మనం తినే ఆహారం, తాగే పానీయాలు మన సంపూర్ణ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. అలాగే ఆహారాలను, పానీయాలను ఫిల్టర్ చేసి వ్యర్థాలను వడకట్టేవి కిడ్నీలు. కిడ్నీల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహారాలను తినాల్సిన అవసరం ఉంది. శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి జీవక్రియల్లో ఏర్పడిన వ్యర్తాలను బయటికి పంపి రక్తాన్ని శుభ్రపరుస్తాయి.  ఆరోగ్య నిపుణుల చెబుతున్న ప్రకారం, ఆహారంలో కొన్ని పదార్థాలను తినడం వల్ల మూత్రపిండాలు బాగా శుభ్రపడతాయి. వాటి పనితీరు మెరుగుపడుతుంది. 


1. మూత్రపిండాలను శుభ్రపరిచి, డిటాక్సిఫికేషన్ చేయడంలో నీరు అత్యంత ముఖ్యమైనది. ప్రతిరోజూ ఎనిమిది గ్లాసులకు తగ్గకుండా నీటిని తాగడం అలవాటు చేసుకోండి. దీని వల్ల శరీరంలో హైడ్రేటెడ్ గా ఉండడంతో పాటూ శరీరంలోని టాక్సిన్లు, వ్యర్థాలు బయటికి పోతాయి.  సహజంగా మూత్రపిండాలను రిపేర్ చేయడంలో నీరు సహాయపడుతుంది.


2. క్రాన్ బెర్రీస్ పండ్లు సూపర్ మార్కెట్లలో అధికంగా దొరుకుతాయి. తరచూ ఈ పండ్లను తింటూ ఉండాలి. వీటిని జ్యూస్ రూపంలో తీసుకున్నా మంచిదే. క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. మూత్రాశయం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని ఇవి కాపాడతాయి. 


3. సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు చేపలను తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటుంది. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం, ఒమేగా -3 కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించవచ్చు. దీనివల్ల అధిక రక్తపోటు కూడా తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉంటే మూత్రపిండాల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి కొవ్వు పట్టిన చేపలను తినడం అలవాటు చేసుకోవాలి. 


4. నిమ్మ, నారింజ పండ్లను పుష్కలంగా తినడం వల్ల శరీరం తేమవంతంగా ఉంటుంది. మూత్రపిండాల్లోని వ్యర్థాలను బయటికి పంపేందుకు ఇది సహాయపడుతుంది. ఈ పండ్లలో అధిక స్థాయిలో సిట్రేట్ ఉంటుంది.  ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. మూత్రంలో తక్కువ ఆమ్లాన్ని అడ్డుకుంటాయి. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మంచిది. 


5. దోసకాయలను తరచూ ఏదో ఒక ఆహారాన్ని వండుకుని తినడం అలవాటు చేసుకోవాలి. దీనిలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. దోసకాయలు మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని అడ్డుకుంటాయి. దోసకాయలు తినడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. 


6. సెలెరీ అనేది ఒక ఆకుకూర. దీని తినడం వల్ల శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయి. ఇది మల విసర్జన సాఫీగా సాగేలా చేస్తుంది. కిడ్నీలపై ఒత్తిడి పడనివ్వదు. 


Also read: మెరిసే చర్మం కోసం ఇంట్లోనే ఇలా దానిమ్మ ఫేస్ మాస్క్‌లు ప్రయత్నించండి


Also read: చికెన్ కీమా ఇలా శెనగపప్పుతో కలిపి వండారంటే రుచి మామూలుగా ఉండదు










































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.