భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సరికొత్త కృత్రిమ అవయవాన్ని తయారు చేసింది. తాజాగా అభివృద్ధి చేసిన 'మైక్రోప్రాసెసర్-నియంత్రిత మోకాలు(MPK)' త్వరలో మార్కెట్లోకి రానున్నది. అత్యంత తేలికైన ఈ కృత్రిమ అవయవం దివ్యాంగులకు ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కృత్రిమ అవయవాలతో పోల్చితే ఈ అవయవం సుమారు 10 రెట్లు చౌకగా లభించనున్నట్లు తెలుస్తున్నది. ఈ ఆర్గాన్ మోకాళ్లపై ఉన్న ఆంప్యూటీస్ సాయంతో సౌకర్యవంతంగా నడిచేలా సహాయ పడుతుందని ఇస్రో వెల్లడించింది.






ఇస్రో అభివృద్ధి చేసిన కృత్రిమ అవయవానికి సంబంధించి కీలక విషయాలు..  


1. ఇస్రో రూపొందించిన  మైక్రోప్రాసెసర్-నియంత్రిత మోకాలు కేవలం 1.6 కిలోల బరువు ఉంటుంది.  అంగవైకల్యం కలిగిన వ్యక్తి సుమారు 100 మీటర్ల దూరం నడిచేలా వీలు కల్పిస్తుంది. ఇంకా ఎక్కువ దూరం నడిచేలా అభివృద్ధి చేస్తున్నట్లు ఇస్రో తెలిపింది. 


2. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC), ISRO ఈ MPKలను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ (NILD), దీనదయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజెబిలిటీస్ (దివ్యాంగజన్)తో కలిసి రూపొందించాయి. ఆర్టిఫిషియల్ లింబ్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ALIMCO) కూడా ఇందులో భాగస్వామ్యం అయినట్లు ఇస్రో తెలిపింది.  


3. ఈ కృత్రిమ అవయవం సెన్సార్ డేటా ఆధారంగా..  మైక్రోప్రాసెసర్ నడక స్థితిని గుర్తిస్తుంది. ఈ అవయవాన్ని వాడే దివ్యాంగుడికి మరింత సౌకర్యాన్ని కలిగిస్తుంది. PC ఆధారిత సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి ఆంప్యూటీలకు ప్రత్యేకమైన వాకింగ్ పారామీటర్‌లను ఏర్పాటు చేస్తారు. ఇది చక్కటి నడక అనుభూతిని కలిగిస్తుంది.


4. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న MPKల ధర భారీగా ఉంది. సుమారు రూ.10 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు ఉంటుంది. అయితే, ఇస్రో రూపొందించిన ఈ MPKల ధర కేవలం రూ.4 నుంచి రూ. 5 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.   


5. సైజ్ పరంగా MPKల ఆప్టిమైజేషన్ జరుగుతోంది.  మరింత సౌలభ్యం కోసం అధునాతన ఫీచర్లతో అంగవైకల్యం ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నడిచే అవకాశం ఉంటుందని ఇస్రో తెలిపింది.


Also Read: నడవలేని స్థితిలో మైక్ టైసన్‌, ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!


Also Read: ‘బ్లాక్ కాఫీ’ ప్రేమలో షారుఖ్, రితేష్‌ - దీని ప్రయోజనాలు తెలిస్తే మీరూ లవ్‌లో పడిపోతారు