ఎవరో దశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో చెప్పడం కష్టం. మరీ ముఖ్యంగా సినిమా, టీవీ ఇండస్ట్రీలో చెప్పడం అసలు కుదరదు. ముంబైకు చెందిన ఓ గ్లామర్ గర్ల్ దశ అలాగే తిరిగింది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు... మూడేళ్ళలో ఫేమ్, పబ్లిక్ ఇమేజ్ బాగా పెరిగింది. అందంతో ఆడియన్స్ అందరి దృష్టిలో పడింది. కానీ, ఇప్పుడు ఓ సినిమా చేసినందుకు తీరిగ్గా ఫీలవుతోంది. కంప్లీట్ డీటెయిల్స్‌లోకి వెళితే...


అనగనగా ఒక ముంబై అమ్మాయి. ఇప్పుడు ఆమె పేరు చెబితే కుర్రకారు ఠక్కున గుర్తు పడతారు. ముంబై పాపరాజీలో ఆవిడ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లినా కెమెరాలు క్లిక్ క్లిక్ అంటూ ఫోటోలు కొడతాయి. వీడియో సంగతి చెప్పనవసరం లేదు. నఖశిఖ పర్యంతం క్యాప్చర్ చేస్తాయి. హిందీలో బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ఆమె... కొన్నాళ్లకు బయటకు వచ్చింది. కానీ, బాగా పాపులర్ అయ్యింది. 


తెలుగులో కూడా ఆ బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ పాపులర్. ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో మందు కొట్టు పక్కన చేపల వేపుడు అమ్ముకునే లేడీ రోల్ చేసింది. అందులో ఆ అమ్మాయికి హీరో కమ్ కమెడియన్ లైన్ వేస్తుంటాడు. తర్వాత యంగ్ హీరోల సినిమాలు రెండిటిలో సినిమాల్లో తళుక్కున మెరిసింది. ఆ సినిమాలు హిట్ కాలేదు. కానీ, అమ్మడి గ్లామర్ సూపర్ హిట్ అయ్యింది. ఐటమ్ సాంగ్ చేసిన సినిమా హీరో అయితే తనను ఎవరూ చూడటం లేదని, అందరూ ఆ అమ్మాయిని చూస్తున్నారని పబ్లిక్ స్టేజి మీద చెప్పాడు. ఆ తర్వాత సినిమాలో కూడా గ్లామర్ షో చేసింది ఆ బ్యూటీ. ఆమె అందానికి కుర్రకారు ఫిదా అంటున్నారు. ఇంత ఫేమ్ తెచ్చుకున్న ఆమె వయసు పట్టుమని పాతికేళ్ళు కూడా దాటలేదు. రెండు పదులకు జస్ట్ ఒకట్రెండు ఎక్కువ అంతే!


Also Read: హనీ రోజ్ కత్తి పట్టి మనుషుల్ని వేటాడితే... గ్లామర్ కాదు, Rachel Teaserలో హనీ మాస్


అటు హిందీ, ఇటు తెలుగు ఆడియన్స్ అందరినీ తన అందంతో అట్ట్రాక్ట్ చేస్తున్న ఆ బిగ్ బాస్ బ్యూటీ టీనేజ్‌లో చేసిన పనికి ఇప్పుడు తీరిగ్గా ఫీల్ అవుతోందని ఫిల్మ్ నగర్ గుసగుస. అమ్మాయికి 20 ఏళ్ళు కూడా నిండక ముందు తెలుగులో సినిమా చేసింది. అందులో పాపులర్ యాక్టర్ కొడుకు హీరో. అప్పట్లో అవకాశం రావడం గొప్ప అనుకుని యాక్ట్ చేసింది. కానీ, ఆ సినిమా రిలీజ్ డిలే అవుతూ అవుతూ ఈ మధ్య రిలీజుకు రెడీ అవుతోంది.



మూడేళ్ళ క్రితం ఆ సినిమా చేశానని, అది ఏమో తెలుగులో తనకు పాపులారిటీ వచ్చాక విడుదలకు రెడీ అయ్యిందని, తన కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందేమోనని సన్నిహితుల దగ్గర బిగ్ బాస్ లేడీ తన గోడు అంతా వెళ్లబోసుకుంటుందట. ఏది ఏమైనా ఆ మూవీ రిలీజ్ అవ్వక తప్పదు. అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ రోల్స్ కంటే ముందు కథానాయికగా చేసిన సినిమా కావడంతో లీడింగ్ లేడీగా ఆమెకు అదే టాలీవుడ్ డెబ్యూ కానుంది. ఆ మూవీ రిలీజైన వెంటనే తెలుగులో ఆవిడ యాక్ట్ చేసిన కొత్త సినిమా ఏదోకటి రిలీజ్ అయితే బావుంటుందని కోరుకుంటోందట. ఆ బిగ్ బాస్ బ్యూటీ పేరు మీద కొంత పబ్లిసిటీ చెయ్యడానికి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్లాన్ చేస్తున్నారట. ఆవిడ క్రేజ్ క్యాష్ చేసుకోవాలని ట్రయల్స్ జరుగుతున్నాయి.


Also Readమీనాక్షీ చౌదరి... 27 ఏళ్ల వయసులోనే ఆ సినిమాలో యంగ్ హీరోకి భార్యగా!