Face Reading:
ఫిజియోగ్నమీ ఏం చెబుతోంది..?
గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తుంది..అని మన ఓ హిట్టు పాట తెలుసు కదా. నిజమే..మన మనసులో ఏముందో అదే కళ్లలో రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు. కాస్త పొయెటిక్‌గా చెప్పాలంటే మన "Soul"ని చూపించే కిటికీలు..కళ్లు. అంటే..ఈ విండోస్ నుంచి చూస్తే మనమేంటో తెలిసి పోతుంది. కళ్ల గురించి చాలానే చెప్పుకుంటున్నాం. కానీ..మన మొఖంలో ఉండే ఇతర అవయవాలూ మనమేంటో చెబుతాయట. దీన్నే ఫిజియోగ్నమీ (Physiognomy) అంటారు. కాస్త వాడుక భాషలో చెప్పాలంటే ఫేస్ రీడింగ్ (Face Reading) అన్నమాట. మన ఫేస్ ఫీచర్స్, ఎమోషన్స్‌ని బట్టి మన క్యారెక్టర్ ఏంటో చెప్పగలగటమే...ఈ ఫేస్ రీడింగ్ కాన్సెప్ట్. సైన్స్‌లో ఉన్న ఎన్నో థియరీల్లో ఇది కూడా ఒకటే అయినా... ఎందుకో పెద్దగా గుర్తింపు రాలేదు. బహుశా ఇది "ప్రామాణికం" అని తేల్చిన వారు ఎవరూ లేకపోవటం వల్ల కావచ్చు. లేదంటే..కేవలం ఇదో మిథ్ (Myth) అని కొట్టి పారేయటం వల్ల అయుండొచ్చు. ఇదంతా పక్కన పెడితే..అసలు ఈ ఫేస్ రీడింగ్ అనేది నిజమేనా...అన్నదే ఇంట్రెంస్టింగ్ పాయింట్. మన ముఖం ఎంత వెడల్పుగా ఉంది..? ముక్కు ఎంత పొట్టిగా ఉంది..అనే లెక్కలతో మనమేంటో చెప్పేయొచ్చా..?
ఫేస్ రీడింగ్‌పై రీసెర్చ్..
ఓ వ్యక్తి మొహం చూసి అతనెలాంటి వాడో చెప్పొచ్చా..? అని అడిగితే రకరకాల సమాధానాలు వినిపిస్తాయి. అలా ఎలా జడ్జ్ చేస్తాం అని కొందరంటే...అవును చెప్పేయొచ్చు అని ఇంకొందరంటారు. ఆస్ట్రేలియన్ ప్రొఫెసర్, రీసెర్చర్ అలన్ స్టీవెన్స్ మాత్రం ఈ ప్రశ్నకు తన థియరీతో బదులిస్తాడు. ఓ వ్యక్తి ముఖం చూసి అతని క్యారెక్టర్‌ని అంచనా వేయటమే కాదు...అతడు లేదా ఆమె ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది కూడా చెప్పొచ్చు అని చాలా స్పష్టంగా వివరణ ఇచ్చారు స్టీవెన్స్. ఫేస్ రీడింగ్‌కు (Face Reading) సంబంధించి రీసెర్చ్ చేసి ప్రత్యేకంగా ఓ సిద్ధాంతాన్ని కనిపెట్టినా...స్టీవెన్స్ థియరీని మాత్రం సైన్స్ వరల్డ్ గుర్తించలేదు. కానీ...ఫిజియోగ్నమీకి సంబంధించిన అధ్యయనాల్లో ఆయన చేసిన రీసెర్చ్ ఎప్పటికీ గుర్తుండిపోయేదే. ఇందుకోసం ఆయన అంతకు ముందు రీసెర్చర్ల సాయం తీసుకున్నారు. పాల్ ఏక్‌మన్, ఎడ్వర్డ్ విన్సెంట్ జోన్స్ లాంటి వాళ్లూ ఫేస్ రీడింగ్‌పై పరిశోధనలు చేశారు.
స్టీవెన్స్ థియరీ ఏంటి..?
నేచర్ (Nature),నర్చర్ (Nurture).స్టీవెన్స్ ఫేస్ రీడింగ్ థియరీలో ఈ రెండు పదాలు చాలా ముఖ్యమైనవి. ఓ వ్యక్తి ఫేషియల్ ఫీచర్స్ ఆధారంగా తన గుణం (Nature) ఏంటో చెప్పటమే కాకుండా, తాను ఎలా పెరిగాడు (Nurture) అనేది కూడా చెప్పొచ్చు అనేది స్టీవెన్స్ చెప్పిన మొట్టమొదటి విషయం. ఫేషియల్ ఫీచర్స్‌ని చూసి దాదాపు 7 లక్షణాలను గుర్తించొచ్చని చెప్పారాయన. దీన్నే Seven Traits థియరీ అంటారు. ఆ 7 లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆత్మవిశ్వాసం (Confidence):
ఓ వ్యక్తి ముఖం వెడల్పు, పొడవు నిష్పత్తి (Ratio) ఆధారంగా అతడు లేదా ఆమె ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో చెప్పొచ్చు. ఓ వ్యక్తి ముఖం 60% మేర వెడల్పు ఉంటే అతడు లేదా ఆమె చాలా జాగ్రత్తగా (Cautious) ఉంటారు. అంటే ప్రతి పనీ చాలా ఆచితూచి చేస్తారు. అదే ముఖం 70% మేర వెడల్పు ఉన్న వ్యక్తులు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు.
