నిత్యం ఏదో ఒక విషయంపై పరిశోధనలు చూస్తూనే ఉంటారు శాస్త్రవేత్తలు. అలా గర్భస్థ శిశువులపై చేసిన అధ్యయనం ఎంతో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. పుట్టబోయే బిడ్డలు తమ తల్లులు తినే ఆహారం రుచికి ఎలా స్పందిస్తారో పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకోసం వంద మంది గర్భిణీ స్త్రీలపై అధ్యయనం చేశారు. వారి  4D అల్ట్రాసౌండ్ స్కాన్‌లను తీసుకున్నారు. వారి తల్లులు తినే ఆహారాన్ని బట్టి వారు ఎలా స్పందిస్తున్నారో పరిశీలించారు. అలా కొన్ని కూరగాయలకు పిల్లలు స్పందించడం చాలా విచిత్రంగా అనిపించింది. 


శిశువుల్లో ఏడుపుముఖం
తల్లి ఆకుకూరలు తిన్నప్పుడు పిల్లలు ఏడుపు ముఖం పెట్టినట్టు కనిపించింది అల్ట్రా సౌండ్‌లో. అదే క్యారెట్ తిన్నప్పుడు శిశువులు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. UKలోని డర్హామ్ యూనివర్శిటీలోని ఫీటల్, నియోనాటల్ రీసెర్చ్ ల్యాబ్ నేతృత్వంలోని ఈ అధ్యయనం నిర్వహించారు. వీరు 100 మంది గర్భిణీ స్త్రీలకు సంబంధించిన 4D అల్ట్రాసౌండ్ స్కాన్‌లను తీసుకుంది.  తల్లులు తినే ఆహారాల నుండి వారి పుట్టబోయే పిల్లలు ఎలా స్పందిస్తారో చూశారు. వారి పరిశోధనల్లో శిశువుల్లో రుచి, వాసన గ్రాహకాల అభివృద్ధిపై అధ్యయనం సాగింది. 


ఇందులో భాగంగా 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల కాబోయే తల్లులను ఎంచుకున్నారు. వారు 32 వారాలు, 36 వారాల గర్భధారణతో ఉన్నవారు. వీరికి స్కాన్ చేయడానికి ముందు 20 నిమిషాల ముందు క్యారెట్ లేదా ఆకుకూరలు తినిపించిరు. మరింకేమి తినవద్దని తల్లులకు సూచించారు. ఆ ఆహారం పేగు ద్వారా బిడ్డకు చేరాక స్కాన్ తీశారు. అప్పుడు శిశువుల రియాక్షన్లను రికార్డు చేశారు. 


ఆ గర్భస్థ శిశువులుగా వారు ఎక్కువ ఏ రుచికి గురవుతారో, బయటికి వచ్చాక ఆ రుచులను ఇస్టపడే అవకాశం ఉందని చెబుతున్నారు అధ్యయనకర్తలు. గర్భస్థ శిశువులకు భావోద్వేగాలు, ఇష్టయిష్టాలు ఉంటాయని కనిపెట్టారు పరిశోధకులు. 






Also read: వేడి నీటిలో, టీలో తేనె వేసుకుని తాగుతున్నారా? అయితే విషాన్ని తాగుతున్నట్టే


Also read: ఎక్కిళ్లు ఆగకుండా వస్తున్నాయా? ఇలా చేసి చూడండి ఇట్టే ఆగిపోతాయి


















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.