ఏడాది వయసు వరకు ఏడుపు, అలగడం, నవ్వడం వంటి రియాక్షన్లు మాత్రమే పిల్లల్లో కలుగుతాయి. పదిహేను నెలలు వచ్చే సరికి కోపం కూడా ప్రదర్శిస్తారు. ఇక రెండేళ్ల వయసుకు వారిలో చాలా ఎమోషన్స్ కలుగుతాయి. అంటే వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లలకు శరీరంలోని హార్లోన్లు ఒక్కో రియాక్షన్‌ను పరిచయం చేస్తుంటాయి. అంతెందుకు రెండేళ్ల పిల్లలను ఎవరైనా సరదాగా కొట్టి చూడండి, చాలా మంది తిరిగి కొడతారు. అంతేకాదు రెండు మూడు సార్లు వారిపై విసుక్కుంటే మీ దగ్గరకు వచ్చేందుకు కూడా ఇష్టపడరు. పిల్లల్లోనూ ఎమోషన్స్ అధికమే. అలాగే కోపం కూడా. టర్కీలోని రెండేళ్ల పిల్ల తనను కాటేసినందుకు ఆ పాము పని పట్టేసింది. అసలేమైందంటే...


పాప పేరు సే. అసలు పేరేంటో తెలియదు కానీ, అందరూ ముద్దుగా సే అని పిలుచుకుంటారు. టర్కీలోని ఓ గ్రామంలో తల్లిదండ్రలతో కలిసి నివసిస్తోంది. ఇంటి వెనుక పెరడులో ఆడుకుంటోంది. ఈ లోపు ఏడుపు వినిపించాయి. పక్కింటి వారు వెంటనే తమ ఇంటి పెరడు నుంచి చూసే సరికి రెండేళ్లే సే పామును కొరికేసి ఏడుస్తోంది. వెంటనే తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాప నోట్లోంచి పామును తీసేశారు. ఆమె పెదవులపై పాము కాటేసిన గుర్తులు ఉన్నాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తే ప్రాణాపాయం తప్పింది. పాప ఆడుకుంటున్న చోటకి ఓ పాము వచ్చింది. పాప దాన్ని బొమ్మ అనుకుని చేత్తో పట్టుకుంది. అది కాస్త పెదాలపై కాటేయగానే చిట్టి పాపకు చాలా కోపం వచ్చేసింది. వెంటనే దాన్ని కొరికి చంపేసింది. కానీ అది విషపు పాము. వెంటనే చికిత్స అందడంతో పాప దక్కింది. 


తనను కాటేసిన వెంటనే పాప పామును చంపేసింది. సే చాలా చురుకుగా ఉంటుందని, ఎవరైనా తనను తిట్టినా, కొట్టినా ఊరుకోదని చెబుతోంది వాళ్లమ్మ. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యమైతే మాత్రం చిట్టితల్లి ప్రాణాలకు ప్రమాదం అయ్యేది. పామును చూసి ఆమె భయపడకపోవడం మాత్రం చాలా ఆశ్చర్యమేస్తోంది జనాలకి. ‘నా కూతురిని ఆ దేవుడే కాపాడాడు’ అంటున్నాడు చిన్నారి తండ్రి. 


Also read: కొత్తగా పెళ్లయిన జంటల కోసమే ఈ కిళ్లీ, మొదటి రాత్రికే ప్రత్యేకం


మనదేశంలో...
కర్ణాటకలో కూడా ఓ వీడియో రెండురోజులుగా వైరల్ అవుతోంది. ఓ తల్లి తన నాలుగేళ్ల పిల్లాడిని స్కూలుకు పంపేందుకు రెడీ చేసి బయటికి తీసుకొచ్చింది. పిల్లాడికి చాలా దగ్గర్లోనే ఎనిమిది అడుగుల పొడవున్న పెద్ద పాము మెట్ల కింద అంచున ఉంది. అది పిల్లాడిని కాటేసేందుకు సిద్ధమైంది. అదే సమయంలో చూసిన తల్లి తన పిల్లాడిని చటుక్కున లాగి ఎత్తుకుని దూరంగా పరిగెట్టింది. రద్దీగా ఉండే ప్రాంతంలోనే అంత పెద్ద పాము తిరగడం చాలా భయాందోళనలకు గురి చేసింది. 


Also read: ఎయిర్ ఫ్రైయర్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు ముందుగా తెలుసుకోండి