Health Benefits of Honey for Men : చక్కెరకు ప్రత్యామ్నాయంగా హెల్త్ బెనిఫిట్స్ కోసం చాలామంది తేనెను ఉపయోగిస్తారు. ఇది మంచి రుచిని అందించడంతో పాటు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. తేనెలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, ఐరన్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సహజ స్వీటెనర్‌గా పనిచేయడంతో పాటు.. వివిధ ఆరోగ్య ప్రయోజనాలకు, వివిధ బ్యాక్టీరియాను దూరం చేసి శరీరాన్ని రక్షిస్తుంది. అందుకే దీనిని రెగ్యూలర్‌గా తీసుకుంటారు. దీని ఆరోగ్యప్రయోజనాలు రెట్టింపు చేసేందుకు వివిధ పదార్థాలతో దీనిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పురుషుల్లో వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇది హెల్ప్ చేస్తుందంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటంటే..
తేనెను వేడి నీటితో కలిపి తీసుకుంటే..
చాలామంది ఉదయాన్నే వేడినీళ్లలో కాస్త తేనె వేసుకుని కలిపి తాగుతారు. గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి పరగడుపునే తాగితే.. మెటబాలీజం పెరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సీజనల్ వ్యాధులు దరిచేరవు. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి.. డిటాక్స్ చేస్తుంది. మెరిసే స్కిన్‌ని అందించడంతో పాటు.. అలెర్జీలను కంట్రోల్ చేస్తుంది.
వెల్లుల్లితో తేనె కలిపి తింటే..
వెల్లుల్లిపై పొరను తీసి.. వాటిని తేనెలో నానబెట్టి రెగ్యూలర్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. వెల్లుల్లిలోని రసాయనాలు శరీరంలోని మంటను, వాపును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వ్యాధులు రాకుండా నివారిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, విరేచనాలు వంటివాటిని తగ్గిస్తుంది. ఉబ్బసం, గుండె జబ్బులు, అధికరక్తపోటు, కీళ్లనొప్పులు, పంటి నొప్పి, మలబద్ధకం వంటివాటిని తగ్గిస్తుంది.
దాల్చినచెక్కతో తేనె కలిపితే..
తేనె, దాల్చిన చెక్క కలిపి తింటే మంచి రుచి మీ సొంతమవుతుంది. అందుకే వీటిని ఓట్మీల్, టీ, బేకరీ ఫుడ్స్ వంటి వాటిలో కలిపి ఉపయోగిస్తారు. ఈ రెండూ గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.. గుండె సమస్యలు.. ముఖ్యంగా స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని దూరం చేస్తుంది. అంతేకాకుండా ఈ కాంబినేషన్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి.
అంగస్తంభన, స్పెర్మ్ హెల్త్ కోసం..
నపుంసకత్వ సమస్యలను తగ్గించుకోవడంలో తేనె మెరుగైన ప్రభావాలు చూపిస్తుంది. అంగస్తంభనను తగ్గించే లక్షణాలను తేనె కలిగి ఉంటుంది. పాలల్లో తేనె కలిపి తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అంతేకాకుండా టెస్టోస్టెరాన్ను కూడా గణనీయంగా పెంచి.. సంతానోత్పత్తి సమస్యలను దూరం చేస్తుంది. కేవలం పురుషులకే కాకుండా.. మహిళలకు యోని, గర్భాశయ సమస్యలను దూరం చేస్తుంది. ఎగ్ క్వాలిటీని పెంచుతుంది.
మితంగానే తీసుకోవాలి..
తేనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా.. దానిని మితంగా తీసుకుంటేనే మంచిదంటున్నారు. రోజుకు ఓ స్పూన్ తేనె తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. రక్తపోటు, కొలెస్ట్రాల్, దగ్గు, జలుబు, గాయాలు తగ్గించుకోవడం కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు. జీర్ణక్రియ సమస్యలను ఇది దూరం చేస్తుంది కాబట్టి.. హాయిగా దీనిని వినియోగించవచ్చు. అయితే మీరు దీనిని తీసుకోవాలనుకుంటే వైద్యుల సలహా తీసుకుని తర్వాత ప్రారంభిస్తే మంచిది.