Rashmi Gautam warning to Nookaraju Jabardasth: అన్నిసార్లూ కామెడీ కామెడీ అన్నట్టు ఉండదు. ఒక్కోసారి సీరియస్ కావచ్చు. స్టేజి మీద ఇన్స్టంట్ కామెడీ కోసం ట్రై చేసేటప్పుడు డైలాగులు అటు ఇటు పడితే ఎదుటి వాళ్ళు సీరియస్ కావచ్చు. 'జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమోలో అటువంటి సందర్భం ఒకటి చోటు చేసుకుంది. ఛోటా కమెడియన్ నూకరాజును చెప్పుతో కొడతానంటూ రష్మీ గౌతమ్ వార్నింగ్ ఇచ్చింది.


'ఏం రష్మీ... ఎలా ఉన్నావ్' అని నూకరాజు అడిగాడు. 


'నేను బాగానే వున్నాను కానీ... ఏంటి కామెడీ వుంటుందా?' అని రష్మీ గౌతమ్ అతడిని అడిగింది.


రష్మీ చెప్పింది వినపడనట్టు... 'ఏంటో?' అన్నాడు నూకరాజు. 


'స్కిట్టులో కామెడీ వుంటుందా' అని రష్మీ గౌతమ్ మళ్ళీ ప్రశ్నించింది. 


మళ్ళీ ఆమె చెప్పింది వినబడనట్టు... 'ఆ' అంటూ చెవి ఆమె వైపు చూపించాడు నూకరాజు. 


'సరే ఇటు రా ముద్దు పెడతా' అని డైలాగ్ మార్చింది రష్మీ. 


'ఆ వస్తున్నా' అంటూ ఆశగా ఆమె వైపు అడుగులు వేశాడు నూకరాజు. 


తన వైపు నూకరాజు రావడం గమనించిన రష్మీ... 'చెప్పు తీసుకుని కొడతా' అని సీరియస్ అవ్వడంతో వెనక్కి వెళ్ళిపోయాడు. జడ్జ్ సీటులో ఉన్న కృష్ణ భగవాన్, ఖుష్బూలు నవ్వుకున్నారు.


Also Readకల్కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... మూవీ సెన్సార్ పూర్తి... ప్రభాస్ సినిమాకు ముంబై నుంచి షాకింగ్ రిపోర్ట్స్!



మనల్ని ఎవడ్రా ఆపేది... డిప్యూటీ సీఎంను వాడేశారు!
'జబర్దస్త్'లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని & పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. లేటెస్ట్ ప్రోమోలో వాళ్ళిద్దర్నీ వాడేశారు. 'జబర్దస్త్'లో టీములను రెండుగా విడగొట్టారు. ఆ రెండు వర్గాల మధ్య బెట్ పెడుతున్నారు. 'మా పది వేలు పోయినందుకు మేం ఫీల్ కావడం లేదు. ఈ రోజుతో బెట్ ఆపేద్దాం' అని బుల్లెట్ భాస్కర్ అన్నాడు. 'ఏం భయపడ్డవా?' అని ఆటో రామ్ ప్రసాద్ అడిగాడు. '9, 9 మార్కులు తెచ్చుకున్న నేను ఐదు వేలు పోగొట్టుకోవడం ఏమిటి? 5, 5మార్కులు తెచ్చుకున్న ఆయన (రాకెట్ రాఘవను ఉద్దేశిస్తూ) ఐదు వేలు గెలుచుకోవడం ఏమిటి?' అన్నాడు.


బుల్లెట్ భాస్కర్ చెప్పిన తర్వాత ''ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పట్నించీ ఒక లెక్క. ఇంతకు ముందు గెలవడం కాదు, ఇప్పుడు గెలిచి చూపించండి' అని కెవ్వు కార్తీక్. ఆ వెంటనే 'నువ్వు ఎంతైనా పోటీ పడు. విజయం మాదే'' అని నారా చంద్రబాబు నాయుడు తరహాలో 'వి' సింబల్ చూపించాడు ఆటో రామ్ ప్రసాద్. ఆ తర్వాత 'మనల్ని ఎవడ్రా ఆపేది' అని పవన్ చెప్పిన డైలాగ్ నేపథ్యంలో వినిపించింది.


Also Read: తృప్తి దిమ్రి వైరల్ బికినీ ఫోటోలు... Bhabhi 2 మరీ బోల్డ్ బాబులూ



నాగబాబు జడ్జ్ సీటులో ఉన్నప్పటి నుంచి సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను, హైపర్ ఆది తదితరులు మెగా ఫ్యామిలీ మీద అభిమానం చూపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ మరిన్ని స్కిట్స్ చేస్తారేమో!