Guppedanta Manasu  Serial Today Episode:  అసలు నువ్వెందుకు నా పదవికి అడ్డం పడుతున్నావు. నువ్వు అనే వాడివి లేకపోతే ఈపాటికి కాలేజీ నా చేతుల్లోకి వచ్చేది అంటూ శైలైంద్ర, మనును అడుగుతాడు. అసలు నేను తలచుకుంటే నిన్ను ఎప్పుడో మట్టి కరిపించేవాడిని. నువ్వు నాకు గడ్డి పరకతో సమానం అంటాడు మను. నీకెప్పుడో చెప్పాను. ఎండీ పదవికి నీకు అర్హత లేదని అయినా వినవేం.. అనగానే తండ్రి ఎవరో తెలియని నువ్వు నాకు చెప్తున్నావా? అంటూ శైలేంద్ర అనగానే మను కోపంగా శైలేంద్రను తిడతాడు.


శైలేంద్ర: అయినా అదంతా ఎందుకు బ్రదర్‌. మనం ఒక డీల్‌ కుదుర్చుకుందామా?


మను: నీతో డీల్‌ కుదుర్చుకోవడానికి ఏముంది? ఏమీ లేదు.


శైలేంద్ర: అంతలా తీసిపాడేయకు బ్రదర్‌. నీ ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉంది. అదే నీ కన్నతండ్రి ఎవరో నాకు తెలుసు.


మను: నా తండ్రి ఎవరో నీకు తెలుసా?


శైలేంద్ర: నీ తండ్రి పూర్తి బయోడేటా నా దగ్గర ఉంది.


అని శైలేంద్ర చెప్పగానే ఎగ్జైంటింగ్‌గా నా తండ్రి ఎవరో చెప్పు అని అడుగుతాడు మను. చెప్తాను కానీ నువ్వు నాకు ఒక పని చేస్తే నీ తండ్రి గురించి నీకు చెప్తాను. అనగానే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నావా? నా తండ్రి గురించి నీకు తెలియదు. ఇంకోసారి ఇలా మాట్లాడితే కాలేజీలో నీకు స్మారక చిహ్నం కట్టిస్తానని వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు మను. మరోవైపు రౌడీలు వసుధార కోసం వెతుకుతుంటారు. బుజ్జి వెళ్తుంటే పిలిచి వసుధార ఫోటో చూపించి ఈ అమ్మాయిని చూశావా అని అడగ్గానే  చూడలేదని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు దేవయాని లెటర్‌ పట్టుకుని మాట్లాడుతుంది.



దేవయాని: రేయ్‌ ఇంత పెద్ద విషయం డోర్స్‌ ఓపెన్‌ చేసి చెప్తావేంట్రా.. ఆ ధరణి విందంటే మహేద్రకు చెప్తుంది.


శైలేంద్ర: ఈ లెటర్‌ మన దగ్గర ఉన్నా ప్రయోజనం లేదు మమ్మీ..


దేవయాని: ప్రయోజనం లేదా?


శైలేంద్ర: అవును మామ్‌ నేను ఆ మను గాడి దగ్గరకు వెళ్లి మీ నాన్న ఎవరో చెప్తాను అంటే వాడు నమ్మడం లేదు మామ్‌.


దేవయాని: దరిద్రుడా? ఎంత పని చేశావురా? అయినా నీకు ముందే చెప్పానుగా ఏదైనా చేసే ముందు నాకు చెప్పమని..


 అంటూ శైలేంద్రను తిడుతుంది. నువ్వెన్ని చెప్పినా ఆ మను నమ్మడని చెప్తుంది. దీంతో ఇక నుంచి నువ్వు చెప్పినట్లే చేస్తానని శైలేంద్ర అంటాడు. అసలు చేయాల్సింది ఇది కాదు. మహేంద్రకు  అనుపమకు మధ్య చిచ్చు రేపాలి వాళ్లను ఇక్కడి నుంచి వెళ్లగొట్టాలి. అదే ఇప్పుడు మనం చేయాల్సింది అంటుంది దేవయాని. మరోవైపు సరోజ క్యారెజ్‌ తీసుకుని వస్తుంది.


రాధమ్మ: అబ్బా ఎందుకే అంతలా అరుస్తున్నావు.. వాడు ఇంట్లోనే ఉన్నాడుగా వచ్చేదాకా కూడా ఆగలేవా?


సరోజ: నేను ఆగలేను అమ్మమ్మ నేను ఇష్టంగా తీసుకొచ్చిన వంటలన్నీ బావకు దగ్గరుండి వడ్డించాలి కదా?


వసుధార: ఈ అమ్మాయి ఎందుకు రిషి సార్‌ మీద ఇంత ప్రేమ చూపిస్తుంది.


( అని మనసులో అనుకుంటుంది.)


రాధమ్మ: సరిపోయింది మీ నాన్నేమో వాడితో వడ్డీల మీద వడ్డీలు కట్టించుకుంటాడు. నువ్వేమో వడ్డించడానికి తొందరపడతావు.


   అనగానే సరోజ అయితే ఒక పని చేయమను నా మెడలో తాళి కట్టమను అప్పులు తీరిపోతాయి. పైగా నా ఆస్థికి వారసుడవుతాడు. మాకు పెళ్లైతే మా మధ్యలో ఎవరూ వచ్చే వాళ్లు ఉండరు. అనగానే సరోజ, వసుధార మధ్య వాదన జరుగుతుంది. తర్వాత భోజనానికి రమ్మని వసుధారను పిలిస్తే రానని బాధపడుతుంది. దీంతో సరోజ మాటలను నువ్వేం పట్టించుకోకు అని రంగ చెప్పినా వినకుండా లోపలికి వెళ్లిపోతుంది. తర్వాత ఒంటరిగా కూర్చుని వసుధార, సరోజ మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో రంగ భోజనం తీసుకుని వస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ప్రభాస్‌ వల్లే నేను ఇలా అయ్యాను - బేబీ బంప్‌ చూపిస్తూ దీపికా ఆసక్తికర కామెంట్స్‌