ల ఎముకల క్షీణత తగ్గుతుంది. దంతాలు కూడా తెల్లగా మారతాయి. 


పైనాపిల్
ఈ పండులోని విటమిన్లు, ఖనిజాలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి. అలాగే దంతాలను తెల్లగా మారుస్తాయి. ఇది సహజమైన స్టెయిన్ రిమూవర్. ఇందులో ఉండే ఎంజైమ్ సహాయంతో బ్యాక్టిరియా పెరుగుదలను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.  ఇందులో ఉండే ఎంజైమ్ పేరు బ్రొమెలైన్. ఇది దంతాల కోతను, చిగుళ్ల వాపును  తగ్గిస్తాయి. ప్రకాశవంతమైన దంతాలను అందిస్తుంది. 


చీజ్
చీజ్‌లో కొవ్వుతో పాటూ కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దృఢమైన ఎముకలు, దంతాల నిర్మాణానికి సహాయపడుతుంది. ఇది మీ దవడ ఎముకలను  బలోపేతం చేస్తుంది. బలమైన ఎముకలు, కీళ్లు, దంతాల కోసం కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలను అధిక మొత్తంలో తినాలి. ఇది ఖనిజాలను శరీరంలో ఉండేలా చేస్తుంది. లాక్టిక్ ఆమ్లం, ఫాస్పరస్ చీజ్‌లో అధికంగా ఉంటుంది. ఇవి దంతక్షయాన్ని తగ్గిస్తుంది.  


Also read: మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అమ్మాయిలు ఇట్టే పడిపోతారు



Also read: మాంసాహారం తినే మహిళలతో పోలిస్తే శాకాహార మహిళల్లోనే ఆ సమస్యలు ఎక్కువ
























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.Al