పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా జనాలు కూడా అప్ డేట్ అవుతున్నారు. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు జోరుగా సెల్ఫీలు తీసుకునే వారు. రకరకాల యాంగిల్స్ తీరొక్క ఫోటోలు క్లిక్ మనిపించేవారు. రాను రాను కొత్త ఒరవడి తయారైంది. సెల్ఫీలు కాస్త షార్ట్ వీడియోస్, రీల్స్ గా మారిపోయాయి. సెల్ఫీలను వదిలేసి రీల్స్ వెంటబడ్డారు యువతీ యువకులు.  


షార్ట్ వీడియోలు చూసేందుకు రోజుకు 156 నిమిషాల కేటాయింపు


ప్రస్తుతం భారతీయులు  స్మార్ట్‌ ఫోన్‌లలో వినోద కంటెంట్‌ను చూసేందుకు రోజుకు దాదాపు 156 నిమిషాల సమయం కేటాయిస్తున్నారట.  నిజానికి, సగటున, ఒక భారతీయ వినియోగదారు ప్రతిరోజూ దాదాపు 38 నిమిషాల షార్ట్ ఫారమ్ కంటెంట్‌ ని  చూస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ ప్రకారం, షార్ట్-ఫారమ్ యాప్‌లు 2025 నాటికి తమ నెలవారీ యాక్టివ్ యూజర్ బేస్ 600 మిలియన్లకు (మొత్తం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో 67 శాతం) రెట్టింపు అవుతాయని తేల్చింది. 2030 నాటికి $19 బిలియన్ల మానిటైజేషన్ అవకాశాన్ని కలిగి ఉంటుందని వెల్లడించింది.   షార్ట్-ఫారమ్ యాప్ మార్కెట్‌లో మోజ్, జోష్, రోపోసో, ఎమ్‌ఎక్స్ తకటాక్, చింగారి మొదలైనవారు ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు తెలిపింది.


ఇండియన్ షార్ట్-ఫారమ్ యాప్స్ లో అసాధారణ వృద్ధి


ఇతర ప్లాట్‌ఫారమ్‌లతో పోల్చితే ఇండియన్ షార్ట్-ఫారమ్ యాప్‌లు అసాధారణ వృద్ధిని సాధిస్తున్నాయని రెడ్‌సీర్ సంస్థకు చెందిన  మోహిత్ రానా వెల్లడించారు. దీనికి ముఖ్యమైన కారణం తక్కువ శ్రమ, అలసట లేకపోవడం, చక్కటి స్థానిక భాష, విభిన్న అంశాలను సృశించడం ద్వారా ఈ షార్ట్ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. షార్ట్-ఫారమ్ వీడియోలను రికార్డ్ చేయడానికి అన్ని వయసుల వారు సెల్పీ కెమెరాల మీదే ఆధారపడుతున్నందున పెద్దగా ఇబ్బందులు ఉండటం లేదని తెలిపారు.   


భారత్ లో 1.5 లక్షల మంది ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేటర్‌లు


భారతదేశంలో ఇప్పుడు కనీసం 8 కోట్ల మంది వీడియో కంటెటం క్రియేటర్‌లు ఉన్నారు. వారిలో కేవలం 1.5 లక్షల మంది ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేటర్‌లు మాత్రమే తమ సేవలను సమర్థవంతంగా వినియోగించి, డబ్బును సంపాదిస్తున్నారు. దేశంలోని 8 కోట్ల మంది క్రియేటర్‌లలో కంటెంట్ క్రియేటర్‌లు, వీడియో స్ట్రీమర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, బ్లాగర్‌లు, OTT ప్లాట్‌ ఫారమ్‌లలోని క్రియేటర్‌లు, ఫిజికల్ ప్రొడక్ట్ క్రియేటర్‌లు ఉన్నట్లు తాజాగా నివేదిక వెల్లడించింది. 1.5 లక్షల మంది ప్రొఫెషనల్ కంటెంట్ క్రియేటర్‌లలో చాలా మంది నెలకు 200 డాలర్ల నుంచి 2,500 డాలర్ల (నెలకు రూ. 16,000-రూ. 200,000 కంటే ఎక్కువ) సంపదిస్తున్నారని తేలింది.


దేశంలో ప్రాంతీయ షార్ట్-ఫారమ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో 50,000 మంది ప్రొఫెషనల్ క్రియేటర్‌లు ఉన్నారు. వారి ఫాలోవర్లలో 60 శాతం మంది బయటి మెట్రోల నుంచి ఉన్నారని వెల్లడైంది. వారి మూలంగానే ప్రాంతీయ కంటెంట్ వినియోగం పెరుగుతోంది.  "సోషల్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ వ్యక్తులకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను నేరుగా చేరుకోవడానికి వీలు కల్పించాయి. అయినా, కొద్ది మంది క్రియేటర్‌లు మాత్రమే సమర్థవంతంగా డబ్బు అర్జిస్తున్నారు" అని నివేదిక వెల్లడిస్తోంది.   


Read Also: రూ. 81 కోట్ల లాటరీ గెలిచాడు, ఇక భార్య కోసం వెతుకుతున్నాడు!