జూన్ 22 బుధవారం పంచాంగం


శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు


తేదీ: 22- 06 - 2022
వారం:  బుధవారం


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం


తిథి  : నవమి బుధవారం రాత్రి 12.44 వరకు తదుపరి దశమి
వారం :  బుధవారం  
నక్షత్రం:  ఉత్తరాభాద్ర ఉదయం 9.59 వరకు తదుపరి రేవతి
వర్జ్యం :  రాత్రి 10.08 నుంచి 11.45 వరకు తిరిగి  10.54 నుంచి 11.37
దుర్ముహూర్తం : ఉదయం 11.36 నుంచి 12.28 వరకు 
అమృతఘడియలు  : తెల్లవారుజాము నుంచి 6.48 వరకు
సూర్యోదయం: 05:30
సూర్యాస్తమయం : 06:33


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి


బుధవారం విఘ్నాలు తొలగించే గణనాథుడిని పూజిస్తారు..అయ్యప్పస్వామి అంటే భక్తి ఉన్నవారు స్వామికూడా స్మరించుకుంటారు. ఈ రోజు అయ్యప్ప భక్తుల కోసం అయ్యప్ప స్వామి 18 నమస్కార శ్లోకాలు


ఓం నమః శివాయ || ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః
ఓం శ్రీ అయ్యప్ప స్వామియే నమః || ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప


1. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం
పార్వతీ హృదయానంద శాస్తారం ప్రణమామ్యహం !!
ఓం స్వామియే శరణమయ్యప్ప


2. విప్ర పూజ్యం విశ్వ వంద్యం విష్ణు శంభు ప్రియం సుతం
క్షిప్ర ప్రసాదం నిరతం శాస్తారం ప్రణమామ్యహం !!


3. మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం
సర్వ విఘ్న హరం దేవం శాస్తారం ప్రణమామ్యహం !!


4. అస్మత్ కులేశ్వరం దేవం అస్మతౌ శత్రు వినాశనం
అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యాహం !!


5. పాండ్యేశవంశ తిలకం భారతేకేళి విగ్రహం
ఆర్తత్రాణ పరందేవం శాస్తారం ప్రణమామ్యాహం !!


6. పంచ రత్నాఖ్య మేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే !!


7. త్రియంబక పూరాదీశం గణాధిప సమన్వితం గజారూడ మహం వందే శాస్తరం కుల దైవతం


8. యస్య ధన్వంతరీ మాతా పితా రుద్రోభిషక్ నమః
త్వం శాస్తార మహం వందే మహావైద్యం దయానిధిం !!


9. అరుణోదయ సంకాశం నీలకుండల ధారణం
నీలాంబర ధరం దేవం వందేహం బ్రహ్మ నందనం !!


10. చాప బాణం వామస్తే చిన్ముద్రాం దక్షిణకరే
విలసత్ కుండల ధరం వందేహం విష్ణు నందనం !!


11. వ్యాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం
సువీరాట్టధరం దేవం వందేహం శంభు నందనం !!


12. కింకిణోద్యాన భూతేశం పూర్ణచంద్ర నిబాననం
కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం


13. భూత భేతాళ సం సేవ్యం కాంచనాద్రి నివాసితం
మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తి నందనం !!


14. శ్రీహరిశ పుత్రం దేవం శ్రీహరి శంకరాత్మజం
శబరీ గిర్రిశ్వరం దేవం నమామి భూతనాయకం


15. జగత్ ప్రియం జగన్నాథం జగదానంద దాయకం
జగదీశం కృపా పూర్ణం నమామి భూతనాయకం


16. భూతేశం తారక బ్రహ్మం గిరీశం గిరిజాత్మజం పరమేశాత్మజం దేవం నమామి పాపనాశనం


17. జనార్ధన సుతం దేవం వాసవేశం మనోహరం
వనవాస ప్రియం దేవం నమామి జగదీశ్వరం


18. పాలనేత్ర సుతం దేవం కలిదోష నివారణం
బాలరూపం లోకనాధం నమామి శభరీశ్వరం
ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వ భూత దయాపర
రక్ష రక్ష మహా బాహొ శాస్తే తుభ్యం నమో నమః


Also Read:  మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు