తనకి న్యాయం చేయమంటూ ప్రియ దివ్య దగ్గరకి వస్తుంది. పబ్లిక్ ఈ విషయం కుండబద్ధలు కొడదామని దివ్య అంటుంది. నీ జాబ్ రిస్క్ లో పడుతుందేమోనని ప్రియ అంటుంది. న్యాయం కోసం ఏం చేసినా తప్పు లేదని చెప్తుంది. విక్రమ్ విజయవాడ వెళ్తు దివ్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు. తను ఏం చేస్తుందో దిగులు పెట్టుకుంటుందేమోనని అనుకుంటాడు. అక్కడ హాస్పిటల్ దగ్గర దివ్య కోసం దేవుడు ఎదురుచూస్తూ ఉంటాడు. దేవుడు చెప్పినట్టు దివ్య కాల్ చేయలేదని అనుకుంటాడు. వాసుదేవ్ తన బిజినెస్ డీల్ అగ్రిమెంట్ కాపీ నందు చేతికి ఇస్తాడు. లాస్య తెగ సంబరపడిపోతుంది. నీ కేఫ్ కి బ్యాక్ బోన్ లా నిలబడి నిన్ను ఒక స్టేజ్ కి తీసుకొచ్చిన తులసి ఇందులో కూడా అండగా ఉండి సహాయం చేస్తుందని దేవ్ అంటాడు. కానీ తులసి బిజీగా ఉందని తను సపోర్ట్ గా ఉంటానని లాస్య అంటుంది. ఈ డీల్ తులసిని చూసే ఇచ్చానని దేవ్ మరోసారి చెప్తాడు.
Also Read: శోభనానికి ఒప్పుకుని రాజ్ కి ఝలక్ ఇచ్చిన కావ్య- పట్టాలెక్కిన మరో ప్రేమ జంట
భార్య అయినా కూడా భార్య కాకుండా నటించి నీకు చాలా హెల్ప్ చేశానని లాస్య తెగ మురిసిపోతుంది. కానీ నందు మాత్రం ఇది వెనక్కి తిరిగి ఇస్తానని చెప్తాడు. ఇది మోసంతో సంపాదించుకున్నదని అంటే లాస్య మాత్రం ఒప్పుకోదు. చేతికి అందిన అదృష్టాన్ని జారవిడుచుకోవద్దని చెప్తుంది. హాస్పిటల్ దగ్గర దివ్య టెంట్ వేసి ధర్నాకి రెడీ చేస్తుంది. హాస్పిటల్ లోని నర్సులందరినీ నిలబెట్టి ప్రియకి జరిగిన అన్యాయం గురించి చెప్తుంది. అదంతా చూసి విక్రమ్ కోసం దివ్య ఇలా చేస్తుందని అనుకుంటాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ప్రియని తల్లిని చేశాడని చెప్పి విప్లవం లేవనెత్తుతుంది. అది విని దేవుడు షాక్ అవుతాడు. ఒక పక్క అన్నని ప్రేమిస్తూ మరో పక్క తమ్ముడితో యుద్దం చేస్తుంది ఇదెక్కడి గోలరా బాబు అని తలబాదుకుంటాడు. న్యాయం కావాలంటూ దివ్య ఘోరావ్ చేస్తుంది.
విక్రమ్ కి దివ్య దూరం అవుతుందని అనుకుని హాస్పిటల్ దగ్గర జరిగేది ఏది చెప్పకుండా తన దగ్గర దాస్తాడు. దివ్య తనకి ఫోన్ చేయలేదని టెన్షన్ పడతాడు. తను చాలా బిజీగా ఉందని ఫోన్ గురించి మర్చిపోమ్మని చెప్తాడు. వాసుదేవ్ వాళ్ళు అందరికీ బై చెప్పి వెళ్లబోతుంటే నందు ఎమోషనల్ అవుతాడు. తప్పుని ఒప్పుకున్నప్పుడే మనిషి విలువ పెరుగుతుందని దేవ్ అంటాడు. జీవితంలో రెండో సారి చేసిన తప్పు ఒప్పుకుంటున్నానని చెప్తాడు.
Also Read: మనోహర్ కంట పడకుండా తప్పించుకున్న జానకి- హనీమూన్ సంగతి తెలిసి కుళ్ళుకున్న మల్లిక
దేవ్: నువ్వు తప్పు చేయడం ఏంట్రా
నందు: తప్పు కాదు మిత్రద్రోహం నీ దగ్గర ఒక నిజం దాచి అబద్ధాన్ని నిజంగా చూపించి మోసం చేశాను. నన్ను నమ్మి నీ బిజినెస్ లో పార్టనర్ ని చేసుకున్నావ్. అలాంటి నిన్ను మోసం చేయలేను. తులసి నా భార్య కాదు రెండేళ్ల క్రితమే తనకి విడాకులు ఇచ్చి లాస్యని పెళ్లి చేసుకున్నాను. కేవలం ఈ బిజినెస్ డీల్ కోసమే తులసి నేను భార్యాభర్తలుగా నటించాము. ఇందులో తులసి తప్పు లేదు కేవలం నేను అదిగినందుకు ఇష్టం లేకపోయినా నా భార్యగా నటించింది.