రష్మీ గౌతమ్ (Rashmi Gautam)కు తెలుగు రాదు. ఆవిడ విశాఖలో సెటిల్ అయిన ఒరిస్సా ఫ్యామిలీ అమ్మాయి. తెలుగు అర్థం అవుతుంది కానీ పూర్తిగా రాదు. అందుకే రష్మీ మీద 'జబర్దస్త్'లో జోక్స్ వేస్తారు. ఒక్కోసారి ఆవిడ కూడా జోక్స్ వేస్తుంది. ఈ వీక్ టెలికాస్ట్ కాబోయే 'జబర్దస్త్'లో ఆవిడ డబుల్ మీనింగ్ జోకులతో చెలరేగింది.
పెళ్లి, ఫ్యామిలీ, పిల్లలు బేస్డ్ స్కిట్ చేశారు రాకెట్ రాఘవ. 'అల్లుడు, సంవత్సరం తిరక్కుండా పండంటి బిడ్డను నా చేతిలో పెట్టాలి' అని వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. సంవత్సరం తర్వాత పిల్లలు, వైఫ్, ఫ్యామిలీతో వస్తాడు రాఘవ. 'మామ గారూ... ఎలా ఉన్నారు ఫ్యామిలీ' అని అడుగుతాడు. మళ్ళీ 'పండంటి బిడ్డను నా చేతిలో పెట్టాలి' డైలాగ్ వినబడుతుంది.
'మామ గారు శాటిస్ ఫై కావడం లేదు. చచ్చిపోతున్నా' అని రాఘవ అంటాడు. 'మామ గారు ఎందుకు శాటిస్ ఫై అవ్వాలి' అని రష్మీ గౌతమ్ నవ్వుతుంది. 'నేను ఏం చెబుతున్నాను అంటే... అప్పుడప్పుడూ బయట పనులు కూడా చేస్తూ ఉండాలి' అని ఒక ఆర్టిస్ట్ చెబితే... 'అమ్మో నాకు ఖాళీ వుండదండీ' అని చెబుతాడు రాఘవ. 'ఏం పనులు చేస్తూ ఉంటావ్' అంటే... మధ్యలో కలుగుజేసుకున్న రష్మీ 'చెబుతారా ఏంటి? చూపిస్తున్నారు' అంది. ఆవిడ వేసిన జోక్స్ అర్థం చేసుకోవాలంటే మినిమమ్ డిగ్రీ కావాలి. ఆ పనిలో బిజీగా ఉన్నారని చెప్పింది అన్నమాట.
రష్మీ గౌతమ్ విస్కీ తాగుతుందా?
Does Rashmi Gautam drinks whiskey: రీసెంట్ 'జబర్దస్త్' ప్రోమో చూసిన వాళ్లు ఎవరికి అయినా సరే రష్మీ గౌతమ్ విస్కీ తాగుతుందా? అని సందేహం రావడం కామన్. 'ఎక్స్ట్రా జబర్దస్త్' నుంచి ఎక్స్ట్రా అనేది తీసేసి 'జబర్దస్త్' చేయడం 'ఆటో' రామ్ ప్రసాద్ (Auto Ram Prasad)కి నచ్చడం లేదనుకుంట! రెండు మూడు వారాలుగా ఎక్స్ట్రా తీసేయడం అనే థీమ్ మీద స్కిట్స్ చేస్తున్నాడు. లేటెస్ట్ ప్రోమోలో కూడా అది కంటిన్యూ చేశాడు.
'ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేశారని రష్మీ విషం తాగుతూ ఉంది. ఇంతలో యాజమాన్యం ఆపి రెండు ఎపిసోడ్స్ నువ్వే చేస్తున్నావని చెప్పడంతో విషం పక్కనపెట్టి విస్కీ తాగేసింది' అని న్యూస్ పేపర్ చదివినట్టు రామ్ ప్రసాద్ స్కిట్ చేశాడు. అతడు ఆ డైలాగ్ కంప్లీట్ చేసిన వెంటనే నిజమేనని అన్నట్టు రష్మీ గౌతమ్ తల ఊపుతూ నవ్వింది.
Also Read: 'జబర్దస్త్' నూకరాజుకు యాంకర్ రష్మీ గౌతమ్ వార్నింగ్... చెప్పుతో కొడతానంటూ ఫైర్
రష్మీ గౌతమ్ మాత్రమే కాదు... రోహిణీ కూడా తక్కువ ఏమీ తినలేదు. ఆటో రామ్ ప్రసాద్ స్కిట్‌లో ఆవిడ డాన్స్ చేసింది. వెనుక కూర్చున్న అతడు 'అదిరిపోయింది సార్ డాన్స్' అన్నాడు. మధ్యలో కలుగజేసుకున్న రోహిణి 'ఒక్క నిమిషం... వెనుక నుంచి చూశారు కదా! ఏం అదిరిపోయింది, ఏం చూశారు?' అని క్వశ్చన్ చేసింది. అక్కడ ఆవిడ మీనింగ్ ఏంటో అర్థం అయ్యింది కదూ!
రేవ్ పార్టీనీ వదల్లేదు... హేమను అలా వాడేశారు!
రీసెంట్ టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం ఏదైనా ఉందంటే... హేమ రేవ్ పార్టీ న్యూస్! దాన్ని కూడా జబర్దస్త్ టీం వదల్లేదు. ఐదు లక్షలు ఖర్చు చేసి చెరువు రేవు దగ్గర రేవ్ పార్టీ పెడితే రేవ్ పార్టీ అనుకుని అందర్నీ అరెస్ట్ చేశారని ప్రవీణ్ డైలాగ్ పేల్చాడు.