అన్నీ రాకాసి ఆక్టోపస్‌లు. వాటి మధ్యలో ఎలా చిక్కుకుందో కానీ చిన్న చేప చిక్కుకుంది. తల మాత్రం బయటికి పెట్టి భయంభయంగా చూస్తోంది. ఆ ఫోటోలో ఆ చేప ఎక్కడుంతో కనిపెట్టండి చూద్దాం. కచ్చితంగా ఇది కష్టమైన పనే. అంత త్వరగా మీకు చేప చిక్కదు. ఎందుకంటే చేప శరీరం మొత్తం కనిపించదు, కేవలం తల మాత్రమే బయటికి పెట్టి చూస్తోంది. ప్రయత్నించి చూడండి. చాలా కొద్ది మంది మాత్రమే ఈ పజిల్ ను పరిష్కరించగలిగారు. ఈ ఆక్టోపస్ ఆప్టికల్ ఇల్యూషన్ ను ఫేస్ బుక్ పేజీలో హంగేరియన్ ఆర్టిస్ట్ గెర్లే డుడాస్ పోస్టు చేశారు. 


హింట్: ఆక్టోపస్ కళ్లు గుండ్రంగా, పెద్దవిగా ఉండి మీ చూపును అవే లాగేసుకుంటున్నాయి కదా, చేప కన్ను కూడా అలాగే ఉంటుంది. రంగు కూడా ఆక్టోపస్ రంగే, కాకపోతే చిన్న నోరు మాత్రం దానికి ఉంటుంది. కన్ను, నోరు ఈ రెండింటి ఆధారంగా చేపను కనుక్కోవాలి.


Also read:  ఈ చిత్రంలో ఎన్ని పులులు ఉన్నాయో తెలుసా? కేవలం ఒక్క శాతం మంది మాత్రమే చెప్పగలిగారు


జవాబు ఇదిగో
కనిపెట్టేసిన వాళ్లు చాలా తెలివైన వాళ్లే. వారికి మెదడుకు, కంటికి మధ్య సమన్వయం చాలా చక్కగా ఉన్నట్టే లెక్క. అంతే కాదు ఏకాగ్రత కూడా అధికమనే చెప్పుకోవాలి. ఇన్ని ఆక్టోపస్ ల మధ్యనే చిన్న చేపను గుర్తించడం చాలా కష్టమైన పనే, అయినా సాధించిన వారిని మెచ్చుకోవాల్సిందే. ఇక జవాబు విషయానికి వస్తే రెండో వరుసలో రెండో ఆక్టోపస్ వెనుక నుంచి చిన్న చేప తల బయటికి పెట్టి చూస్తోండి చూడండి. 




ఈ చిత్రాలను మెదడుకు మేత అనే చెప్పుకోవాలి. కంటి చూపు, మెదడు మధ్య సమన్వయాన్ని పెంచుతాయి. మెదడు పనితీరును మారుస్తాయి. చురుగ్గా ఉండేలా చేస్తాయి. పదునైన ఆలోచనలను కలిగిస్తాయి. వీటి పుట్టుక ఏనాటిదో ఎవరికీ తెలియదు. కానీ పూర్వపు మానవజాతికి కూడా ఇవి వినోదాన్ని పంచాయని చరిత్రకారులు చెబుతున్నారు. వీటిని ఎప్పుడు , ఎవరు కనిపెట్టారో మాత్రం సమాచారం లేదు. ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న ఆసక్తికరమైన పజిళ్లలో ఇవీ ఒకటి.  అప్పుడప్పుడు ఇలాంటి పజిల్స్ చూడడం వల్ల మీ మెదడు పదునుగా పనిచేస్తుంది. 


Also read: శరీరంలో ఉప్పు ఎక్కువైతే హైబీపీ వస్తుంది, మరి తగ్గితే ఏమవుతుంది?


Also read: యజమానిని నమిలి తినేసిన పెంపుడు పిల్లులు, రెండు వారాల తర్వాత బయటపడ్డ దుర్ఘటన