DGP Rajendranath Reddy: ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేవీ రాజేంద్ర నాథ్ రెడ్డిని ఉత్తమ సేవా పతకం వరించింది. ఆయనకు రాష్ట్రపతి పురస్కారం దక్కింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav) వేడుకల వేళ కేంద్రంలోని ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. 2022 సంవత్సరానికి గానూ కేంద్ర హోం శాఖ ఈ పురస్కారం అందించింది. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గానూ ఆ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
స్వాతంత్ర్య దినోత్సవాల్లో అందజేత
కేంద్రం ప్రకటించిన ఈ రాష్ట్రపతి ఉత్తమ సేవా పతకాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. రిటైర్డ్ ఏఎస్పీ నల్లమిల్లి వెంకట రెడ్డి తన సర్వీస్ కాలంలో అందించిన సేవలకూ మెడల్ వచ్చింది. కేంద్ర హోం శాఖ ఆయనకు పోలీస్ మెడల్ ప్రకటించింది. సబ్ ఇన్ స్పెక్టర్ వెంకట రెడ్డి 1989 బ్యాచ్ కు చెందిన వారు. ఆయన పోలీసు శాఖలో విశేష సేవలు అందించారు. తన సర్వీసులో ఎన్నో కేసులను చేధించారు. సబ్ ఇన్ స్పెక్టర్, ఇన్ స్పెక్టర్, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీగా వెంకట రెడ్డి అనేక హోదాల్లో విధులు నిర్వర్తించారు.
మరికొంత మందికి పతకాలు..
ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శిక్షణ విభాగం ఐజీ, సీనియర్ ఐపీఎస్ అధికారి పి. వెంకట రామి రెడ్డికి రాష్ట్రపతి పతకం లభించింది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం రిజర్వు ఇన్ స్పెక్టర్ జె. శాంతా రావు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్సై నారాయణ మూర్తికి పోలీసు సేవా పతకాలు వరించాయి. గ్రే హౌండ్స్ విభాగం అసిస్టెంట్ అసాల్ట్ కమాండర్ మండ్ల హరి కుమార్, జూనియర్ కమాండోలు ముర్రే సూర్య తేజ, పువ్వల సతీష్ లకు శౌర్య పతకాలు లభించాయి. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రంలో మొత్తం ఆరుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ఈ పతకాలు ప్రకటించింది.
కేశవ రావుకు ఉత్తమ సేవా పతకం..
ముంబయి పోర్టులో సీఐఎస్ ఎఫ్ ఇన్ స్రక్టర్ గా విధులు నిర్వర్తించే శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీ పురం గ్రామానికి చెందిన కేశవ రావు లఖినాన 2020 సంవత్సరానికి గానూ రాష్ట్రపతి పోలీసు ఉత్తమ సేవా పతకానికి ఎంపిక అయ్యారు. లఖినాన కేశవరావు 1982 లో సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరారు. తర్వాత అంచలంచెలుగా పైకి ఎదిగారు. 1997 గణతంత్ర దినోత్సవంలో పోలీసు మెడల్ కూడా అందుకున్నారు కేశవ రావు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఎన్. సుబ్బారావుకు పోలీస్ మెడల్ అందుకున్నారు. ఈ పోలీసు మెడల్ ను రాష్ట్రపతి స్వయంగా ఎన్. సుబ్బా రావుకు అందించనున్నారు. సోమవారం దిల్లాలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో రాష్ట్రపతి ఈ పురస్కారం అందించనున్నారు. సుబ్బా రావు సికింద్రాబాద్ జోనల్ పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్ లో ఇన్ స్ట్రక్టర్ గా పని చేస్తున్నారు.
Also Read: Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!