Stocks to watch today, 23 November 2022: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 65 పాయింట్లు లేదా 0.36 శాతం గ్రీన్ కలర్‌లో 18,353 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్: ఈ కంపెనీ షేర్లు ఇవాళ దలాల్ స్ట్రీట్‌లో అడుగు పెట్టనున్నాయి. నవంబర్ 11-15 మధ్య తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) అమలు జరిగింది. ఒక్కో షేరును రూ. 61-65 పరిధిలో విక్రయించి, రూ. 740 కోట్లను ఈ కంపెనీ సమీకరించింది.
మైండ్‌ట్రీ: మైండ్‌ట్రీ, LTI విలీనానికి ఇవాళ (నవంబర్ 23) ఎక్స్ డేట్. రికార్డ్ తేదీ నవంబర్ 24. మైండ్‌ట్రీ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్ అవుతుంది, L&T ఇన్ఫోటెక్ పేరు LTI-Mindtreeగా మారుతుంది.
ఫ్యూచర్ రిటైల్: అదానీ జాయింట్ వెంచర్ 'ఏప్రిల్ మూన్ రిటైల్', రిలయన్స్ రిటైల్ సహా 11 కంపెనీలు ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేయనున్న బిడ్డర్స్ తుది జాబితాలోకి ప్రవేశించబోతున్నాయి. తాత్కాలిక జాబితాకు సంబంధించి వాటాదారుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే ఈ కంపెనీలను తుది జాబితాలో చేరుస్తారు.
విప్రో:ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా, ఒక్కో విప్రో షేరును సగటు ధర రూ. 387 చొప్పున రెండు విడతలుగా BNP పారిబాస్ ఆర్బిట్రేజ్ ఆఫ్‌లోడ్ చేసింది. డీల్స్ వాల్యూ రూ. 185.76 కోట్లు. మొత్తం 48 లక్షల షేర్లను అమ్మింది. సొసైటీ జనరల్ కంపెనీ ఈ షేర్లను అదే ధరకు కొనుగోలు చేసింది.
లార్సెన్ & టూబ్రో (L&T): L&T -చియోడా లిమిటెడ్‌లో చియోడా కార్పొరేషన్‌కు ఉన్న మొత్తం వాటాను రూ. 75 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఈ ఇంజినీరింగ్ మేజర్ వెల్లడించింది. L&T-Chiyoda Ltd (LTC) అనేది L&T - జపాన్‌కు చెందిన చియోడా కార్పొరేషన్ (Chiyoda) మధ్య జాయింట్ వెంచర్.
వేదాంత: ఈ మైనింగ్ దిగ్గజం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 17.50 చొప్పున మూడో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రూ. 6,505 కోట్లను డివిడెండ్‌గా అందించనుంది. కంపెనీ స్థూల రుణం సెప్టెంబర్ 30 నాటికి రూ. 58,597 కోట్లుగా ఉంది.
వొడాఫోన్ ఐడియా: ATC టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన రూ. 1,600 కోట్ల విలువైన షేర్లను జారీ చేసేందుకు వాటాదారులు ఆమోదించారు. ATC టెలికాంకు బకాయిపడిన రూ. 1,600 కోట్లను 18 నెలల్లో చెల్లించని పక్షంలో, బకాయి మొత్తాన్ని ఈక్విటీగా మార్చి చెల్లించడానికి బోర్డు ఆమోదం తెలిపింది.
FSN ఈ-కామర్స్ వెంచర్స్ (Nykaa): నవంబర్ 25 పని వేళల ముగింపు నుంచి అమలుల్లో వచ్చేలా, Nykaa చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అరవింద్ అగర్వాల్ తన పదవికి రాజీనామా చేశారు. కొత్త CFOని నియమించే పనిలో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.