World Heart day: కొంతమంది సెలెబ్రిటీలు జిమ్‌కు వెళ్లొచ్చాక గుండె పోటుకు గురై మరణించడం జరిగింది. దీంతో వ్యాయామానికి, గుండె పోటుకు మధ్య ఉన్న సంబంధంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో కేవలం యాభై ఏళ్లు దాటిన వారే గుండె పోటుకు గురయ్యే వారు కానీ ఇప్పుడు యువకుల నుంచి మధ్య వయస్కులు కూడా కార్డియాక్ అరెస్టుకు గురవుతున్నారు. దీంతో అన్ని వయసుల వారు గుండె పోటు విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు వైద్యులు. ప్రతి ఏడాది గుండె ఆరోగ్యం విషయంలో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ 29న ‘వరల్డ్ హార్ట్ డే’ నిర్వహిస్తారు. 


కోపంగా ఉన్నప్పుడు చేయచ్చా?
చాలా మంది రిలాక్సేషన్ కోసం జిమ్‌కు వెళతారు. కోపంగా ఉన్నప్పుడు, తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు కూడా రిలాక్స్ అయ్యేందుకు, మూడ్ మార్చుకునేందుకు జిమ్‌కు వెళతారు. కానీ అలా వెళ్లడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. పరుగు, వ్యాయామం గుండెకు మేలు చేస్తాయన్నది నిజమే. ఎందుకంటే ఇవి హృదయ స్పందన రేటును పెరగకుండా చూస్తుంది.  గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.కొందరు ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామాలు చేస్తుంటారు. తలలోని బాధను, ఆలోచనలను క్లియర్ చేసుకునేందుకు, ప్రశాంతతను పొందేందుకు వ్యాయామాలు తీవ్రంగా చేస్తుంటారు కొంతమంది. కోపంగా ఉన్నప్పుడు, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు రన్నింగ్, వ్యాయామాలు చేయడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువ అని చెబుతున్నారు అంతర్జాతీయ వైద్యులు. 


కోపంగా ఉన్నప్పుడు అధికంగా వర్కౌట్లు చేస్తే హృదయ స్పందన రేటు పెరుగుతుంది. రక్త నాళాల నుంచి ప్రవహించే రక్తం వేగం పెరిగిపోతుంది. గుండెకు రక్త సరఫరాలో ఆటంకం కలుగుతుంది.  రక్త నాళాలు సన్నబడతాయి కూడా. అందుకే మానసిక క్షోభలో ఉన్నప్పుడు తీవ్రమైన శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. 


గుండెపోటు లక్షణాలు 
ధమనులలో ఆటంకాలు ఏర్పడడం వల్ల గుండెకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. అప్పుడు గుండెపోటు వస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే మరణం సంభవించవచ్చు. గుండెపోటు ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయంటే...
1.ఛాతి నొప్పి
2. దవడ నొప్పి
3. శ్వాస ఆడకపోవుట
4. కాంతిని గుర్తించలేకపోవడం
5. వెన్నునొప్పి
6. చేతుల్లో నొప్పి
7. ఛాతీ బిగుతుగా అనిపించడం
8. ఆందోళన
9. అసాధారణ హృదయ స్పందన రేటు


Also read: గుండె సమస్య ఉందో లేదో తేల్చేసే ముఖ్యమైన టెస్టులు ఇవే


Also read: గర్భిణులు ఆకుకూరలు తింటే శిశువులు ఏడుస్తారు, క్యారెట్లు తింటే నవ్వుతారు, అదిరిపోయే అధ్యయనం







































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.