Prabhas About Amitabha Bachchan and Kamal Haasan: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ 'కల్కి 2898 AD'(kalki Pre Release event) మరో వారం రోజుల్లో థియేటర్లోకి రాబోతుంది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో పాన్‌ వరల్డ్‌ తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్‌ వండర్‌గా కల్కిని చూపించబోతున్నాడు నాగ్‌ అశ్విన్‌. వైజయంతి మూవీస్‌ పతాకంపై నిర్మాత అశ్విని దత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


ఇక ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్‌, ట్రైలర్‌, భ:రవ్‌ అంథమ్‌కి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇక సినిమా విడుదలకు ఇంకా వారం రోజులు ఉందనగా నేడు ముంబై కల్కి ప్రీ రిలీజ్‌ను ఈవెంట్‌ను గ్రాండ్‌ నిర్వహించింది మూవీ టీం. బుధవారం జూన్‌ 19న జరిగిన ఈ వెంట్‌లో టాలీవుడ్‌ స్టార్‌, హ్యాండ్సమ్‌ హాంక్‌ రానా దగ్గుబాటి (Rana Daggubati) సందడి చేశారు. స్పెషల్‌ సెషన్‌ నిర్వహించి మూవీ ప్రధాన పాత్రలతో ఇంటారాక్ట్‌ అయ్యాడు. ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాలు రాబట్టాడు.


రానా జరిగిన ఈ ఇంటారాక్షన్‌ హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ దీపికా పదుకొనె ఆసక్తికర అంశాలు షేర్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతూ.. ముందుగా ఇద్దరు గ్రేటెస్ట్‌ లెజెండరీస్‌తో నటించిన అవకాశం ఇచ్చిన నిర్మాత అశ్వనీ దత్‌, డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌‌కి థ్యాంక్యూ. వారితో కలిసి నటించే అవకాశం రావడమంటే ఇట్స్‌ బిగ్గర్‌ దెన్‌ డ్రీం. అమితాబ్‌ గారి గురించి చెప్పాలంటే సెట్‌లో ఆయనని కలిసినప్పుడు కాళ్లకు దండం పెట్టబోతుంటే.. నువ్వు నా కాళ్లకు పెడితే.. నేను నీ కాళ్లకు దండం పెడతా అన్నారు. ఆయన అలా అనేసరికి నాకు ఏం అర్థం కాలేదు. ఆయనో పెద్ద స్టార్‌.



ఇండియా వైడ్‌గా పాపులరైన తొలి యాక్టర్‌ అమితాబ్‌ బచ్చన్‌ సర్‌. అప్పుడంతా అమితాబ్‌ గారి గురించే మాట్లాడుకునేవారు. ముఖ్యంగా సౌత్‌లో అంతా అమితాబ్‌ గారి హెయిర్‌ స్టైల్‌, హైట్‌ గురించే మాట్లాడుకునేవారు. సౌత్‌ ఎవరైన ఏంటీ నువ్వు ఏం అయినా అమితాబ్‌ బచ్చన్‌ అనుకుంటున్నావా? హైట్‌ గురించి వస్తే అమితాబ్‌ గారితో పోల్చేవారు. ఇక కమల్‌ సర్‌ కమల్ సార్ సాగరసంగమం చూసి కమల్ హాసన్ గారి లాంటి డ్రెస్ కావాలని మా అమ్మని అడిగాను. అలాగే ఇంద్రుడు చంద్రుడు చూసి డ్రెస్‌ లోపల క్లాత్ చుట్టుకొని ఆయనలా నటించేవాడిని. అలాంటి లెజెండ్స్ తో యాక్ట్ చేయడం అన్ బిలివబుల్. అలాగే దీపిక ఇంటర్నేషనల్ లెవల్ కి రీచ్ అయిన స్టార్. దీపికతో నటించడం బ్యూటీఫుల్ ఎక్స్ పీరియన్స్" అని ప్రభాస్‌ చెప్పుకొచ్చాడు. 


Also Read: దీపికా చేయకపోతే ప్రెగ్నెంట్‌గా కనపడదాం అనుకున్నా - 'కల్కి' ఈవెంట్‌లో కమల్‌ హాసన్‌ కామెంట్స్‌