Deepika Padukone: ప్రభాస్‌ వల్లే నేను ఇలా అయ్యాను - బేబీ బంప్‌ చూపిస్తూ దీపికా ఆసక్తికర కామెంట్స్‌

Deepika Padukone: కల్కి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ దీపికా ప్రభాస్‌ను ఓ ఆటాడుకుంది. ప్రభాస్‌ వల్లే తనకు పొట్ట వచ్చిందంటూ అతడిపై ఫన్నీ కామెంట్స్‌ చేసింది. ప్రస్తుతం దీపికా కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

Continues below advertisement

Deepika Padukone Funny Comments on Prabhas: కల్కి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకునే బేబీ బంప్‌తో కనిపించి సందడి చేశారు. ఈ వెంట్‌లో దీపికా తనదైన ఫన్నీ కామెంట్స్‌,యాక్టివ్‌నెస్‌ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక ఈవెంట్‌లో రానాతో స్పెషల్‌ ఇంటారాక్షన్‌ సందర్భంగా దీపికా ప్రభాస్‌ప చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశం అయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ఇలా అవ్వడానికి కారణం ప్రభాస్‌.. అతడు ఇంటి భోజనమే అంటూ తన బేబీ బంప్‌ను చూపిస్తూ సరద కామెంట్స్‌ చేసింది.

Continues below advertisement

ప్రభాస్‌ ప్రతి రోజు షూటింగ్‌ తన ఇంటి నుంచే భోజనం తెప్పించేవాడిని, తన ఎంతో ఇష్టంగా మూవీ టీంకి భోజనం తెప్పించేవారని చెప్పారు. ప్రభాస్‌ది చాలా మంచి హ్రదయమని, ప్రతి రోజు రకరకాల వంటకాలతో భోజనం చేయించి క్యాటరింగ్‌లా చేయించేవారని చెప్పింది.ఈ రోజూ ప్రభాస్‌ ఇంటి ఎలాంటి స్పెషల్‌ వస్తుందా? అనే ఎగ్జయిట్‌మెంట్‌ ఉండేదని చెప్పుకొచ్చింది.అనంతరం మూవీ గురించి మాట్లాడుతూ.. కల్కి వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. కంప్లీట్ న్యూ వరల్డ్. డైరెక్టర్ నాగీ క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇది. యాక్టర్ గా ప్రొఫెషనల్  గా ఇది అద్భుతమైన ఎక్స్ పీరియన్స్. నాగీ జీనియస్. తన విజన్ చాలా క్లియర్ గా ఉంటుంది. సినిమాని అద్భుతంగా తీశారు' అంటూ చెప్పుకొచ్చింది. 

ఇదిలా ఉంటే విజనరి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన కల్కి మూవీపై జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్‌కు ఇంకా వారం రోజులు ఉందనగా కల్కి టీం నేడు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని చాలా గ్రాండ్‌గా నిర్వహించింది. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, ప్రభాస్‌ రానాలు పాల్గొని సందడి చేశారు. ఇక రానా స్పెషల్‌ ఎప్పియరెన్స్‌ ఇచ్చాడు. అంతేకాదు ఈ ఈవెంట్‌లో మూవీ టీంతో కలిసి ఇంటారాక్ట్‌ అయినా తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.

ఈ సందర్భంగా బిగ్‌బి, కమల్‌లు కల్కి మూవీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్‌ చేసుకుంటూ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ పనితనాన్ని, ఆయన విజనరి కొనియాడారు. కల్కి సినిమాతో నాగి కొత్త ప్రపంచం సృష్టించారు, ఇదోక మహా అద్భుతం అన్నారు అమితాబ్‌. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్‌ చివరిలో నిర్మాత అశ్వినీ దత్‌ మాట్లాడారు. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ప్రభాస్, దీపిక నలుగురూ ఇక్కడ వుండటం, అందరి సమక్షంలో ఈ ఈవెంట్ జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు. 'కల్కి 2898 AD’ యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుకను సక్సెస్‌ చేశారు. కాగా కల్కి మూవీని అత్యంత భారీ వ్యయం అశ్విని దత్ నిర్మించారు. దాదాపు  ఈ సినిమాకు రూ.500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు బడ్జెట్ కెటాయించారని సమాచారం. 

Also Read: అమితాబ్ కాళ్లకు దణ్ణం పెడితే.. ఆయన నా కాళ్లు పట్టుకుంటానన్నారు - కల్కి ఈవెంట్‌లో ప్రభాస్‌

Continues below advertisement
Sponsored Links by Taboola