పురుష-స్త్రీ సంబంధం సృష్టికే మూలం. ఒకరికి ఒకరు ఆకర్షితులైతేనే వారి బంధం ముందుకు సాగేది. తమకు నచ్చిన అమ్మాయిలను ఆకర్షించేందుకు, వారికి నచ్చేలా కనిపించేందుకు  చాలా ప్రయత్నాలు చేస్తారు. కేవలం అందమైన డ్రెస్సింగ్ మాత్రమే కాదు, వారిలో కొన్ని గుణాలు కూడా అమ్మాయిలను ఆకర్షిస్తాయి. మీకు ఈ లక్షణాలు ఉంటే మీ లేడీ లవ్ మీకు కచ్చితంగా పడిపోతుంది. 


సెన్స్ ఆఫ్ హ్యుమర్
మహిళలు సీరియస్ ముఖం పెట్టుకుని ఉండే వ్యక్తులను ఇష్టపడరు. తమను నవ్వించే వ్యక్తి కావాలని కోరుకుంటారు. నవ్వని వ్యక్తులను చూడటానికే పెద్దగా ఇష్టపడరు. కాబట్టి హ్యాసచతురతను పెంచుకోండి. అంతేకాదు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తులు సాధారణంగానే తెలివైనవారిగా కూడా ఉంటారు. 


పరిశుభ్రత
బ్రాండెడ్ దుస్తులు వేసుకుని, ముఖానికి పౌడర్ పూసుకుంటే పరిశుభ్రత వచ్చేయదు. అది మీ నడతలోనే ఎదుటివారికి అర్థమవుతుంది. స్టైలిష్ లుక్స్ పరిశుభ్రతకు సంకేతం కాదు. కాబట్టి మీరుండే పరిసరాలు, నడవడిక కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. చిన్న చిన్న అంశాలే మహిళలను త్వరగా  ఆకర్షిస్తాయి.


నమ్మకం
ఏ వ్యక్తినైనా ఆకట్టుకునేది నిజాయితీ, నమ్మకం. అలాగే ఆత్మ విశ్వాసం. మీమీద మీకుండే నమ్మకం, ఆత్మ విశ్వాసం ఎదుటి వారిని త్వరగా ఆకర్షిస్తాయి. అందమైన రూపానికి, దీనికి సంబంధం లేదు. అందమైన రూపం లేకపోయినా మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టేది మీ ఆత్మ విశ్వాసమే. 


గడ్డం ఉండాలా?
చాలా మంది మగవారికి ఉన్న సందేహం ఇది.స్త్రీలు గడ్డం ఉండే మగవారిని ప్రేమిస్తారా? లేక లేనివారిని ఇష్టపడతారా? అని. అది పూర్తిగా వ్యక్తిగత మైనది. కొందరు అమ్మాయిలు గడ్డం ఉన్న మగవారు మ్యాన్లీగా కనిపిస్తారు. మరికొందరికి గడ్డం లేకపోతే ఆకర్షణీయంగా ఉంటారు. కాకపోతే గడ్డం ఉన్నవారు దాన్ని నీట్ గా మెయింటేన్ చేయాలి. గడ్డం మాసిపోయినట్టు ఉంటే మాత్రం ఏ ఒక్క అమ్మాయి మీ వైపు తిరగదు. 


సురక్షితం అనిపించాలి
ప్రతి స్త్రీ మగవారి నుంచి కోరుకునేది సేఫ్టీ. ఎవరి దగ్గరైతే అన్ని రకాలుగా సురక్షితం అనిపిస్తుందో, తనను ఎలాగైనా రక్షించుకుంటాడనే నమ్మకం కలుగుతుందో అతడిని ఆమె వదలదు. అలాగే బాడీ బిల్డర్లను ఇష్టపడుతుందనుకుంటే మీ భ్రమే. కేవలం సామాజికంగా, ఆర్ధికంగా ఆమెకు సురక్షితం అనిపిస్తేనే, తను మీ వెంట నడుస్తుంది. 


మెచ్చుకుంటేనే...
ఒక విషయంలో మాత్రం మీకు చాలా ఓపిక ఉండాలి. ఎవరైతే తమను అధికంగా మెచ్చుకుంటారో, పొగుడుతారో వారికి అమ్మాయిలు త్వరగా ఆకర్షితులవుతారు. కాబట్టి పొగడడంవ్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. ‘నీ డ్రెస్ అదిరిపోయింది, ఈ రోజేంటి ఇంతందంగా ఉన్నావ్....’ ఇలా ఏదో ఒక రకంగా పొగుడుతూ ఉండాలి. 


స్వతంత్రత
అమ్మ చెప్పింది, నాన్న చేయమన్నారు.... ఇలా మాట్లాడేవారిని అమ్మాయిలు ఇష్టపడరు. సొంత నిర్ణయాలు తీసుకునేవారిని ఇష్టపడతారు. అంతేకాదు ఇంటిపనుల్లో సాయం చేసే లక్షణం ఉన్న వారిని ఇంకా ఇష్టపడుతుంది. ఫ్యామిలీ మేన్‌‌గా భావిస్తుంది.  


Also read: పాము తనను కాటేసిందని కోపంతో రెండేళ్ల పాప ఏం చేసిందంటే


Also read: మాంసాహారం తినే మహిళలతో పోలిస్తే శాకాహార మహిళల్లోనే ఆ సమస్యలు ఎక్కువ