Juices to reduce LDL cholesterol naturally : ప్రతి మనిషి ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ అవసరం. కానీ అది మంచి కొలెస్ట్రాల్. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే లేనిపోని ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు కలుగుతాయి. LDL(లో డెన్సిటి లిపోప్రోటీన్) కొలెస్ట్రాల్​నే.. చెడు కొలెస్ట్రాల్ అంటారు. ఇది ధమనులలో ఫలకం ఏర్పరిచి.. గుండె సమస్యలను, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమస్యలను తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. అలాగే కొన్ని డ్రింక్స్ డైట్​లో చేర్చుకోవాలి. అవేంటంటే..


ఎంత కొలెస్ట్రాల్ ఉండాలంటే..


ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలో 100 mg/dL కంటే తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉండాలి. 130-159 mg/dL ఇది బోర్డర్ లైన్ అయితే.. 160-189 mg/dL ఇది అధిక మోతాదును సూచిస్తుంది. ట్రాన్స్ ఫ్యాట్, ఆహారంలోని కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవడంవల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఊబకాయం, ధూమపానం, ఫ్యామిలీలో హై కొలెస్ట్రాల్ ఉన్నా.. ఇతరాత్ర ఆరోగ్య సమస్యలు ద్వారా కూడా ఇది పెరుగుతుంది. 



ఆరోగ్య సమస్యలివే


చెడు కొలెస్ట్రాల్ రక్తప్రవాహంలోని కొలెస్ట్రాల్​ను రవాణా చేసే లిపో ప్రోటీన్ ప్రధాన సమూహాలలో ఒకటి. ఇది కాలేయం నుంచి పరిధీయ కణజాలాలకు కొలెస్ట్రాల్​ను తీసుకెళ్తుంది. ఇది కాలేయంలో, ముఖ్యంగా గుండెలోని ధమనుల గోడలలో పేరుకుపోయి వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. పెరిఫెరల్ ఆర్టరీ ప్రభావం పెరుగుతుంది. బరువు పెరుగుతారు. మధుమేహ సమస్యలను పెంచుతుంది. అందుకే కొన్ని డ్రింక్స్​ను రెగ్యూలర్ డైట్లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో.. వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


టొమాటో జ్యూస్


శరీరంలోని చెడు కొలెస్ట్రాల్​ని తగ్గించి.. గుండె సమస్యలను దూరం చేసుకోవడంలో టొమాటో జ్యూస్ మంచి ఫలితాలు ఇస్తుందట. టొమాటోలను నీళ్లతో కలిపి బ్లెండ్ చేసి.. ఆ ప్యూరీని వడకట్టి జ్యూస్​ చేసుకోవాలి. దీనిని రెగ్యూలర్​గా, మోతాదులో తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేయడమే కాకుండా గుండె సమస్యలను దూరం చేస్తాయి. 


బీట్ రూట్ జ్యూస్


మీ డైలీ రోటీన్​లో బీట్​ రూట్ జ్యూస్ తీసుకుంటే ఆరోగ్యానికి, అందానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. బీట్​రూట్​ను ముక్కలు చేసి బ్లెండ్ చేసుకోవాలి. దానిలో నీరు వేసి జ్యూస్ తీసుకోవాలి. దీనిలో కాస్త నిమ్మకాయ వేసి తాగాలి. దీనిలో న్యూట్రిషన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్​ని తగ్గిస్తాయి. గుండె సమస్యల్ని దూరం చేస్తాయి. 



మరెన్నో..


ఇవేకాకుండా సోయా మిల్క్, ఓట్​ మిల్క్​ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్​ని దూరం చేయడంలో మంచి ఫలితాలు ఇస్తాయట. ఈ విషయాన్ని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్​ తన అధ్యయనంలో గుర్తించింది. ఈ జ్యూస్​లు శరీరానికి ఆరోగ్యప్రయోజనాలు అందించడంలో హెల్ప్ చేస్తాయట. ముఖ్యంగా కొలెస్ట్రాల్​ని దూరం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయట. 


జీవన శైలిలో మార్పులు


తీసుకునే ఆహారంలో ఫ్యాట్స్ తగ్గించడం, ఫైబర్ ఫుడ్ తీసుకోవడం, అవకాడో, నట్స్​లాంటి ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. రెగ్యూలర్​గా వ్యాయామం చేయాలి. బరువును కంట్రోల్ చేయాలి. ముఖ్యంగా స్మోకింగ్​కి దూరంగా ఉండాలి. మద్యం లిమిట్ చేయాలి. వైద్యుల సహాయం కచ్చితంగా తీసుకోవాలి. వారు ఇచ్చే మందులను రెగ్యూలర్​గా తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్​ని తగ్గించి హెల్తీ లైఫ్​ని లీడ్ చేయవచ్చు. 


Also Read : దాల్చిన చెక్క టీని ఇలా తాగితే కొలెస్ట్రాల్ కంట్రోల్​లో ఉంటుంది.. మరెన్నో బెనిఫిట్స్ కూడా








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.