Hindi Controversy | హిందీ జాతీయ భాష? కాదా? అనే అంశంపై మరోసారి జోరుగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చే నడుస్తోంది. ఇందుకు కారణం.. కన్నడ హీరో కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ మధ్య చోటుచేసుకున్న ట్విట్టర్ యుద్ధమే కారణం. “ఒక కన్నడ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో తీశారని అంటున్నారు. కానీ, చిన్న కరెక్షన్ ఏమిటంటే హిందీ ఇకపై జాతీయ భాష కాదు’’ అని అన్నారు. దీనిపై స్పందించిన అజయ్ దేవగన్.. హిందీ జాతీయ భాష కాకపోతే కన్నడ చిత్రాలను హిందీలోకి ఎందుకు అనువాదిస్తున్నారని ప్రశ్నించారు. అప్పటి నుంచి ఈ వివాదం సాగుతూనే ఉంది. ఏ సెలబ్రిటీ ప్రెస్ మీట్ పెట్టిన విలేకరులు వారిని ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పటికే దీనిపై నటి కంగనా రనౌత్, గాయకుడు సోను నిగమ్ క్లారిటీ ఇచ్చారు. భాషల పేరుతో ఎందుకు ప్రజలను విడగొడుతున్నారని ప్రశ్నించారు. 


అంతా ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఇండియాకు ప్రత్యేకంగా జాతీయ భాషంటూ ఏదీ లేదు. భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో గుర్తింపు పొందిన 22 భాషల్లో హిందీ భాష కూడా ఒకటి. 1950లో తెలుగు, తమిళం, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కశ్మీరీ, మలయాళం, మరాఠీ, ఒరియా, హిందీ తదితర 14 భాషలను కలిపి ఒక జాబితాను రూపొందించారు. హిందీని జాతీయ కానప్పటికీ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) దేవనాగరి లిపి హిందీ, ఇంగ్లీష్ భాషలను అధికారిక భాషలుగా పేర్కొంది. అంటే, హిందీ కేవలం అధికారిక భాష మాత్రమే. దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష కాబట్టి.. పరిపాలన సౌలభ్యం కోసం హిందీ, ఇంగ్లీష్ భాషలకు ఆ హోదా ఇచ్చారంతే. 


Also Read: ‘హిందీ’ వివాదంలో చిక్కుకున్న సుహాసిని, ‘మీకంటే సోనూ నిగమ్ బెటర్’ అంటున్న దక్షిణాది జనం!


వ్యత్యాసం ఏమిటీ?: ఒక వేళ హిందీ భాషను జాతీయ భాషగా ప్రకటించినట్లయితే అది దేశంలోని సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుసంధించాలి. అప్పుడు హిందీని అంతా దేశ భాష లేదా జాతీయ భాష అని అంటారు. అధికారిక భాష అనేది ప్రజలకు లేదా దేశం ఉపయోగించే భాషను సూచించదు. అది కేవలం ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే అది కేవలం పరిపాలన భాష మాత్రమే. ప్రస్తుతం హిందీ దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష. అయితే, కారణంతో దాన్ని జాతీయ భాషగా గుర్తించాల్సిన అవసరం లేదనే వాదన ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మనుగడ కోసం ఈ భాష తెలిసి ఉండాలి. ఇండియాలో అన్ని భాషలకు కలిపి ఒక ఉమ్మడి భాష ఉంటే దేశంలో సత్సంబంధాలు మెరుగవుతాయనే వాదన కూడా ఉంది. కానీ, ఇందుకు అన్ని రాష్ట్రాల ఆమోదం ఉండాలి. అధికారిక భాష అంటే జాతీయ భాషే అనే వాదనలో వాస్తవం లేదు. అలా పరిగణిస్తే.. రాజ్యాంగంలో పేర్కొన్న ఇంగ్లీష్ కూడా ఇండియాకు జాతీయ భాష అవుతుంది. మన పాఠశాలల్లో హిందీని ‘అధికార భాష’ హోదాతోనే బోధిస్తున్నారు. 


Also Read: చేతి వేళ్లు విరుచుకొనే అలవాటుందా? ‘మెటికలు’పై డాక్టర్ ఏం చెప్పారో చూడండి