నెలసరులు మొదలయినప్పటి నుంచి స్త్రీ శరీరంలో ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఇది నిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుకు, ఎముకలు, రక్తనాళాలు, గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.


పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటి ప్రతి రోజూ బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుగా ఉండడాన్ని గమనించారు. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని నివారిస్తుంది. బీట్ రూట్ రసంలో నైట్రేట్ లు అధికంగా ఉంటాయి. ఈ అధ్యయనంలో రక్తనాళాల ఆరోగ్యానికి బీట్ రూట్ చాలా మేలు చేస్తుంది.


రోజూ ఒక బాటిల్


మెనోపాజ్ వయసులో ఉన్న 54 మంది స్త్రీలను ఎంచుకుని ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో 12 మంది పెరిమెనోపాజ్ దశలోనూ 12 మంది మెనోపాజ్ చివరలో ఉన్నారు. విశ్రాంతిగా ఉన్నపుడు వీరి బీపి 130/80 ఉంది, బీఎంఐ 18.5 నుంచి 35 వరకు ఉంది. లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నాయి. ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ సాధారణ స్థితిలో ఉన్నాయి. వీరిలో ఎవరికీ పొగతాగే అలవాటు లేదు, ఎలాంటి కార్డియోవాస్క్యూలార్ మందులు కానీ, హర్మోన్లు కానీ తీసుకోలేదు.


అధ్యయనం మొదలు పెట్టిన కొత్తల్లో చిక్కగా ఉండే 2,3 ఔన్సుల జ్యూస్ తీసుకున్నారు. తర్వాత ఒక వారం పాటు ప్రతిరోజూ ఒక బాటిల్ తీసుకున్నారు. ప్రతి బాటిల్ నుంచి 3 పెద్ద దుంపల నుంచి ఎంత నైట్రేట్ లభిస్తుందో అంతే లభిస్తుంది.


ఈ అధ్యయనంలో పాల్గొన్న వారి బ్రాకియల్ ఆర్టరీ రక్తప్రసరణను అంచనా వేసేందుకు డాప్లర్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ పరీక్ష చేశారు. బీట్ రూట్ జ్యూస్ తీసుకున్నంత కాలం రక్త ప్రవాహం మెరుగ్గా ఉందని అధ్యయనకారులు నిర్థారించారు. అయితే జ్యూస్ తీసుకున్న 24 గంటల తర్వాత ఈ ప్రభావం తగ్గిపోవడాన్ని కూడా గుర్తించారు.


మెనోపాజ్ కు గుండె సమస్యలకు ఏమిటి సంబంధం?


మెనోపాజ్ లో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి. కార్డయోప్రొటెక్టివ్ ప్రభావాలు తగ్గడం వల్ల గుండె మీద ఈస్ట్రోజెన్ ప్రభావం కూడా తగ్గుతుంది.


ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం, బీపీ పెరిగిపోవడం వంటి కారణాలతో గుండె బలహీన పడవచ్చు. ఇది మాత్రమే కాదు అథెరోస్క్లీరోసిస్, స్ట్రోక్ వంటి సమస్యలు కూడా రావచ్చు. హార్మోన్లతేడాతో నిద్రపట్టడానికి ఇబ్బంది పడవచ్చు. ఇది కూడా గుండె జబ్బులకు కారణం కాగలదు. హాట్ ఫ్లషెస్ ఎక్కువ సమయం పాటు కొనసాగటం కూడా గుండె ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.


పోషకాల ప్రభావం


మెనోపాజ్ తర్వాత సహజంగా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి శరీరంలోఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్ సరిపోదు. కనుక నైట్రిక్ ఆక్సైడ్ పెంపొందించే ఆహారాలు తీసుకోవాలి.


పాలకూర, క్యాబేజి, బచ్చలికూర వంటి ఆకుకూరలు, తులసి, కొత్తిమీర వంటి మూలీకలు, ముల్లంగి, బీట్ రూట్, టర్నిప్ వంటి దుంపల్లోనూ నైట్రేట్ అధికంగా లభిస్తుంది.


Also Read : వ్యాయామం ఉదయాన్నే చెయ్యాలా ఏంటీ? కొత్త అధ్యయనంలో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెల్లడి











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.