Heroine Sadha Gives Clarity About Her Marriage: ‘జ‌యం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ స‌దా.. వెళ్ల‌వయ్యా వెళ్లు వెళ్లు.. అంటూ కుర్ర‌కారు మ‌న‌సును దోచేసింది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో హిట్ల మీద హిట్లు కొడుతూ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు డ్యాన్స్ షో కి జ‌డ్జ్ గా వ్య‌వ‌హ‌రిస్తూ అంద‌రినీ ఎంట‌ర్ టైన్ చేస్తుంది. అయితే, ఆమెకి పెళ్లి అంటే భ‌యం అంట‌. పెళ్లొద్దు ఏమొద్దు ఇలా సింగిల్ గా హ్యాపీగా బ‌తికేస్తాను అంటోంది. ఆమె కెరీర్ కి సంబంధించి చాలా విష‌యాలు పంచుకుంది ఒక ఇంట‌ర్వ్యూలో. 


నీతోనే డ్యాన్స్ ఎలా అనిపించింది? 


చాలా తొంద‌ర‌గా అయిపోయిన‌ట్లు అనిపిస్తుంది. నాకు బాగా ఇష్ట‌మైన డ్యాన్స్, ఇది స్టార్స్ కాంబినేష‌న్ తో. బీబీ జోడీ, నీతోనే డ్యాన్స్ సీజ‌న్ - 1, ఇప్పుడు 2.0 అన్ని తొంద‌ర‌గా అయిన‌పోయిన‌ట్లు అనిపిస్తుంది. ఎందుకంటే త‌క్కువ ఎపిసోడ్స్ ఉంటాయి. త‌క్కువ మంది కంటెస్టెంట్స్ ఉంటారు క‌దా. ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలోపే అయిపోతుంది. నాకు కూడా అలానే అనిపిస్తుంది. మిస్ అవుతాను బాగా. డ్యాన్స‌ర్స్ కాకుండా మ‌న‌లాంటి కొంత‌మంది యాక్ట‌ర్స్ ని తీసుకోవడం, వాళ్ల నుంచి ఇలాంటి ప‌ర్ఫామెన్స్ ఊహించ‌లేదు. ఆ రేంజ్ లో వాళ్లు చేయ‌డం చాలా చాలా గొప్ప విష‌యం.


జ‌డ్జ్ మెంట్ ఇవ్వ‌డం ఎలా అనిపిస్తుంది?  


ఒకేసారి లైవ్ ప‌ర్ఫామెన్స్ చూసి జ‌డ్జ్ మెంట్ ఇవ్వాలి. అది చాలా క‌ష్టం అవుతుంది మాకు. ఆరుగురిలో సెమీ ఫినాలేకి ఐదుగురుని తీసుకోవాలి. అలాంట‌ప్పుడు ప‌ర్ఫామెన్స్ ఎలా చేశారు? కాన్సెప్ట్ ఎలా ఉంది? ఏముంది?  రీపీట్స్ ఉన్నాయా? ఎఫ‌ర్ట్ ఎంత ఉంది? అన్ని లెక్కలోకి తీసుకోవాలి. ఫినాలేకి వ‌చ్చేస‌రికి చాలా క‌ష్టం అయిపోతుంది. అన్ని రోజుల ప‌ర్ఫామెన్స్ కూడా చూడాలి. సెమీ ఫైన‌ల్స్ కి వ‌చ్చారు అంటే అంద‌రూ టాప్ ఉన్న‌వాళ్లే వ‌స్తారు. వాళ్ల నుంచి ఎలిమినేష‌న్ చేయ‌డం, ఫినాలేకి పంప‌డం అనేది చాలా చాలా క‌ష్టమైన టాస్క్.   


సీనియ‌ర్స్ తో జ‌డ్జిమెంట్ ఎలా అనిపిస్తుంది? 


త‌రుణ్ మాస్ట‌ర్ చాలా రోజుల నుంచి ప‌రిచ‌యం. రాధాగారు బీబీ జోడి అప్ప‌టి నుంచి ప‌రిచ‌యం. వాళ్లంద‌రూ చాలా చాలా స్వీట్. అంత సాధించి, అంత పొజిష‌న్ లో ఉండి కూడా సింపుల్ గా ఉంటారు. టైంకి రావ‌డం, కంటెస్టెంట్స్ కి మంచి స‌జ‌ష‌న్స్ ఇస్తూ, ఫ‌న్ గా ఉండ‌టం అదంతా నాకు బాగా అనిపిస్తుంది. ఫుల్ డే షూట్ లో ర‌క‌ర‌కాల కామెడీ ఉంటుంది. బాగా స్పెండ్ చేస్తాం. ఇక వాళ్ల ముందు జ‌డ్జిమెంట్ ఇవ్వ‌డం నాకు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. ఎందుకంటే.. నాకు వ‌చ్చిన అవ‌కాశంలో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. క‌థ‌క్ బేస్ ఉంది. వెస్ట్ర‌న్, ఫోక్, మాస్ అన్ని ర‌కాల పాట‌లు చేశాను. నాకు బాగా అల‌వాటు కూడా.. ఇలాంటి డ్యాన్స్ షో హిందీలో వ‌స్తాయి క‌దా అవ‌న్నీ ఫాలో అవుతాను. జ‌డ్జ‌ిమెంట్ గురించి బాగుందా? లేదా అనేది చెప్ప‌డం క‌ష్టం కాదు అనిపించింది. 


