ఒత్తిడి శరీరంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇవి మాత్రమే కాదు అకస్మాత్తుగా బరువు పెరిగేందుకు కారణమవుతుందట. అందుకే ఒత్తిడి స్థాయిలు అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడికి గురైనప్పుడు ఎక్కువగా తింటూ ఉంటారు. దాని వల్ల బరువు పెరిగిపోతారు. లేదంటే శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల జరుగుతుంది. కార్టిసాల్ అనేది అధిక ఒత్తిడికి గురైనప్పుడు శరీరం విడుదల చేసే హార్మోన్. ఇది విడుదల అయినప్పుడు ఆకలిని ప్రేరేపిస్తుంది. ఇది అతిగా తినేలా చేస్తుంది. ఒత్తిడి సమయంలో ఇష్టమైన ఆహారాలు తినాలనే ఆసక్తి చూపిస్తారు. అందుకే కార్టిసాల్ తగ్గించుకునే మార్గాలు ప్రయత్నించాలి.


బాగా నిద్రపోవాలి


కనీసం ఎనిమిది గంటల నిద్ర చాలా వాసరం. అస్థిరమైన నిద్ర షెడ్యూల్ వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. సమయానికి నిద్రపోతే కార్టిసాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. నిద్రకి ఉపక్రమించే ముందు ఫోన్లు చూడటం తగ్గించాలి. పడుకోవడానికి గంట ముందుగా ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు తాగితే హాయిగా నిద్రపడుతుంది. అంతే కాదు పడుకునే గది కూడా చీకటిగా ఉండేలా చూసుకోవాలి. కాంతి ఎక్కువగా ఉంటే అది నిద్రకి ఆటంకం కలిగిస్తుంది.


డీప్ బ్రీత్


దీర్ఘ శ్వాస కార్టిసాల్ స్థాయిలని తగ్గించడంలో సహాయపడుతుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థని ప్రేరేపిస్తుంది. ఇది కార్టిసాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ఒత్తిడి ఆందోళన తగ్గించేందుకు పని చేస్తుంది.


శారీరక శ్రమ


శారీరక శ్రమ, వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ధాన్యం, యోగా వంటివి చేయడం వల్ల ఒత్తిడి అదుపులోకి వస్తుంది. స్ట్రెస్ లేకపోతే బరువు నియంత్రంలోనే ఉంటుంది.


ఆలోచనలు తగ్గించుకోవాలి


నిద్రలేమి, పని ఎక్కువ అవడం, ఇంట్లో సమస్యలు మొదలైన కారణాల వల్ల ఒత్తిడిగా ఫీల్అవుతారు. అటువంటి వాటి గురించి ఆలోచించడం తగ్గించాలి. ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఎదుర్కొనే మార్గాలు అనుసరించాలి. అప్పుడే కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. తోటి వారితో ఆరోగ్యకరమైన సంబంధాలు కలిగి ఉండాలి. ఇష్టమైన వ్యక్తులతో టైమ్ స్పెండ్ చేయడం అలవాటు చేసుకోవాలి. కాసేపు ఫ్యామిలీతో గడిపితే ఒత్తిడి ఆలోచనలన్నీ దూరవమవుతాయి.


గొడవలు, ఆందోళన పెంచే వ్యక్తులకు దూరంగా ఉండాలి. వారితో ఉండటం వల్ల ఒత్తిడి, ఆలోచనలు పెరిగిపోతాయి. దీని వల్ల కార్టిసాల్ స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా బరువు పెరిగిపోతారు. అందుకే ఒత్తిడి తగ్గించుకునేందుకు మనసుకి హాయినిచ్చే సంగీతం వింటూ మనసు, ఆలోచనలు డైవర్ట్ చేసుకోవచ్చు. మైండ్ కి ప్రశాంతంగా ఉండే ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు గడిపినా కూడా ఒత్తిడి తగ్గిపోతుంది. మనసుకి హాయిగా ఉంటుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: పనస విత్తనాలని పక్కన పడేస్తున్నారా? ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్టే


Join Us on Telegram: https://t.me/abpdesamofficial