గుప్పెడంతమనసు మార్చి 25 ఎపిసోడ్
సీక్రెట్ రూమ్ లో పెట్టిన ఆన్సర్ పేపర్స్..మారు కీ చేయించి తీసుకెళ్లిపోతాడు కాలేజీకి స్పాట్ వాల్యూషన్ కి వచ్చిన ధర్మరాజు. వసుధార కోసం వెళ్లిన జగతి..సీక్రెట్ రూమ్ తాళాలు తీసి ఉండడం చూసి షాక్ అవుతుంది. మహేంద్ర, రిషి, వసు కూడా అక్కడకు వచ్చి చూసి కాసేపు ఆలోచిస్తారు. తన చేతిలో ఉన్న సీక్రెట్ రూమ్ కీ మళ్లీ చెక్ చేసిన జగతి..దానికి సబ్బు అంటుకుని ఉండడం చూసి అదే విషయం చెబుతుంద జగతి.
మహేంద్ర: కీస్ నా దగ్గర ఉన్నాయి మరి డోర్స్ ఎవరు తీశారు ఇది ఎవరి పని అయ్యుంటుంది. అయినా దిద్దిన పేపర్స్ తీసుకెళ్లి వాళ్ళం చేస్తారు
రిషి: ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు మన కాలేజీ పరువు పోతుంది కదా డాడ్ . ఒక పేపర్ మిస్సైనా మన కాలేజీకి బ్యాడ్ నేమే కదా అంటూ.. జగతి కీకి సబ్బు అంటుకుందని చెప్పిన తర్వాత.. ఈ పని ఎవరు చేశారో నాకు తెలుసు పద వసుధార అని వెళాతాడు...
మరోవైపు ధర్మరాజు ఫుల్ గా తాగుతూ ఆ మూడు బండల్స్ ని చూసి సంతోష పడుతూ ఉంటాడు. ఇంతలోనే ఫోన్ రావడంతో నమస్తే సార్ DBST కాలేజ్ పని అయిపోయింది పది అడుగుల కింద పడిపోతుంది అని సంతోషంగా నవ్వుతూ మాట్లాడతాడు. ఇంతలోనే వసుధార రిషి అక్కడికి వస్తారు. కార్లోంచి కిందకు దిగిన వసుధార చేతిలో బ్యాగు చూసి...
రిషి: ఇప్పుడు కూడా ఈ బ్యాగ్ అవసరమా ..ఇది కాలేజీ కాదుకదా
వసు: ఇందులో అవసరమైన వస్తువులు ఉన్నాయి అంటూ డోర్లు తీయడానికి, కిటికీల స్క్రూలు తీయడానికి ఆయుధాలున్నాయని చూపిస్తూ... గ్లౌజులు మాస్క్ తాడు కట్టింగ్ బ్లేడ్ అన్ని చూపిస్తుంది
రిషి: నువ్వు ప్రొఫెషనల్ దొంగలా ఆలోచిస్తున్నావేంటి...
వసు:మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదా
ఆటిట్యూడ్ కోసం చూయింగ్ గమ్ ఇస్తుంది..కోడ్ భాషలో మాట్లాడుకోవాలి పేర్లు పెట్టి పిలవకూడదు అంటూ.. దొంగలు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెబుతుంది... రిషి ఆశ్చర్యంగా చూస్తుంటాడు..ఇద్దరు కలిసి దొంగచాటుగా వెళతారు. రూమ్ డోర్ ఎలా తీయాలని అడిగితే... హెయిర్ పిన్ తో డోర్ తీసేందుకు ప్రయత్నించి రాలేదు సార్ అంటుంది వసుధార. సార్ సినిమాలో ఇలా తీస్తే వచ్చేది సార్ అనడంతో ఇది రియల్ లైఫ్ అని సెటైర్ వేస్తాడు రిషి.
