Health Tips : మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనులైనా సులభంగా చేస్తాం. అలాంటి సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం కావాలంటే చక్కటి పోషకాహారం తీసుకోవడమే కాదు.. కొన్ని చిట్కాలు కూడా పాటించాలంటున్నారు పోషకాహార నిపుణులు. అలాగే ఆహారంతోపాటు వ్యాయామానికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలని చెబుతున్నారు. ఈ క్రమంలో చిన్న చిన్న చేపలను ఎముకలతో సహా తినడం కూడా ఓ భాగమే. మరి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవాలంటే పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం. 


చక్కటి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ పాటించాల్సిన 9 చిట్కాలు ఇవే: 


1. ప్రతి సారి విఫలం అవుతున్నారా? 


గెలిచేంత వరకు ప్రయత్నించాలి అనే సామేత మనం వినే ఉంటాం. కానీ ప్రతి విషయంలోనూ ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ చేసిన పరిశోధనలో వైఫల్యం విజయానికి దారితీస్తుందనే నమ్మకం అన్నివేళలో సరికాదని తేల్చి చెప్పింది. తాము చేస్తున్న తప్పుల నుంచి ఇతరులు ఎంత నేర్చుకుంటున్నారో అంచనా వేస్తారని అధ్యయనం చూపించింది. ఏ విషయంలోనై వైఫల్యం చెందితే ఇతరుల సాయం తీసుకోవడం అవసరం. 


2. అవుట్ డోర్ గేమ్స్:


వ్యాయామం..ఏ రకమైనా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అప్పుడప్పుడు అవుట్ డోర్ గేమ్స్ కు కూడా వెళ్లడం మంచిది. బైక్ రైడ్ బెస్ట్ ఉదాహరణ. అవుట్ డోర్ వర్కౌట్స్ మెరుగైన శారీరక ప్రయోజనాలను కలిగి ఉన్నాయని టెక్సాస్ పరిశోధకులు కనుగొన్నారు. అవుట్ డోర్ వర్కౌట్స్ ఇమ్యూనిటీ, మానసిక ఆరోగ్యం, ఆందోళన వంటి వాటికి చెక్ పెడుతాయట. 


3. రాత్రి వ్యాయామం:


సాయంత్రం 6 తర్వాత వ్యాయామం చేయడం మంచిది. గ్రెనడా యూనివర్సిటీ  పరిశోధకులు ఈ సమయంలో వ్యాయామం చేయడం వల్ల ఊబకాయం, బ్లడ్ షుగర్ లెవల్స్ మెరుగ్గా ఉంటాయని గుర్తించారు. డయాబెటిస్ పేషంట్లు సాయంత్రం వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. 


4. యోగా చేయండి:


మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ యోగా చేయడం చాలా ముఖ్యం. శరీరంలోని మంట, కీళ్ల నొప్పులు, వంటివి తగ్గాలంటే యోగా చేయాలంటున్నారు నిపుణులు. 


5. బీట్ రూట్ జ్యూస్:


రుతువిరత తర్వాత ఎక్కువ మంది మహిళలకు గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి రోజువారీ డైట్లో బీట్ రూట్ జ్యూస్ చేర్చుకుంటే ప్రమాదం తగ్గుతుంది. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలు బీట్ రూట్ జ్యూస్ తాగితే రక్తనాళాల పనితీరు మెరుగుపడి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని పెన్ స్టేట్ అధ్యయనం కనుగొన్నది. 


6. మురికి దుస్తులు:


అందరు శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. అతి శుభ్రత వల్ల మనం బట్టలు ఉతకాల్సిన దానికంటే ఎక్కువసార్లు ఉతికేస్తుంటారు. వ్యక్తిగత శుభ్రత పాటించే వారు ఒకసారి వేసుకున్న దుస్తులను పదే పదే ఉతకాల్సిన అవసరం లేదని చామర్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు. 


7. తక్కువగా టీవీ చూడటం:


మనలో చాలా మంది గంటల తరబడి టీవీకి అతుక్కుపోతారు. హార్వర్డ్ యూనివర్సిటీ జరిపిన ఓ అధ్యయనం ప్రకారం ఎక్కువ సమయం టీవీ చూసే మహిళల్లో గుండె జబ్బులు, మధుమేహం, ఆరోగ్యం దెబ్బతినడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. 


8. చిన్న చేపలు తినండి:


చేపల్లో పోషకాలు ఉంటాయని మనకు తెలుసు. పోషకాలు అధికంగా ఉండే చిన్న చేపలు క్రమం తప్పకుండా తీసుకుంటే.. మహిళలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని జపనీస్ అధ్యయనం చెబుతోంది. చిన్న చేపలను పాస్తా, సలాడ్స్, శాండ్ విచ్, వంటి వాటిలో చేర్చుకోవాలని చెబుతున్నారు. వాటిని ముళ్లతో సహా తినేయాలని చెబుతోంది. (గమనిక: చిన్న చేపల్లో ముళ్లు సులభంగా నమిలేలా, జీర్ణమయ్యేలా ఉంటాయి)


Also Read : పీరియడ్స్ సమయంలో ప్రెగ్నెంట్ అవ్వొచ్చా? ఆ రోజుల్లో ట్రై చేస్తే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయా?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.