ఇంట్లో పనిని సులభతరం చేసేందుకు కొన్ని చిట్కాలు ఉంటాయి. అవి అందరికీ తెలియాలని లేవు. అలాగే ఆహారాన్ని మరింత రుచికరంగా మార్చేందుకు సీక్రెట్ ఇన్‌గ్రేడియంట్స్ కలపాల్సి వస్తుంది. అవేంటో కూడా ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. అలాంటి చిట్టి చిట్కాలు ఇవిగో...


1. నూడుల్స్ ఇంట్లో చేస్తున్నప్పుడు ఎక్కువగా ఒకదానికొకటి అతుక్కపోతూ ఉంటాయి. దీని వల్ల నూడుల్స్ ముద్దగా అయ్యే అవకాశం ఉంది. అందుకే నీళ్లలో ఉప్పు, రెండు చెంచాల నూనె , చెంచా వెనిగర్ వేస్తే సరి. రంగు తెల్లగా వస్తాయి. 


2. ఇంట్లో కేకు చేస్తునప్పుడు చాలా మంది అది గట్టిగా వస్తుంది. నొక్కితే మెత్తటి పట్టుకుచ్చులా రావాలంటే కేకు మిశ్రమంలో అర స్పూను లేదా స్పూను ఈనో ప్యాకెట్ పొడి లేదా వంట సోడా కలపాలి. 


3. బాదం పప్పు మీది పొట్టు సరిగా రావడం లేదా, అయితే వేడి నీళ్లలో కాసేపు ఉంచి తరువాత ఒలిస్తే సులువుగా వచ్చేస్తుంది. 


4. ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లు తీవ్రంగా మండిపోతున్నాయా? అయితే ఉల్లిపాయలను మధ్యలోకి కట్ చేసి నీళ్లలో వేసి ఉంచి, పదినిమిషాల తరువాత్ కట్ చేయాలి. 


5. ఇంట్లో దోమల బెడదే వేధిస్తుంటే ఇలా చేయండి... నిమ్మనూనెలో రెండు చుక్కల వేస నూనె వేసి దీపం వెలిగించండి. ఆ వాసనకు దోమలు పారిపోతాయి. 


6. షూ పాలిష్ ను ఉపయోగించి ఫర్నిచర్ పై ఉన్న మరకలు కూడా పొగట్టుకోవచ్చు. 


7. వంటపాత్రలు బాగా మాడిపోయాయా? అయితే బ్లీచింగ్ పొడి వేసి కాసేపు నానబెట్టాక తోమితే మాడు మరకలు మొత్తం పోతాయి. 


8. ముత్యాలతో చేసిన నగలను చాలా మంది బీరువాలో పెట్టి, గాలి చొరబడకుండా వస్త్రాల్లో చుట్టి దాచేస్తారు. ఇలా చేయడం వల్ల ముత్యాల రంగు పోతుంది. ముత్యాల ఆభరణాలకు గాలి తగులుతూ ఉండాలి.   


9. పూరీలు బాగా పొంగినట్టు రావాలా? అయితే గోధుమపిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ కలపాలి. లేదా బియ్యంప్పిండి కలిపినా మంచి ఫలితమే కనిపిస్తుంది. 


10. పెరుగు త్వరగా పులిసిపోకుండా ఉండాలంటే చిన్న చిట్కా పాటించాలి. చిన్న కొబ్బరి ముక్క తీసి అందులో వేయాలి. 


11. మొదటగా వేసిన దోశె పెనానికి అతుక్కుపోయి రాదు. దోశె వేసే ముందు పెనంపై వంకాయతో రుద్దితే సులువుగా వచ్చేస్తుంది. 


12. కోడి గుడ్డు ఉడికిన తరువాత పెంకు తీయడం కొన్ని సార్లు కష్టంగా మారుతుంది. కోడిగుడ్లను ఉడికించేటప్పుడే ఉప్పును వేస్తే, తరువాత పెంకు సులువుగా వచ్చేస్తుంది. 


13. పంచదార డబ్బాలో రెండు లవంగాలు వేస్తే చీమలు పట్టవు. 


14. కారం పొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క వేస్తే మంచిది. కారం త్వరగా పురుగు పట్టదు. 


Also read: యజమానిని నమిలి తినేసిన పెంపుడు పిల్లులు, రెండు వారాల తర్వాత బయటపడ్డ దుర్ఘటన


Also read: ఇలా శ్వాస తీసుకుంటున్నవారు మేధావులట, మరి మీరు ఎవరో తెలుసుకోండి