Anchor Rithu Chowdary: 'జ‌బ‌ర్ద‌స్త్' షో ద్వారా ఎంతోమంది సెల‌బ్రిటీలు అయ్యారు. ఆ షో ద్వారా వ‌చ్చిన ఫేమ్ తో సినిమా, సీరియ‌ల్స్ లో ఛాన్సులు కొట్టేశారు. యాంక‌రింగ్ వైపు కూడా అడుగులు వేశారు చాలామంది. అలాంటి వాళ్ల‌లో ఒకరే రీతూ చౌద‌రి. 'జ‌బ‌ర్ద‌స్త్' లో ఆది టీమ్ లో చేసిన రీతూ ఇప్పుడు పీపుల్స్ మీడియా ప్రొడక్ష‌న్స్ లో 'దావ‌త్' అనే షోకి యాంక‌రింగ్ చేస్తుంది. అంతేకాకుండా సినిమాల్లో కూడా న‌టిస్తుంది. అలా కెరీర్ లో దూసుకుపోతున్న రీతూ ఇప్పుడు ల‌గ్జ‌రీ కారు కొనుగోలు చేసింది. ఆ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసింది రీతూ. అమ్మ‌తో క‌లిసి ఫ‌స్ట్ డ్రైవ్ వెళ్లింది. 


రీతూ కొన్న కారు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీలంతా ఈ కారునే ప్రిఫ‌ర్ చేస్తున్నారు. అదే.. ఇన్నోవా క్రిస్టా హైబ్రిడ్ హైక్రాస్. ఈ కారును డెలివ‌రీ తీసుకోవ‌డం, పూజ చేయ‌డం, అమ్మ‌తో క‌లిసి ఫ‌స్ట్ డ్రైవ్ కి వెళ్ల‌డం వీట‌న్నింటినీ క‌లిపి ఒక వీడియో రిలీజ్ చేసింది రీతూ. దీంతో అంద‌రూ ఆమెకు విషెస్ చెప్తున్నారు. విష్ణు ప్రియ ల‌వ్ ఎమోజీ పెట్టి, దిష్టి త‌గ‌ల‌కుండా చూసుకో అంటూ కామెంట్ పెట్టారు. దివితో పాటు ఇంకొంత‌మంది ఇన్ స్టా ఇన్ ఫ్ల్యూయెన్స‌ర్స్, జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిసులు ఆమెకు విషెస్ చెప్తున్నారు. 






కారు ధ‌ర ఎంతంటే? 


ఇక ఈ కారు ధ‌ర తెలిసి అంద‌రూ షాక్ అవుతున్నారు. వామ్మో! ఇంత కాస్ట్ లీ కారు కొనిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇన్నో వా క్రిస్టా హై బ్రిడ్ హైక్రాస్ ధ‌ర చూస్తే బేసిక్ మోడ‌లే ఎక్స్ షోరూమ్ రేటు రూ.24.46 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంది. ఇందులో హై ఎండ్ మోడ‌ల్ రూ.38.66 ల‌క్ష‌లు కాగా..  ఇన్నోవా క్రిస్టా హైక్రాస్ జెడ్ఎక్స్(ఓ) హైబ్రిడ్ టాప్ మోడల్ ఆన్ రోడ్ ధ‌ర వ‌చ్చేసి దాదాపు రూ.45 లక్షల వరకు ఉంది. దీంతో బేసిక్ మోడ‌ల్ తీసుకున్నా కూడా 25 ల‌క్ష‌ల‌కు ఎక్కువే అవుతుంది.  


దావ‌త్ షో తో.. 


రీతూ చౌద‌రి చాలా సీరియ‌ల్స్ చేసింది. అడ‌పా ద‌డ‌పా కొన్ని సినిమాల్లో కూడా న‌టించింది. జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా టీవీ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యింది. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మ‌డు. మంచి మంచి ఫొటోలు పెడుతూ కుర్ర‌కారును త‌న‌వైపుకు తిప్పుకుంది. ఇక ఈ మ‌ధ్యే దావ‌త్ షో ద్వారా ట్రెండింగ్ లోకి వ‌చ్చింది. ఆ షోకి వ‌చ్చే గెస్ట్ ల‌ను బోల్డ్ క్వ‌శ్చ‌న్స్ అడుగుతూ, త‌న‌దైన శైలీలో యాంక‌రింగ్ చేస్తూ షోపై ప్రేక్ష‌కుల్లో ఇంట్రెస్ట్ పెంచింది రీతూ. ఆమె న‌టించిన ‘ఆ ఒక్క‌టి అడ‌క్కు’ సినిమా ఈ మ‌ధ్యే రిలీజ్ అయ్యింది. ప్ర‌స్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. గుంటూరుకి చెందిన ఒక వ్యాపార‌వేత్త‌తో గత ఏడాది సీక్రెట్ గా పెళ్లి చేసుకుంద‌నే వార్త‌లు కూడా బయ‌టికి వ‌చ్చాయి. 


Also Read: కాపాడాల్సిన బాడీగార్డే.. లైంగికంగా వేధిస్తే? నటి అవికా గోర్‌కు చేదు అనుభవం, షాకవుతున్న ఫ్యాన్స్