2. ఫ్రెండ్లీనెస్:
ఫిజియోగ్నమీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే...కంటి పై భాగం నుంచి కనుబొమ్మ(Eyebrow) మధ్య దూరాన్ని బట్టి ఆ వ్యక్తి ఫ్రెండ్లీగా ఉంటాడా లేదా అన్ని చెప్పొచ్చు. కనుబొమ్మలు కాస్త ఎత్తుగా ఉండే వ్యక్తులు ఎక్కువగా తమ పర్సనల్ స్పేస్ (Personal Space)లో ఉండేందుకే ఇష్టపడతారన్నది స్టీవెన్స్ చెప్పే థియరీ. అదే..కనుబొమ్మలు కంటిపై భాగం నుంచి తక్కువ దూరంలో..తక్కువ ఎత్తులో ఉంటే ఆ వ్యక్తి ఫ్రెండ్లీగా ఉంటాడు.
3. సహనం (Tolerance)
రెండు కళ్ల మధ్య ఉన్న దూరాన్ని బట్టి ఆ వ్యక్తి సహనంగా ఉంటాడా లేదా అని చెప్పొచ్చు అంటాడు స్టీవెన్స్. రెండు కళ్ల మధ్య హారిజాంటల్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి చాలా సహనంగా ఉంటాడని, తక్కువగా ఉంటే కోపం అధికంగా ఉంటుందని చెబుతోంది స్టీవెన్స్ థియరీ.
4. హాస్య చతురత (Sense Of Humor)
ముక్కు పై భాగానికి, పై పెదవికి మధ్య ఉండే ఖాళీని ఫిల్ట్రమ్ (Philtrum) అంటారు. ఈ ఫిల్ట్రమ్ ఎక్కువగా ఉండే వ్యక్తుల్లో డ్రై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అంటే...చాలా కామ్‌గా, పెద్దగా నవ్వకుండా సింపుల్‌గా జోక్స్ వేస్తారన్నమాట. అదే...ఫిల్ట్రమ్ తక్కువగా ఉండే వ్యక్తుల్లో
సెన్స్ ఆఫ్ హ్యూమర్ తక్కువగా ఉంటుంది. వేరే వాళ్లు వీరిపై జోక్‌లు వేసినా చాలా పర్సనల్‌గా తీసుకుని హర్ట్ అయిపోతారు.
(Image Credits: Health Jade)
5.కరుణ (Generosity):
పెదాల తీరుని బట్టి ఆ వ్యక్తిలో దయాగుణం ఉందా లేదా చెప్పొచ్చు. పెదాలు థిక్‌గా ఉన్న వాళ్లు చాలా కూల్‌గా, ఎదుటి వారి పట్ల దయగా ఉంటారు. వారి ఎమోషన్స్‌ని అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా మాట్లాడతారు. అదే..పెదాలు థిన్‌గా ఉన్న వాళ్లు చాలా తక్కువగా మాట్లాడతారు. వీరిలో కరుణ అనే క్వాలిటీ కూడా తక్కువగా ఉంటుంది.
6. అనలటికల్ వ్యూ (World View):
కనురెప్పల (Eyelid) సైజ్‌ని బట్టి ఆ వ్యక్తి ఎంత అనలటికల్‌గా ఉంటాడు..? ఎంతో బ్రాడ్‌గా ఆలోచిస్తాడు అనేది తెలిసిపోతుంది. ఈ కనురెప్పల సైజ్ ఎక్కువగా, చాలా మందంగా ఉంటే వాళ్లు చాలా అనలిటికల్‌గా ఉంటారు. అదే పల్చగా, తక్కువగా ఉన్న వాళ్లు కేవలం చెప్పిన పని చేసుకుంటూ వెళ్లిపోతారు. కొత్తగా ఏమీ ఆలోచించరు.
7. ఆకర్షించే గుణం (Magnetism)
కళ్ల రంగు ఆధారంగా ఆ వ్యక్తి, ఇతరులను ఎంత అట్రాక్ట్ చేస్తాడో తెలుస్తుంది. నలుపు కానీ, నీలం కానీ..కళ్ల రంగు ఏదైనా...అది చాలా థిక్‌గా (Deeper-Colored) ఉంటే ఆ వ్యక్తి చాలా సులువుగా అందర్నీ ఆకట్టుకుంటాడు.
Also Read: Dog Breeds: పిల్లల కోసం శునకాన్ని పెంచాలనుకుంటే ఈ జాతి శునకాలే బెటర్, ప్రేమగా ఉంటాయ్