రాహుల్ తను తప్పించుకోవడం కోసం స్వప్న దగ్గర కావ్యని చెడ్డదాన్ని చేస్తాడు. మా వాళ్ళకి చెప్పమంటే చెప్పేస్తాను మీ చెల్లి చేసిన పని వల్ల నన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేస్తారు. నీ కోసం ఆస్తి కూడా వదిలేసి వచ్చేస్తాను. నాతో కలిసి ఉండటానికి నువ్వు రెడీనా అని రాహుల్ అడుగుతాడు. తెగే దాక లాగితే బాగోదని పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చని తనకి కావలసింది పోయిన పరువు మర్యాద తిరిగి సంపాదించుకోవడమని స్వప్న అంటుంది. నువ్వు ఎప్పుడు ఒకే అంటే అప్పుడే పెళ్లి చేసుకుందామని అంటుంది. కావ్య స్వప్న కోసం వెతుకుతూ ఉండగా రాహుల్ ఒక్కడే కనిపిస్తాడు. దీంతో అనుమానపడుతుంది. అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెట్టినందుకు సంబరపడతాడు.
కనకం ఎవరికి కనిపించకుండా మెల్లగా ఇంట్లోకి వస్తుంటే కృష్ణమూర్తి పట్టుకుంటాడు. కన్నాకూతుర్ని చూడటానికి వెళ్ళిందని అర్థం చేసుకుంటాడు. తన కూతురు ఎలా ఉందని కృష్ణమూర్తి ఎమోషనల్ గా అడుగుతాడు. రాణి, మహారాణిలా ఉందని అంటుంది. ఈ నిజం అబద్ధం కాదు కదా అని అంటాడు. కావ్య చూసిందా, మాట్లాడిందా ఆత్రంగా అడుగుతాడు. తనని చూసి మూగబోయాను ఐశ్వర్యాన్ని నా కూతురిలో చూస్తే మూగబోయాను. నీ కూతురు ఎంత వైభవంగా బతుకుతుందో కళ్ళలో కనిపిస్తుందని కనకం అంటుంది. అందరి మధ్యలో కావ్య చందమామలా వెలిగిపోతుందని చెప్తుంది. ఇక్కడ జీవం లేని బొమ్మలకు రంగులు వేసి వేసి అక్కడ తన మొహాన కూడా చిరునవ్వు వేసుకున్నట్టు ఉందని అనుకుంటాడు. నీ మొహం కనిపించకుండా వేసుకున్న రంగులన్నీ ఎప్పుడు తుడిచేసుకున్నావని కృష్ణమూర్తి అడుగుతాడు. నువ్వు రావడం లేట్ అయ్యిందని మీనాక్షికి ఫోన్ చేస్తే జరిగింది చెప్పిందని అనడంతో కనకం గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.
Also Read: వామ్మో రాహుల్ మామూలు కేటుగాడు కాదుగా - స్వప్నని చూసేసిన కావ్య
ఇంకొక సారి అమ్మ నన్ను చూడటానికి ఇక్కడికి వస్తే రానివ్వద్దని కావ్య కళ్యాణ్ ని అడుగుతుంది. నన్ను చూడటానికి అమ్మ వేర్వేరు వేషాలు వేస్తుంది అది ఎవరైనా చూస్తే చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు తన స్థానం ఇంకా దిగజారిపోతుందని బాధపడుతుంది. అంతా కఠినంగా ఎలా మాట్లాడుతున్నారని అంటాడు. అమ్మని అంత దీన స్థితిలో చూడటం చాలా కష్టంగా ఉంది, తను దొరికిపోతే అందరి ముందు చాలా అవమానం జరుగుతుందని చెప్తుంది. దీంతో సరే అంటాడు. అపర్ణ కనకం కోసం రాజ్ ఇంటికి వస్తుంటే వాచ్ మెన్ ఆపుతాడు. తన నుంచి తప్పించుకుని అప్పు లోపలికి వెళ్తుంది. అప్పుడే కృష్ణమూర్తి ఫోన్ చేసి అమ్మ ఇంటికి వచ్చేసిందని చెప్తాడు. కావ్య తన గదిలోకి వెళ్ళి వేసుకున్న నగలన్నీ తీస్తుంటే అపర్ణ వస్తుంది. గదిలోకి అడుగు పెట్టకుండానే ఇది పనికిరాని సామాన్లు పడేసే గది ఇందులోకి ఎప్పుడు అడుగుపెట్టనని అంటుంది. ఈ ఇంటి ఆచారం ప్రకారం ఈ ఇంటి కోడలు వేసుకోవాలి నీకు ఆ అర్హత లేదని అపర్ణ అవమానకరంగా మాట్లాడుతుంది.
Also Read: మనోహర్ కంట పడకుండా తప్పించుకున్న జానకి- హనీమూన్ సంగతి తెలిసి కుళ్ళుకున్న మల్లిక
నగల మీద తనకి ఆశలేదని కావ్య గట్టిగా చెప్తుంది. ఏదైనా అనాలని అనుకుంటే మీ అబ్బాయిని అనుకోండి తను బలవంతంగా వేసి వెళ్ళాడు. నేను నాలాగే ఉంటానని అంటుంది. ఎంత మంచిగా ఉన్నా నిన్ను కోడలిగా అంగీకరించేది లేదని చెప్తుంది. అపర్ణ వాచ్ మెన్ కంట పడకుండా లోపలికి వెళ్లబోతుంటే కళ్యాణ్ పట్టుకుంటాడు.