Kalki 2898 AD Movie Pre Sale Business In North America: ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్న సినిమా 'కల్కి 2898 AD'. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ముందు నుంచి భారీగా అంచనాలు నెలకొన్నాయి. మూవీ అప్‌డేట్స్ కూడా అంతకు మించి ఉండటంతో రోజురోజుకు కల్కిపై విపరీతమైన బజ్ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు ఫస్ట్‌లుక్, టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న విడుదలైన భైరవ అంథమ్ సాంగ్‌లు అయితే యూట్యూబ్ మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈసాంగ్ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌లో టాప్ ట్రెండింగ్ ఉంది.
దీంతో కల్కి రిలీజ్ తర్వాత ఎలాంటి ఎలాంటి రికార్ట్స్ క్రియేట్ చేస్తుందో అంతా అంచనాలు వేసుకుంటున్నారు. అంతేకాదు వరల్డ్ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం దుమ్ములేయడం పక్కా అంటూ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగిరేస్తున్నారు. ఇదిలా ఉంటే కల్కి ఇప్పుడు రిలీజ్‌కు ముందే భారీగా బిజినెస్ చేసింది. ఓవర్సీస్‌లో కల్కి జోరు చూస్తుంటే ఈ మూవీ అంచనాలు మించి వసూల్లు చేసేలా ఉందంటున్నారు. ఇంకా రిలీజ్‌కు వారం ఉండగానే అప్పుడే ప్రీ బుక్కింగ్స్‌లో కల్కి రికార్డు క్రియేట్ చేసింది. జూన్ 27న మూవీ రిలీజ్ కానుండటంతో నార్త్ అమెరికాలో అప్పుడే ప్రీ బుక్కింగ్స్ ఒపెన్ చేశారు. దీంతో ఇప్పటి వరకు కల్కికి ప్రీ సేల్‌లో 2 మిలియన్ డాలర్లు రాబట్టింది.
ఎప్పటిలాగే ప్రభాస్ రికార్ట్ కంటిన్యూ అవుతుంది. తాజాగా ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. రిలీజ్‌కు ముందే కల్కి ప్రీ సేల్ 2 మిలియన్ల డాలర్లు చేసింది. అదీ కూడా రిలీజ్‌కు ఇంకా తొమ్మిది రోజులు ఉండగా..ఇక అమెరికాలో కల్కికి వస్తున్న రెస్పాన్స్ చూసి సినీ విశ్లేషకులే సర్‌ప్రైజ్ అవుతున్నారట. రిలీజ్‌కు ముందే ఇంత బిజినెస్ జరిగితే.. ఇక హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఓవర్సిస్‌లో కాసులే వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇక వరల్డ్ బాక్సాఫీసు వద్ద రూ. 1000 కోట్ల గ్రాస్ ఈజీగా చేసేస్తుందంటున్నారు. దాంతో రిలీజ్‌కు ముందే కల్కికి వస్తున్న రెస్సాన్స్ చూసి ఫ్యాన్స్ అంతా ప్రభాసా.. మజాకా అంటున్నారు.
కాగా బాహుబలి నుంచి ప్రభాస్ మార్కెట్ భారీగా పెరిగింది. అప్పటి నుంచి ఓవర్సిలో ప్రభాస్ సినిమాలకు మంచి డిమాండ్ పెరిగింది. ప్లాప్ మూవీ అయిన మినిమమ్ వసూల్లు చేస్తుంది. ఇక రిలీజ్‌కి ముందు అయితే మాత్రం భారీగా బిజినెస్ జరుగుతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే మేకర్స్ లాభాలు పొందుతున్నారు. ఇక ఓటీటీ, శాటిలైట్ రైట్స్ సపరేటు. ఏదేమైనా ప్రభాస్‌తో సినిమా అంటే నిర్మాతలకు కాసుల వర్షమే అని మరోసారి 'కల్కి' ప్రీ సేల్స్ చూస్తుంటే రుజువు అవుతుంది. కాగా ఈ సినిమాకు ప్రభాస్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మూవీ బడ్జెట్‌లో దాదాపు 25 శాతం ప్రభాస్ పారితోషికం ఉంటుందని సినీ సర్కిల్లోగు గుసగుస.
Also Read: సోనాక్షి పెళ్లిపై శత్రుఘ్న సిన్హా మనస్తాపం- పెళ్లికొడుకు తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!