Devara Telugu States Pre Release Business: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'దేవర'. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద హైప్ బాగుంది. మొదట అక్టోబర్ 10న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసినా... పవన్ కల్యాణ్ 'ఓజీ' రిలీజ్ పోస్ట్ పోన్ కావడంతో సెప్టెంబర్ 27కు వచ్చింది. ఈసారి రిలీజ్ డేట్ మారే ఛాన్స్ లేదు. ఇది పక్కా! ప్రొడ్యూసర్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు రేటుకు సినిమా అమ్మకాలు సాగించారు.
దేవర తెలుగు స్టేట్స్ రైట్స్ @ 125 కోట్లు!
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దేవర: పార్ట్ 1' థియేట్రికల్ రైట్స్ అటు ఇటుగా 125 కోట్ల రూపాయలకు అమ్ముడు అయ్యాయట. ఒక్క ఆంధ్ర ఏరియా రూ. 50 నుంచి 55 కోట్ల రేషియోలో విక్రయిస్తున్నారు. రాయలసీమ (సీడెడ్) రైట్స్ రూ. 23 కోట్లు పలికాయని తెలిసింది. నైజాం (తెలంగాణ) రైట్స్ అంతా కలిపి రూ. 45 కోట్ల రూపాయలకు విక్రయించారు. టోటల్ తెలుగు స్టేట్స్ 'దేవర' థియేట్రికల్ రైట్స్ రూ. 125 కోట్లు అని చెప్పవచ్చు. 'దేవర' ఆంధ్ర రైట్స్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, నైజాం రైట్స్ 'దిల్' రాజు తీసుకున్నారు.
బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలి?
Devara Break Even Target In Telugu States: 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత థియేటర్లలోకి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సినిమా 'దేవర'. ఈ హీరో సినిమా వచ్చి ఆల్మోస్ట్ రెండున్నర ఏళ్ళు అవుతోంది. తమ ఫేవరేట్ హీరో మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. పైగా, 'దేవర'కు ముందు పెద్ద సినిమాలు ఏవీ లేవు. జూన్ 27న ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' రిలీజ్ అవుతుంది. ఆగస్టు 15న వస్తుందని అనుకున్న 'పుష్ప: ది రూల్' రిలీజ్ డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ అయ్యింది. 'కల్కి' తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్లకు వచ్చే సినిమా 'దేవర' అవుతుందని, ఎన్టీఆర్ సినిమాకు అది బెనిఫిట్ అని ట్రేడ్ వర్గాలు నమ్ముతున్నాయి. అయితే... బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టాలి.
Also Read: టీనేజ్‌లో చేసిన పనికి తీరిగ్గా ఫీలవుతోన్న బిగ్ బాస్ బ్యూటీ
తెలుగు రాష్ట్రాల్లో 'దేవర' సినిమాను 125 కోట్లకు అమ్మిన నేపథ్యంలో అటు ఇటుగా 150 కోట్ల రూపాయల షేర్ వస్తే తప్ప డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒడ్డున పడే ఛాన్స్ లేదు. మూవీకి ఉన్న బజ్ చూస్తుంటే అంతకు అంత రావడం పెద్ద కష్టం కాదు. ఈ సినిమాకు భారీ బడ్జెట్ అయ్యింది. ఓవర్సీస్ రైట్స్ ద్వారా ఆల్మోస్ట్ రూ. 30 కోట్లు వచ్చాయట.
'దేవర' సినిమాలో ఎన్టీఆర్ జోడీగా జాన్వీ కపూర్, విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ 'ఫియర్' సాంగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ సాంగ్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Also Read: హనీ రోజ్ కత్తి పట్టి మనుషుల్ని వేటాడితే... గ్లామర్ కాదు, Rachel Teaserలో హనీ మాస్