మన శరీరంలోని ప్రతి అవయవానికీ రక్తప్రసరణ జరగాలి. అలా జరిగితేనే అవి ఉంటాయి. రక్తం ద్వారానే అన్ని అవయవాలు ఆక్సిజన్‌ను, పోషకాలను గ్రహిస్తాయి. అప్పుడే అవి వాటి విధులను సక్రమంగా నిర్వర్తించగలవు. కాబట్టి రక్త సరఫరా శరీరమంతా జరిగేలా జాగ్రత్త పడాలి. ఇందుకోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటూ, వ్యాయామం వంటివి చేయాలి. అయితే కొందరిలో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల శరీరంలోని కొన్ని భాగాలకు రక్త సరఫరా నెమ్మదించడం లేదా తగ్గడం జరుగుతుంది. ఇవి కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.


కాళ్లకు...
కాళ్లకు ముఖ్యంగా పాదాలకు రక్తప్రసరణ తక్కువగా జరుగుతుంది. కాళ్లలో రక్తప్రసరణ సరిగా జరగకపోతే నరాలు పట్టేసినట్టు అనిపిస్తాయి. స్పర్శ కూడా తగ్గుతుంది. నొప్పులు రావడం వాపు కనిపించడం జరుగుతుంది. పాదాలలో కూడా స్పర్శ తగ్గుతుంది. పాదాల పగుళ్లు ఎక్కువగా వస్తాయి. ఇవన్నీ కూడా రక్తప్రసరణ సరిగా జరగడం లేదని చెప్పే లక్షణాలు.


కాలేయం...
ఆకలి సరిగ్గా వేయకపోవడం, బరువు అకస్మాత్తుగా తగ్గడం, చర్మం పాలిపోయినట్టు రంగు మారడం కూడా కాలేయానికి రక్తప్రసరణ తగ్గిందని చెప్పే సంకేతమే. లివర్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తప్రసరణ సరిగా జరగదు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోవద్దు. 


ప్రైవేటు భాగాలలో...
జననేంద్రియాలకు రక్తప్రసరణ సవ్యంగా జరగకపోతే శృంగారం చేయాలన్న ఆసక్తి తగ్గిపోతుంది. స్త్రీలలో సమస్యలు ప్రారంభమవుతాయి. హార్మోన్లు అసమతుల్యంగా మారిపోతాయి. దీంతో అనేక సమస్యల బారిన పడతారు. 


మూత్రం రంగు...
మూత్రం రంగు మారడం, మూత్రం దుర్వాసన రావడం వంటివి కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని చెప్పే సంకేతాలు. ఇవి కొన్ని రకాల కిడ్నీ వ్యాధుల వల్ల వస్తాయి. కిడ్నీలకు రక్తప్రసరణ సరిగా జరగకపోతే వాటి పనితీరు మందగించి సమస్యల బారిన పడతాయి.


మెదడుకు
మెదడుకు రక్తం ద్వారానే పోషకాలు, ఆక్సిజన్ అందుతాయి. ఎప్పుడైతే రక్తప్రసరణ నెమ్మదించిందో అప్పుడు జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మతిమరుపు రావడం మొదలవుతుంది. తలనొప్పి తరచూ వస్తుంది. బద్దకంగా ఉంటారు. యాక్టివ్ గా పని చేయలేరు. ఇలా జరిగితే మెదడుకు రక్తప్రసరణ తగ్గుతోందని అర్థం చేసుకోవాలి.


సమతుల ఆహారం తీసుకోవడం, తాజా కూరగాయలను, పండ్లను తినడం, వ్యాయామం చేయడం ద్వారా రక్తప్రసరణను పెంచుకోవచ్చు.  కాబట్టి వాకింగ్, జాగింగ్ వంటివి రోజూ కనీసం అరగంట పాటూ చేయాలి.



Also read: డయాబెటిస్ రోగులకు ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ రాగి పుల్కాలు



Also read: సీనియర్ ఎన్టీఆర్‌కు ఇడ్లీలంటే ఎంత ఇష్టమో, ఆయన మెనూలో ఉండే ఆహారాలు ఇవే




Also read: ఆ వీరుడి కొడుకు పేరునే సాంబార్‌కు పెట్టారు, ఈ వంటకం వెనుక ఆసక్తికరమైన కథ ఇది









































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.