అనుకోకుండా ధర్మరాజు గది తలుపులు తీయడంతో ఇద్దరూ దొంగచాటుగా లోపలకు వెళతారు. అప్పుడు ధర్మరాజు టాయిలెట్ పోసుకుని లోపలికి వచ్చి డోర్ వేస్తాడు... రిషి-వసు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ధర్మరాజు రూంలో సీక్రెట్ గా వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత గదిలో పేపర్స్ లేకపోవడంతో మరొక గదికి వెళ్లడానికి ఇద్దరు ట్రై చేస్తుండగా...హలో రిషి సార్ అనడంతో..ఇద్దరం దొరికిపోయాం అనుకుని వెనక్కు తిరుగుతారు... కానీ ధర్మరాజు మాత్రం తాగిన మైకంలో చేతిలోకి బండల్స్ తీసుకొని సంతోషపడుతూ మీ కాలేజీ పరువుపోతుంది మీ కాలేజీ పరువు పోతే ఎవరికో ఆనందం అంట అంటూ తాగిన మైకంలో ఏదేదో మాట్లాడుతుంటాడు. వెళ్లి వాడిని కొట్టండి సార్ అని వసుధార అంటుంది.. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు అంటాడు రిషి. ఇంతలో ధర్మరాజు వాళ్లవైపు రావడం చూసి రూమ్ లోకి వెళ్లి దాక్కుంటారు... ఆ రూమ్ డోర్ తీసి ఉందేంటని ఆలోచించి డోర్ క్లోజ్ చేసివెళ్లిపోతాడు ధర్మరాజు. తలుపు మూసేయడంతో ఇద్దరూ టెన్షన్ పడతారు. వాడు తీసేవరకూ ఇక్కడే ఉండాలా అని టెన్షన్ పడతారు.
వసు: ఇరుక్కుపోయాం ఇప్పుడేలా
రిషి: ఇప్పుడు ఏం చేద్దాం V.నీ బుర్రలో ఇలాంటి వాటికి ఆలోచన లేదా
వసు: ఇంకో డోర్ లేని ఇందులోంచి బయటకు వెళ్లలేం..ఇప్పుడేం చేద్దాం సార్
రిషి: అంత్యాక్షరి ఆడుదామా
వసు: మీకు ఆటగా ఉందా
రిషి: సరే ఏం చేద్దామో నువ్వు చెప్పు
వసు: అడిగితే చెప్పకుండా ఏదేదో మాట్లాడతారేంటి
రిషి: చేసిన పని చెప్పకుండా దాచిపెడుతున్నారు కొందరు..
వసు: ఇప్పుడు కూడా అదే టాపిక్కా....
Also Read: ఈ రాశులవారు ఎక్కువ సంపాదిస్తారు తక్కువ ఖర్చుచేస్తారు
ఈ రోజు ఆనందంగా గడిచిందని తనతో తాను మాట్లాడుకుంటూ డోర్ తీస్తాడు ధర్మరాజు... నేను చూస్తాను సార్ ఆగండి అంటూ వసుధార వెళ్లడంతో కరెక్టు గా ధర్మరాజు డోర్ తీసేసరికి ఎదురుగా నిల్చుని ఉంటుంది... వసుధారా అని షాక్ అవుతాడు ధర్మరాజు... కర్టెన్ వెనుకున్న రిషి టెన్షన్ పడతాడు....
సర్ గదికి తాళం వేశాడు ఇద్దరు ఇరుక్కుపోయాం ఇప్పుడు ఏం చేయాలి అని వసుధార టెన్షన్ పడుతూ ఉంటుంది. వాడు ఎప్పుడొస్తాడు అంతవరకు మనిద్దరం ఇక్కడే ఉండాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు రిషి సెటైర్లు వేయడంతో ఇప్పుడు ఇలాంటివి అవసరమా సార్ అని అంటుంది. అప్పుడు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఇంతటితో చాలు వెళ్లి పడుకుందాం అని లోపలికి వెళ్ళగా వసుధార ధర్మరాజు ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు.