సానుకూల ఆలోచనలు, సానుకూల దృక్పథంతో ముందుకెళ్లేవారే ఆరోగ్యంగా ఉంటారు. ప్రతికూల ఆలోచనలతో ఉండేవారు ఆనందంగా ఉండడం కష్టం. కొన్ని అలవాట్లు మనుషుల్లో నెగెటివిటీని పెంచేస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం మానసిక స్థితిని మార్చేస్తుంది. దీనివల్ల నెగిటివ్ ఆలోచనలు పెరిగిపోతాయి. ఇలాంటి అలవాట్లు మీకు ఉంటే వెంటనే మానేయండి.
ఎక్కువ స్క్రీన్ టైమ్
ఆధునిక కాలంలో స్క్రీన్ పై గడిపే సమయం ఎక్కువైపోతోంది. ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌ల ముందే ఎక్కువమంది కూర్చుంటున్నారు. దీనివల్ల మానసిక స్థితి మారిపోతుంది కూడా. స్క్రీన్‌ల నుంచి వచ్చే నీలి కాంతి చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే నిద్రకు భంగం కలిగిస్తుంది. దీనివల్ల మొత్తం మానసిక ఆరోగ్యం పైనే ప్రభావం పడుతుంది.
నిద్రలేమి
ఆధునిక కాలంలో ఉన్న ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు నిద్రలేమిని పెంచేస్తున్నాయి. ఆలస్యంగా నిద్రపోవడం, సరిగా నిద్రపోకపోవడం, తక్కువ సమయం నిద్రపోవడం, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించడం వంటివి నిద్రకు భంగం కలిగిస్తున్నాయి.
నిద్ర తగ్గిందంటే నెగిటివ్ ఆలోచనలు పెరిగిపోతాయి.
అనారోగ్యకరమైన ఆహారం
ఆరోగ్యకరమైన జీవితానికి తాజా ఆకుకూరలు, కూరగాయలతో వండిన ఆహారాన్ని తినాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, శుద్ధి చేసిన చక్కెరతో వండిన ఆహారాలు, అనారోగ్యకరమైన కొవ్వులు నిండిన పదార్థాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ ఆహారాలు ఎలాంటి పోషకాలను కలిగి ఉండదు. ఇవి మీ మానసిక స్థితిపై, శక్తి పై ప్రతికూలతను చూపిస్తాయి. మీరు పాజిటివ్ దృక్పథాన్ని వదిలి నెగటివ్ ఆలోచనలు వైపు వెళతారు. కాబట్టి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లేత ప్రోటీన్‌తో ఉన్న మాంసాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. చక్కెర పానీయాలను, ఆల్కహాల్‌ను తగ్గించి... నీటిని, పండ్ల రసాలను అధికంగా తీసుకోవాలి.
ప్రతికూల చర్చలు
నెగిటివ్ చర్చలు చేయకూడదు. ప్రతిదీ పాజిటివ్‌గా ఉంటుందని భావిస్తూ ఉండాలి. మీ ఆత్మగౌరవాన్ని, మానసిక స్థితిని దెబ్బతీసే విధంగా మిమ్మల్ని మీరు నిందించుకోవడం, విమర్శించుకోవడం వంటివి చేయకూడదు. సానుకూల దృక్పధాన్ని పెంచుకోవాలి. మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటూ ఉండాలి.
ఒంటరిగా ఉండడం
ఒంటరిగా ఎక్కువ సమయం గడపడం మంచి పద్ధతి కాదు. ఇది మానసిక స్థితిని దిగజారుస్తుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే సమాజంలోని వ్యక్తులతో కనెక్ట్ అవుతూ ఉండాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో తరచూ మాట్లాడుతూ ఉండాలి. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండాలి. అప్పుడే మీ మానసిక స్థితి ఆరోగ్యంగా ఉంటుంది.
నిశ్చల జీవనశైలి
ఎక్కువ సమయం పాటూ ఒకే చోట కూర్చోవడం, పడుకోవడం వంటివి చేయకూడదు. శారీరక శ్రమ చాలా అవసరం. ఇది మీ శక్తి స్థాయిలను పెంచుతాయి. రోజూ వ్యాయామం చేయడం, నడక వంటివి అలవాటు చేసుకోవాలి. ఇవి మీ శారీరక, మానసిక ఆరోగ్యం పై అనుకూలంగా పనిచేస్తాయి. ఎక్కువసేపు కూర్చోవడం, పడుకోవడం చేస్తే అవి మీ ఆరోగ్యాన్ని చెడగొడతాయి. మీ ఆలోచన శక్తిని ప్రతికూలంగా మారుస్తాయి. మీ మానసిక స్థితి మెరుగుపడాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాలి.
Also read: చంటి పిల్లలు జాగ్రత్త, వారిపైనే కొత్త వైరస్ ప్రతాపం - ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు