Men’s Daily Hygiene Routine : ఆరోగ్యంగా ఉండాలంటే మగవారు రెగ్యులర్​గా చేసే కొన్ని మిస్టేక్స్​కి దూరంగా ఉండాలని చెప్తున్నారు నిపుణులు. హైజీన్​గా ఉండేందుకు తమ లైఫ్​స్టైల్​లో ప్రధానంగా ఐదు మార్పులు చేయాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటి? తెలియక చేసే తప్పుల వల్ల కలిగే నష్టాలు ఏంటి? ఆ అలవాట్లు మార్చుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement


నిద్ర సమయంలో


రాత్రుళ్లు పడుకునేప్పుడు మగవారు లోదుస్తులు లేకుండా పడుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ప్రైవేట్ పార్ట్​కి గాలి అందుతుందట. దీనివల్ల కొన్ని రకాల ఇన్​ఫెక్షన్లు దూరమవుతాయని చెప్తున్నారు. అలాగే రాత్రుళ్లు అండర్​వేర్ లేకుండా పడుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ కూడా మెరుగువుతుందని చెప్తున్నారు. 


గోళ్లు 


మగవారు చాలామంది గోళ్ల విషయం నెగ్లెక్ట్ చేస్తారట. వాటిని శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గోళ్లు పొడవుగా పెరుగుతున్నప్పుడు వాటితో ఎక్కువ బ్యాక్టీరియా పెరుగుతుందని.. టాయిలెట్ సీట్​ కంటే ఎక్కువ బ్యాక్టీరియా గోళ్లపై ఉంటుందని చెప్తున్నారు. ఇది మగవారిలో హార్మోన్లను నెగిటివ్​గా ఎఫెక్ట్ చేయవచ్చని చెప్తున్నారు. కాబట్టి వారానికోసారైనా గోళ్లను కట్ చేసుకుని.. హైజీన్​గా ఉండాలని సూచిస్తున్నారు. 


నోటి శుభ్రత


టీ, సిగరెట్, మందు, కూల్ డ్రింక్స్ వంటివి చాలామంది మగవారు చేస్తారు. దీనివల్ల నోటి నుంచి దుర్వాసన రావడం.. స్మోక్ చేసిన తర్వాత, ఇతర పనులు తర్వాత నోటిని శుభ్రం చేసుకోకపోవడం వల్ల వివిధ సమస్యలు వస్తాయి. వాటిని నివారించేందుకు రెగ్యులర్​గా బ్రష్ చేసుకోవాలి. పాచి పోయేలా క్లీన్ చేసుకోవడం, నాలుకను శుభ్రం చేసుకోవడం చేయాలి. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకుంటూ.. ఏదైనా తిన్న తర్వాత, తాగిన తర్వాత నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల నోటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా నోటి శుభ్రత గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. లేదంటే గుండె సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంది. 


ఆ తప్పు చేయొద్దు.. 


లో దుస్తులు ఎప్పటికప్పుడు ఫ్రెష్​గా ఉండేవి వేసుకోవాలి. ఒకసారి వాటిని వాడిన తర్వాత మళ్లీ వాటినే వేసుకోకూడదు. శుభ్రం చేసిన అండర్​వేర్​లు మాత్రమే వేసుకోవాలి. రిపిటెడ్​గా లోదుస్తులు వాడడం వల్ల ఇన్​ఫెక్షన్లు పెరిగి.. స్పెర్ క్వాలిటీపై ఎఫెక్ట్ పడుతుందట. అంతేకాకుండా ఆ ప్రాంతంలో స్కిన్ సమస్యలు రావడం, దుర్వాసన రావడం వంటివి జరుగుతాయట. 


హస్త ప్రయోగం


హస్త ప్రయోగమనేది చాలామంది ఫిజికల్ ప్లెజర్ కోసం చేసుకుంటారు. అయితే హస్తప్రయోగం తర్వాత చాలామంది మగవారు సరైన హైజీన్ ఫాలో అవ్వరట. దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్, జుట్టు రాలిపోవడం, పింపుల్స్ రావడం వంటి సమస్యలు వస్తాయట. అందుకే హస్తప్రయోగం తర్వాత ప్రైవేట్ పార్ట్, చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. 


మీరు హైజీన్​గా ఉండాలనుకున్నప్పుడు ముందుగా ఫిజికల్​గా మిమ్మల్ని ఎఫెక్ట్ చేసే తప్పులను సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. అలాగే హెయిర్​ లేదా గెడ్డం పెంచుకున్నా వాటిని సరిగ్గా మెయింటైన్ చేయాలని..  లేకుంటే హెయిర్​ ఫాలో అవ్వడం, స్కిన్ సమస్యలు రావడం వంటివి జరుగుతాయి. ఇలా రెగ్యులర్​గా చేసే మిస్టేక్​లను నోటిస్ చేసి వాటిని మార్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చని చెప్తున్నారు. 






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.