చాలా మంది బరువు తగ్గాలన్న ప్రయత్నంలో తేనె నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగుతుంటారు. ఉదయాన్నే టీ, కాఫీల కంటే కూడా గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తేనె కలుపుకొని తీసుకోవడం చాలా మంచిదనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ డ్రింక్ నిజంగా అందరికీ మేలే చేస్తుందా అనేది అనుమానమే అని నిపుణులు అంటున్నారు.


ఈ పానీయంతోనే రోజు మొదలు


ఉదయాన్నే పరగడుపున తేనె తీసుకుంటే రోజంతా యాక్టీవ్‌‌గా ఉంచుతుంది. నిద్రకు ముందు కూడా ఒక టేబుల్ స్పూన్ తేనే మంచి నిద్రను ఇస్తుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మానసిక, శారీరక విశ్రాంతికి దోహదం చేస్తుంది. తేనే ప్రకృతి ప్రసాదించే అమృతం వంటిది. మంచి డీటాక్సిఫికెంట్ కూడా.


మరి ఈ రెండు కలిస్తే?



  1. తేనె, నిమ్మకాయ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రీ రాడికల్స్ తో పోరాటానికి కావల్సిన శక్తిని శరీరానికి ఇస్తాయి. అందుకే గోరువెచ్చని నిమ్మరసం, తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సలహా ఇస్తుంటారు.

  2. నిమ్మరసం, తేనె కలిసినపుడు కొవ్వు కరిగిస్తుంది. సూపర్ మార్నింగ్ డ్రింక్ ఇది. గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసం తాగాలి. ఇది జీవక్రియల వేగం పెంచుతుంది. అందువల్లే కొవ్వు కరుగుతుంది.


ఎలా తీసుకోవాలి?


తేనె, నిమ్మరసం తయారుచేసుకునే నీళ్లు వేడిగా ఉండకూడదు. 200 నుంచి 250 మి.లీ. నీళ్లకు నిమ్మకాయ, తేనె కలిపి తాగాలి. నెమ్మదిగా రుచి ఎంజాయ్ చేస్తు తాగితే మరీ మంచిది. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా తాగితే తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయి. పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరగడం ప్రారంభం అవుతుంది.


అందరూ తాగొచ్చా?


⦿ అల్సర్లు, అసిడిటీతో బాధపడేవారు ఖాళీ కడుపుతో తేనె, నిమ్మరసం తీసుకుంటే కడుపులో మంట రావచ్చు. ఇలా మంటగా అనిపించినా లేక కడుపులో నొప్పి వచ్చినా ఈ పానీయం మీకు సరిపడదని అర్థం.


⦿ తేనెలోని ఫ్రక్టోజ్ కారణంగా తేనె నిమ్మకాయ రసం డయాబెటిక్స్ కి అంత మంచిది కాదనే చెప్పాలి. దీని వల్ల షుగర్ పెరిగిపోవచ్చు.


⦿ బరువు తగ్గేందుకు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారు తెనే లేదా ఫ్రక్టోజ్ ఉండే పదార్థాలు తీసుకోవడం మంచిది కాదు. ఇది డంపింగ్ సిండ్రోమ్ కు కారణం కావచ్చు.


⦿ ఆరోగ్యకరమైన శరీర బరువు మెయింటెయిన్ చెయ్యడానికి చక్కెరలు, ఉప్పు కలిగిన పదార్థాలను చాలా పరిమితంగా తీసుకోవడం మంచిదని నిపుణుల సలహా


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. 



Also read: అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ - అటుకుల దోశె, అటుకుల గారెలు