Kalki 2898 AD Movie Censor Review: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు పాన్ వరల్డ్ ఆడియన్స్ 'కల్కి 2898 ఏడీ' రిలీజ్ కోసం ఎంతగానో, వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఆ ఎదురు చూపులకు మరొక వారంలో తెర పడనుంది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంది. మూవీ టీమ్ కాకుండా సినిమాను ఫస్ట్ చూసేది సెన్సార్ మెంబర్స్. రీసెంట్‌గా 'కల్కి 2898 ఏడీ' సెన్సార్ పూర్తి అయినట్లు సమాచారం. మూవీ టీమ్ అఫీషియల్‌గా సెన్సార్ గురించి బయటకు చెప్పడం లేదు. ముంబై నుంచి అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం 'కల్కి'కి యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. మూవీకి సెన్సార్ మెంబర్స్ ఇచ్చిన రివ్యూ ఏంటో చూడండి. 


కల్కి 2898 ఏడీ ఫస్ట్ రివ్యూ... స్టాండింగ్ ఒవేషన్!
Prabhas Kalki First Review: ముంబైలో సెన్సార్ మెంబర్లకు త్రీడీలో 'కల్కి 2898 ఏడీ' షో వేశారని సోషల్ నెట్వర్కింగ్ పోర్టల్ 'ఎక్స్'లో ఒకరు పేర్కొన్నారు. తన క్లోజ్ ఫ్రెండ్ ఆ షోకి వెళ్లారని తెలిపారు. హాలీవుడ్ స్టాండర్డ్స్ మ్యాచ్ చేసే విజువల్స్ చూసి సెన్సార్ మెంబర్స్ ఆశ్చర్యపోయారట. షో కంప్లీట్ అయ్యాక అందరూ నిలబడి చప్పట్లు కొట్టారట. స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారట.


ఇండియన్ సినిమాల్లో స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడనటువంటి విజువల్స్ ఈ 'కల్కి 2898 ఏడీ'లో ఉన్నాయని, స్టోరీ లైన్ ఇంప్రెసివ్ అండ్ యూనీక్ అని, బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ సక్సెస్ కొట్టేలా సినిమా ఉందని సోషల్ మీడియాలో సదరు నెటిజన్ తెలిపారు. 


ప్రభాస్ కామెడీ కేక... యాక్షన్ అదుర్స్!
నటీనటుల విషయానికి వస్తే... భైరవుడిగా ప్రభాస్ కామెడీ అదిరిపోయిందని షో చూసిన వ్యక్తి చెప్పారట. యాక్షన్ సీక్వెన్సులు బాగా ఎగ్జిక్యూట్ చేశారని, వాటిలో కూడా ప్రభాస్ కుమ్మేశారని తెలుస్తోంది. లెజెండరీ నటులు కమల్ హాసన్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ తమ స్థాయికి తగ్గ నటన కనబరిచారని టాక్. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ అన్నీ బాగా వచ్చాయట. 
సంతోష్ నారాయణన్ మ్యూజిక్ విషయంలో నెగెటివ్ రిపోర్ట్స్ వినబడుతున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికి ఒక్క సాంగ్ మాత్రమే రిలీజ్ అయ్యింది. ఆడియన్స్ నుంచి దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, బ్యాగ్రౌండ్ స్కోర్ అంతగా లేదని సెన్సార్ టాక్. సౌత్ ఇండియన్ ఆడియన్స్ వరకు అయితే సినిమాలో గెస్ట్ అప్పియరెన్సులు సర్‌ప్రైజ్ చేస్తాయట. ఎండింగ్ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ అని టాక్.


Also Read: 'కల్కి 2898 AD' రికార్డుల జోరు - రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ షేక్‌ చేస్తున్న ప్రభాస్‌



సుమారు 600 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' సినిమా హీరో ప్రభాస్ సహా దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీదత్ తదితరులకు భారీ విజయం అందించేలా ఉంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలలకు మంచి ముగింపు ఇవ్వడంతో పాటు రాబోయే ఆరు నెలలకు మంచి స్టార్ట్ అవుతుందని చెప్పవచ్చు.


Also Read: లాభాలు రావాలంటే ఎన్టీఆర్ బాక్సాఫీస్ కుంభస్థలాన్ని గట్టిగా కొట్టాలి... తెలుగు రాష్ట్రాల్లో 'దేవర'కు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్