ఉప్పు లేనిదే ఏ వంటకానికి రుచి రాదు. ఎన్ని పదార్థాలు వేసినా, మసాలాలు దంచినా చివర్లో సరైన ఉప్పు పడనిదే ఆ వంటకం చప్పగా ఉందనే అంటారు. అందుకే వంటల్లో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఎక్కువ. కొందరు అధికంగా తినేస్తుంటే, మరికొందరు రోగాల భయంతో తినడవ తగ్గించేస్తారు. ఈ రెండూ కూడా ప్రమాదమే. ఉప్పును అధికంగా తినడం ఎంత ప్రమాదమో, ఉప్పును తినడం తగ్గించేయడం కూడా అంతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
ఉప్పు ఏం చేస్తుంది?
శరీరంలోకి చేరాక ఉప్పు సోడియం, క్లోరైడ్ అయానులుగా విడిపోతుంది. కండరాలను సంకోచించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సహకరిస్తుంది. శరీరంలో నీరు, ఖనిజాల సరైన సమతుల్యతను కాపాడ్డానికి సోడియం అవసరం. ముఖ్యమైన విధుల కోసం ప్రతిరోజు మనకు 500Mg సోడియం అవసరం అని అంచనా.
ఉప్పు తగ్గిస్తే...
ఉప్పు తినడం పెరిగితే ఏమవుతుందో అందరికీ తెలిసిందే... హైబీపీతో పాటూ పలు రకాల జబ్బులు దాడి చేసే అవకాశం ఉంది. కానీ తగ్గితే ఏమవుతుంది? తగ్గినా కూడా అనేక సమస్యలు వస్తాయి. వరుసగా వారం రోజుల పాటూ ఉప్పును అవసరానికి మించి తగ్గిస్తే శరీరం పై ప్రభావం కనిపించడం మొదలవుతుంది. కండరాల తిమ్మిరి, వికారం, వాంతులు, మైకం కమ్మినట్టు అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి మైకంతో కింద పడిపోతారు. ఉప్పు తీసుకోవడం కొన్ని నెలల పాటూ సాగితే మాత్రం కోమాలోకి వెళ్లే ప్రమాదముంది. శరీరంలో ఉప్పు తగ్గడం వల్ల ద్రవాల మధ్య సమతుల్యత తగ్గుతుంది. బరువు కూడా తగ్గిపోతారుు.లోపలి కణాలు వాచిపోయే ప్రమాదం ఉది. చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఉప్పును పూర్తిగా మానేయవద్దు, మరీ తగ్గించేయవద్దు. రుచికి సరిపపడా వేసుకుని తినండి. అధికంగా తింటే మాత్రం హైబీపీతో పాటూ గుండె జబ్బులకు స్వాగతం పలికినట్టే.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నదిదే...
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం మన శరీరానికి రోజుకు రెండు గ్రాముల సోడియం అవసరం పడుతుంది. రెండు గ్రాములు ఉప్పు మన శరీరంలో చేరాలంటే మనం కనీసం అయిదు గ్రాములు ఉప్పును తినాలి. అంటే ఒక టీస్పూను ఉప్పును ఆహారంలో కలుపుకోవాలి. రోజంతా కలిపి ఆ ఒక్క టీస్పూనే. పూటకో టీస్పూను అనుకోవద్దు. ఒక్క టీస్పూను ఉప్పు రోజంతటికి అంటే కాస్త చప్పగానే ఆహారం అనిపిస్తుంది. కానీ ఆరోగ్యం కోసం సర్దుకుపోక తప్పదు.
Also read: శరీరంలో ఉప్పు ఎక్కువైతే హైబీపీ వస్తుంది, మరి తగ్గితే ఏమవుతుంది?
Also read: యజమానిని నమిలి తినేసిన పెంపుడు పిల్లులు, రెండు వారాల తర్వాత బయటపడ్డ దుర్ఘటన