ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక ప్రదేశాల్లో ఇటలీ దేశం ఒకటి. ఈ దేశంలో ఎన్నో అందమైన, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఎన్నో గ్రామాలు శిధిలావస్థకు చేరుతున్నాయి. దీంతో  ఇటలీలోని కొన్ని గ్రామాల స్థానిక అధికారులు బంపర్ ఆఫర్లు ప్రకటించి మరీ నివాసితులను రమ్మని ఆహ్వానిస్తున్నారు. కొత్త కొత్త పథకానలు ప్రవేశపెడుతున్నారు. చాలా గ్రామాలు ఖాళీగా మారిపోతున్నాయి. దీంతో సందర్శకులను, నివాసితులను ఆకర్షించేందుకు సర్వప్రయత్నాలు చేస్తున్నారు. పతనమైపోతున్న పట్టణాలను తిరిగి కళకళలాడేలా చేయడానికి కష్టపడుతున్నారు. పట్టణాలను పెంచడంలో సహాయపడతాయి.


దక్షిణ ఇటలీలోని పుగ్లియాలోని గ్రామం ప్రెసిక్సే. ఇది నిజంగా ఒక అందమైన ప్రదేశం. ఇందులో జనం తగ్గుతూ వస్తున్నారు. అంతా పట్టణాలకు వెళ్లిపోతున్నారు. దీంతో అక్కడి అధికారులు గ్రామాన్ని నిలబెట్టేందుకు ఒక ఇంటిని కొనుగోలు, అక్కడ నివాసం ఉండేందుకు ఏకంగా పాతిక లక్షల రూపాయలు ఇస్తామంటూ ఆఫర్ ప్రకటించారు. అయితే ఎలా బతకాలో, ఏం పని చేసుకుని బతకాలో మాత్రం చెప్పడం లేదు అధికారులు. జీవనోపాధి కూడా కల్పిస్తే ఎంతో మంది ప్రజలు తిరిగి గ్రామాలకు వెళ్లే అవకాశం ఉంది. 






కేవలం ప్రెసిక్సే గ్రామమే కాదు, ఇటలీలోని ఎన్నో అందమైన గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఇటలీ అంతటా దాదాపు ఇళ్ల ధరలు తగ్గాయి. ఎవరైనా విదేశీయులు వచ్చి నివసించేందుకు కూడా అవకాశం కల్నిస్తున్నాయి ఇటలీ అధికార వర్గాలు. సొంత ఇళ్లను వదిలేసి యజమానులు కూడా వదిలేసి సిటీలకు వెళ్లిపోతున్నారు. 


ఈ గ్రామం నివసించేందుకు అనుకూలంగానే ఉంటుంది. ఎండ కూడా బాగానే కాస్తుంది. రాత్రి పూట చలి కూడా ఎక్కువే. అక్కడికి వెళ్లి ఇల్లు కొనుక్కుని ఉన్నా కూడా ఏదైనా వ్యాపారం చేసుకుని బతకాలి తప్ప ఉద్యోగాలు అయితే రావడం కష్టం. ఈ గ్రామాలు ఖాళీ అవ్వడానికి కారణం మౌలిక వసతులు తక్కువగా ఉండడం కూడా. ఏది కావాలన్నా చాలా దూరం వెళ్లి  కొని తెచ్చుకోవాలి. అయితే ఈ పట్టణానికి దగ్గర్లోనే ఎన్నో అందమైన బీచ్‌లు ఉన్నాయి. 


Also read: చలికాలంలో తెల్లవారుజామున గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ, ఎందుకు? - ఎలా కాపాడుకోవాలి?