పెళ్లి గురించి ఏంటి అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చారు? 


నేను పెళ్లికి వ్య‌తిరేకం కాదు. ఒక ఏజ్ వ‌చ్చింది కాబ‌ట్టి పెళ్లి చేసుకోవ‌డం కాదు. సొసైటీ ప్ర‌ెజ‌ర్ పెడుతుంద‌ని చేసుకోవ‌ద్దు. మీకు అనిపిస్తే, మీకు క‌రెక్ట్ ప‌ర్స‌న్ దొరికాడు అనుకుంటే చేసుకోవాలి. లైఫ్ ఒక‌సారి స్టార్ట్ అయ్యాక ఒక‌వేళ కంటిన్యూ అంటుంటే, క‌ష్టాలు వ‌స్తే, బ‌త‌క‌లేం అనుకుంటే విడిపోవ‌డంలో త‌ప్పులేదు అని కూడా అనిపిస్తుంది. నేనేమి పెళ్లికి వ్య‌తిరేకం కాదు. ఎవ‌రికి ఎలా సూట్ అవుతుందో అది చేయొచ్చు అంటున్నాను అంతే. 


మీ పెళ్లి ఎప్పుడు? 


ఎందుకు? హ్యాపీగా ఉన్నాను క‌దా.. నాకు కావాల్సింది చేస్తున్నాను క‌దా? పెళ్లి అంటే ఎలా చెప్పాలి. న‌చ్చిన వ్య‌క్తి, హ్యాపీగా ఉంటాను అనుకున్న వ్య‌క్తి దొరికితే బాగుంటుంది. నాకు అలాంటి వాళ్లు ఎవ్వ‌రు క‌నిపించ‌లేదు. నాకు అరేంజ్ మ్యారేజ్ కాన్సెప్ట్ తెలీదు. మా పేరెంట్స్ ల‌వ్ మ్యారేజ్ చేసుకున్నారు. తెలియ‌ని వ్యక్తితో రూఫ్ షేర్ చేసుకోవ‌డం అనేది నాకు భ‌యం వేస్తుంది. కొంత‌మందికి అది ఓకే, హ్యాపీగా ఉంటారు. కానీ, నేను ఉండ‌లేను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. పెళ్లి అనేది చేసుకుని మ‌ళ్లీ హ్యాపీగా ఉంటాను అని నేను అనుకోవ‌డం లేదు. ఇలా ఉండాల‌ని ఉంది. 


మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? 


లాస్ట్ 6 నెల‌ల‌గా హెల్త అంత‌గా బాలేదు. దీంతో నా స్కిన్, హెయిర్ అంతా ఎఫెక్ట్ అయ్యింది. నిన్న షూటింగ్ లేట్ అయ్యింది. ఇవాళ చూస్తే అంద‌రూ నిద్ర‌లేక టైర్డ్ గా ఉన్నాను. అలా పుల్ చేయాలి, ఎన‌ర్జీగా ఉండాలి. నార్మ‌ల్ స్కిన్ రొటీన్ చేస్తున్నాను. ఈ మ‌ధ్య హెల్త్ ఇష్యూ, స్కిన్ పాడ‌వ‌ట్టం వ‌ల్ల మెడికేటెడ్ ఆయింట్మెంట్స్ వాడుతున్నాను. లేకుంటే అస‌లు ఏం వాడ‌ను. మేక‌ప్ కూడా జ‌స్ట్ షూట్ కి వ‌చ్చేట‌ప్పుడు మాత్ర‌మే వేస్తాను. ఇంక డైటింగ్ అంటారా? అస్స‌లు డైటింగ్ చేయ‌ను. ఇప్పుడు కూడా డ‌బ్బాలో స‌మోసాలు అవీ ఉన్నాయి. బేసిక్ గా నేను ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మాత్ర‌మే తింటాను. వీగ‌న్ కాబ‌ట్టి కొన్ని ఆటోమెటిక్ గా ఉండ‌వు. షుగ‌ర్ తింటాను అన్ని తింటాను. తిన్నా కూడా అలానే ఉంటాను. అంటూ త‌న గురించి విష‌యాల‌ను పంచుకున్నారు స‌దా. 


Also Read: ‘పుష్ప - 2’ టీమ్ నిర్ణయంపై రష్మిక మందన్న డిజప్పాయింట్? కారణం ఇదేనట!