International Yoga Day 2024 : ఎన్నో శారీరక సమస్యలకు, మానసిక రుగ్మతులకు పరిష్కార మార్గం యోగ. మన ప్రాచీన యుగం నుంచి దీన్ని పాటించేవారు. 5000 వేల ఏళ్ల క్రితం నుంచి యోగాని పాటించే వారు మన దేశంలో. దీని మూలాలు ఉత్తర భారత దేశంలో ఉన్నట్టు చెబుతారు. రుగ్వేదంలో కూడా యోగా గురించి ప్రస్తావన వచ్చింది. యోగా చేయడం వల్ల గుండె సమస్యలు రావు. అంతేకాకుండా రోజంతా చాలా ఫ్రెష్ గా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటాం అని చెప్తారు గురువులు. ఆ యోగా ప్రాముఖ్యతను ప్రపంచం మొత్తం తెలియజేసేందుకు, ప్రపంచానికి యోగాను పరిచయం చేసేందుకు 2014 నుంచి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యోగా గుండెకు ఎంత మంచి చేస్తుంది? ఏ ఆసనాలు వేస్తే మంచిది ఒకసారి చూద్దాం.
గుండెకు ఎంత మంచిదంటే?
యోగా ఒక సైన్స్ అని చెప్తారు యోగా గురువులు. ఆరోగ్యంగా, ఆనందంగా జీవితం గడపడానికి యోగ ఒక ఆర్ట్. యోగా హార్ట్ హెల్త్ కి పవర్ ఫుల్ టూల్ అన చెప్తారు ఎక్స్ పర్ట్స్. యోగా చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని, ముఖ్యంగా ఈ ఆసనాలు గుండెకు మేలు చేస్తుందని చెప్తున్నారు డాక్టర్లు. ఈ కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో గుండెను పదిలంగా ఉంచుకోవడానికి ఈ ఆసనాలు ప్రాక్టిస్ చేస్తే మంచిది అని చెప్తున్నారు యోగా గురువులు.
ఏ ఆసనాలు మంచివంటే?
ఈ ఆసనాలు వేస్తే గుండె మీద పడే భారం తగ్గి, స్ట్రెస్ రిలీఫ్ అవుతుందట. నిలబడి చేసే ఆసనాల్లో తాడాసన (Mountain Pose), వృక్షాసన (Tree Pose) ఇవి ప్రాక్టీస్ చేస్తే పోస్టర్, అలౌన్మెంట్ రెండు మెరుగు పడతాయి. అంతేకాకుండా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. భుజంగ ఆసన (Cobra), ధనురాసన (Bow), పశ్చిమొట్టాన్ ఆసనం (Seated Forward Bend) ఈ ఆసనాలు కూడా రక్తప్రసరణను పెంచుతాయి. అంతేకాకుండా స్ట్రెచింగ్, బలాన్ని కూడా పెంచుతాయి. ఈ ఆసనాలు వేస్తే.. గుండెకు ఆక్సీజన్ చక్కగా అందుతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది.
యోగా ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. మనసును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రతి రోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి. యోగ చేయడం వల్ల అలసట రాదు. రోజంతా యాక్టివ్ గా అనిపిస్తుంది. నాసికా శ్వాస, సూర్య నమస్కారం, సేతుబంద ఆసనం (Bridge Pose) లాంటివి రోజు చేస్తే.. యాక్టివ్ గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువ అయిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.