చికెన్ కీమాను ఎప్పుడూ ఒకేలా వండుకుంటే ఏముంటుంది మజా. ఓసారి శెనగపప్పుతో కలిపి వండి చూడండి. రుచి అదిరిపోతుంది. ఇది వైట్ రైస్ లోకి, చపాతీలోకి కూడా రుచిగా ఉంటుంది. దీన్ని వండడం కూడా చాలా సులువు. ఓసారి ప్రయత్నిస్తే మళ్లీ మళ్లీ మీరే వండుకుంటారు. 


కావాల్సిన పదార్థాలు
చికెన్ కీమా - అరకిలో
శెనగ పప్పు - 150 గ్రాములు
ఉల్లిపాయ - ఒకటి
నూనె - సరిపడినంత
కారం - రెండు స్పూన్లు
పసుపు - అరస్పును
పచ్చిమిర్చి - రెండు
ధనియాల పొడి - ఒక స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
లవంగాలు - నాలుగు
మిరియాలు - నాలుగు
పుదీనా - ఒక కట్ట
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - ఒక కట్ట
నిమ్మ కాయ - ఒకటి


తయారీ ఇలా 
1. శెనగపప్పును రెండు గంటల ముందే నానబెట్టుకోవాలి. లేదా కుక్కర్లో ఉడికించుకోవాలి. 
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో లవంగాలు, మిరియాలు వేసి వేయించాలి. 
3. అవి వేగాక తరిగిన పచ్చి మిర్చి, ఉల్లిపాయ వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. 
4. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న లేదా నానబెట్టుకున్న శెనగపప్పును వేసి కలపాలి. 
5. మూత పెట్టి అయిదు నిమిషాలు మగ్గించాలి. తరువాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి మూత పెట్టాలి. 
6. అయిదు నిమిషాల తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు వేగాక నీళ్లు పోసి మూత పెట్టాలి. 
7. తరువాత చికెన్ కీమాను శుభ్రంగా కడిగి ఆ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. మూత పెట్టి చిన్న మంట మీద అరగంట పాటూ ఉడికించాలి. 
8.స్టవ్ కట్టేయడానికి అయిదు నిమిషాల ముందు కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి మూత పెట్టాలి. 
9. చివర్లో కాస్త గరంమసాలా చల్లి, ఓసారి కలిపి స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ శెనగపప్పు చికెన్ కీమా సిద్ధమైనట్టే. 


చికెన్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చికెన్ చాలా తేలికగా జీర్ణమవుతుంది. చికెన్ తినడం వల్ల బరువు కూడా త్వరగా పెరగరు. చికెన్ తినడం వల్ల ప్రొటీన్ పుష్కలంగా అందుతుంది. చికెన్ నూనెలో వేయించి తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం. అదే కూర రూపంలో వండుకుని తింటే ఆరోగ్యకరమే. చికెన్ ఉడికించి తింటే ఎంతో మంచిది. చికెన్ సూప్ వారానికి ఒకసారి తాగడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెంచడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.చికెన్ లో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. విటమిన్ బి6, విటమిన్ బి12, జింక్, ఇనుము అధికంగా ఉంటాయి. 


Also read: ప్రతిరోజూ ఈ ఆహారాలు తింటే హైబీపీని అదుపులో ఉంచుకోవచ్చు




Also read: సల్మాన్ ఖాన్‌ను వేధిస్తున్న సమస్య ఇదే, దీంతో ఆత్మహత్యా ఆలోచనలు పెరిగిపోతాయి


Also read: ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి



































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.