ఐక్యూ... ఇంటెలిజెన్స్ కోషియంట్. ఒక వ్యక్తి తెలివితేటలను అంచనా వేసే పరీక్ష ఇది. ఆ వ్యక్తి సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని, తార్కికంగా ఆలోచించే సామర్థ్యాన్ని, అభిజ్ఞా సామర్ధ్యాలను ఈ పరీక్ష కొలుస్తుంది. ఐక్యూ విలువ ఎక్కువగా ఉంటే... వారు ఎక్కువ తెలివితేటలు కలవాలని అర్థం. అదే తక్కువ ఉంటే వారు, తక్కువ తెలివితేటలు ఉన్న వారిని అర్థం. మీ ఐక్యూని ఇక్కడున్న బొమ్మ ద్వారా పరిశీలించుకోండి.
తల్లి ఎవరు?
ఈ బొమ్మలో ఇద్దరు మహిళలు కూర్చుని ఉన్నారు. ఒక చిన్నారి నేలపై కూర్చుని ఆడుకుంటున్నాడు. ఆ ఇద్దరు మహిళల్లో ఆ చిన్నారి తల్లి ఎవరో కేవలం పది సెకండ్లలో మీరు కనిపెట్టాలి. అలా కనిపెడితే మీ ఐక్యూ స్థాయి ఎక్కువేనని అర్థం.
జవాబు ఇదే
చాలామంది ప్రయత్నించే ఉంటారు. కానీ మీరు ఏ బేసిక్స్ మీద ప్రయత్నించారు అన్నది ముఖ్యం. బొమ్మలో ఉన్న మనుషులను కాసేపు పరిశీలిస్తే చాలు తల్లిని ఇట్టే పట్టేయొచ్చు. ఎందుకంటే ఆ పిల్లాడి జుట్టు, రంగు తల్లి జుట్టు రంగు ఒకటే ఉంటుంది. అలా చూసుకుంటే పసుపు రంగు డ్రెస్ వేసుకున్న మహిళ ఆ పిల్లాడి తల్లి. అంతే కాదు ఎప్పుడైనా చిన్నపిల్లలు తమకు తెలియకుండానే తమ తల్లిదండ్రులకు దగ్గరగా లేదా తమ తల్లిదండ్రుల వైపు తిరిగి ఆడుకోవడం ఎక్కువగా చేస్తుంటారు. అలా చూసినా కూడా ఆ చిన్నారి తన తల్లి వైపే తిరిగి ఆడుకుంటున్నాడు. తెలివైన వారు జుట్టు రంగును బట్టే తల్లిని పోల్చివేసే అవకాశం ఉంది.
ఎంత ఐక్యూ ఉంటే...
సాధారణంగా ఒక మనిషి సగటు ఐక్యూ 100 ఉంటుంది. 100 కన్నా ఎక్కువ స్కోరు వస్తే ఆ మనిషి తెలివైన వాడని అర్థం. అంత కన్నా తక్కువ వస్తే తెలివితేటలు తక్కువేనని అర్థం. ప్రపంచంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఐక్యూ చాలా ఎక్కువ అని చెప్పుకుంటారు. అలాగే ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఎక్కువే అని అంటారు. వీరిద్దరిది స్కోర్ 160. 145 స్కోర్ దాటితే చాలు వారిని జీనియస్ కిందే చెబుతారు. అదే ఐక్యూ స్కోర్ 70 కన్నా తక్కువ ఉంటే మానసిక సమస్యలు ఉన్న వ్యక్తిగా గుర్తిస్తారు. అదే 85 - 70 మధ్య ఉంటే ఇంటిలిజెన్స్ తక్కువ అని అంటారు. 85 నుంచి 100 వరకు ఉంటే యావరేజ్‌గా పరిగణిస్తారు.
అయితే ఇక్కడ ఇచ్చిన బొమ్మతో మీ ఐక్యూ స్థాయిలను అంచనా వేయడం కష్టమే. కానీ సగటున 100 ఐక్యూ స్థాయి ఉన్నవారు, అంతకన్నా మించి ఉన్న వారు కచ్చితంగా కేవలం 10 సెకండ్లలో ఆ పిల్లాడు తల్లిని కనిపెట్టే అవకాశం ఎక్కువ.
Also read: ఇడ్లీ మిగిలిపోయిందా? అయితే ఇలా చాట్, పకోడా చేసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.