ఆగస్టు మొదటి వారంలో కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ నేతలంతా అమిత్‌షాను సత్కరించారు. అమిత్‌షా రాక సందర్భంగా మునుగోడు కాషాయవర్ణం సంతరించుకుంది. ఎటు చూసినా జననే కనిపిస్తున్నారు. ఈసందర్భంగా ప్రసంగించిన నేతలు కేసీఆర్‌, ఆయన కుటుంబంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


మునుగోడు నుంచే కేసీఆర్‌ పతనం ప్రారంభం: రాజగోపాల్‌రెడ్డి


తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు రాజగోపాల్ రెడ్డి. తనను కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే తాను పార్టీ మారుతున్నానని అన్నారు. తాను ఎందుకు రాజీనామా చేశానో? పార్టీ ఎందుకు మారుతున్నానో తెలియాలనే ఈ సభ పెట్టామన్నారు. మునుగోడు ప్రజలపై విశ్వాసంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రాణం పోయినా మునుగోడు ప్రజలు తలదించుకునే పని చేయబోను అని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందని.. ఈ యుద్ధంలో ప్రజలు ధర్మంవైపు నిలబడాలని సూచించారు రాజగోపాల్‌రెడ్డి. 


తనను ఎన్నుకున్న ప్రజల కోసం ఎన్నో చేద్దామనుకున్నాను అన్న రాజగోపాల్‌... దీనిపై మాట్లాడేందుకు తనకు సీఎం ఎప్పుడూ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు. అందుకే ప్రజల కోసం ముందుకు వచ్చి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించానని వివరించారు. అప్పుడే కొత్త మండలాన్ని ప్రకటించారని రాజగోపాల్ గుర్తు చేశారు. ఇప్పుడు తన రాజీనామాతో ఉపఎన్నికలు వస్తే ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్‌ వస్తారని చెప్పాను. అలాగే కేసీఆర్‌ బయటకు వచ్చారు....సభ పెట్టారు అన్నారు.


"పార్టీలకు అతీతంగా తెలంగాణవాదులంతా ఏకమవ్వాలని.. కుటుంబ పాలనను బొందపెట్టాలన్నారు రాజగోపాలల్‌. తెలంగాణ వచ్చాక బాగుపడింది ఎవరని ప్రశ్నించారు. యువకులకు ఉద్యోగాలు రాలేదు కానీ... కేసీఆర్‌ కుటుంబానికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా చంపుకుంటారు కానీ... ఆత్మగౌరవాన్ని కాదన్న రాజగోపాల్‌... కొందరు వ్యక్తులు కేసీఆర్‌ కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఈ ఎన్నికలు వ్యక్తి కోసమో పదవి కోసమో రాలేదన్నారు. తెలంగాణ గౌరవం కోసం వచ్చిన ఎన్నికల్లో మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలా వద్దా అని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ను బొంద పెట్టాలంటే ప్రజలు ఓ గట్టి తీర్పు ఇవ్వాలని అన్నారు. 


"ఏ రోజు అమిత్‌షాను కలిశానో... ఆ రోజు నుంచి కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదన్నారు రాజగోపాల్. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో దోచుకున్న సొమ్ముతో నాయకులను కొంటున్నారన్న ఆయన... నాయకులు వాళ్లవైపు ఉంటే ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని తెలిపారు. తప్పు చేయకపోతే... ఈడీ బోడీ  ఎందుకు కలలోకి వస్తున్నాయని ఎద్దేవా చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్న రాజగోపాల్‌..కేసీఆర్‌ను వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బీజేపీ వస్తే మీటర్లు పెడతారంటున్నావ్.. హుజురాబాద్‌లో గెలిపిస్తే మీటర్లు రాలేదుగా... ఇప్పుడు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదన్న రాజగోపాల్‌.. మునుగోడులో ధర్మం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుస్తుంది... మునుగోడు నుంచే కేసీఆర్‌ పతనం స్టార్ట్ అవుతుందన్నారు.


కృష్ణా జలాలపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలి: డీకే అరుణ


"తెలంగాణలోనే కాదు.. దేశంలో రికార్డులను మునుగోడు ప్రజలు తిరగరాయాలి. హుజూరాబాద్‌లో ఎలా కేసీఆర్‌కు చుక్కలు చూపించారో... దుబ్బాకలో ఎలా చుక్కలు చూపించారో... వచ్చే మునుగోడు ఎన్నికల్లో మరో ఆర్‌ను అసెంబ్లీకి పంపించాలి. ఆనాడు దుబ్బాక, హుజూరాబాద్‌ వైపు ఎలా జనాలు చూశారు... ఇప్పుడు మునుగోడు వైపు చూస్తున్నారు. కేసీఆర్‌కు నెత్తికెక్కిన అహంకారాన్ని దించాలని... బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. వేల కోట్లు ఖర్చుపెట్టినా... రాత్రికిరాత్రి పనులు చేపట్టినా... అవన్నీ మాకు వద్దు... మాకు తెలంగాణలో బీజేపీకి స్వాగతం పలుకుతామని ప్రజలు డిసైడ్‌ అయ్యారు. మునుగోడుకు ఎన్నికలు ఎందుకు వచ్చాయంటే... ఎప్పుడూ ఇక్కడ ఎమ్మెల్యేకు టైం ఇవ్వని సీఎం కేసీఆర్‌... ఎన్నిక వచ్చేసరికి పనులు మొదలయ్యాయి. రాజీనామా చేస్తున్నారనగానే ఓ మండలాన్ని ఏర్పాటు చేశారు. రాజీనామా చేశాక... బహిరంగ సభ పెట్టారు."


" తెలంగాణ తల్లి ఏడుస్తోంది. అడ్డంగా మద్యం షాపులు పెట్టి వేల కోట్లు రూపాయలు పోగు చేశారు. ఇవాళ పింఛన్లు అని సంక్షేమ పథకాలని మాయ చేస్తున్నారు. ఓవైపు ఆడవాళ్ల పుస్తెలు తెంపేసి... మన బాధల మీద కష్టాల మీద.. 1200 మంది అమరవీరుల త్యాగాలపై కుర్చీ వేసుకొని ఫ్యామిలీని అభివృద్ధి చేసుకున్నారు. ఇలాంటి వ్యక్తిని మరోసారి గద్దెనెక్కిస్తామా అని ఆలోచించాలి. మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చారా అని ఆలోచించుకోవాలి. బీజేపీపై అబద్దాలు చెప్తూ మోసాలు చేస్తున్న కేసీఆర్‌కు బుద్ది చెప్పాల్సిన టైం వచ్చింది. కృష్ణా జలాలపై సమాధానం చెప్పాల్సింది అమిత్‌షా కాదు... కేసీఆర్‌ చెప్పాలి. ఇవాళ కృష్ణా జలాలను ఆంధ్ర సీఎంకు తాకట్టు పెట్టారు. కాలేశ్వరం పేరుతో లక్షల కోట్లు అప్పులు చేసి తీసుకొచ్చారు. వాటిని మింగేసి... కాలేశ్వరాన్ని వరదలో మునిగిపోయింది. నీళ్లని, ప్రాజెక్టులని లక్షల కోట్లు అప్పులు చేసి కేసీఆర్‌ కుటుంబం అభివృద్ధి చెందింది. మనుగోడు ఎన్నిక ఫలితాలతో  కేసీఆర్‌ కళ్లు బైర్లు కమ్మాలి. -డీకే అరుణ్