Deepika Padukone May Be Exits From Kalki 2: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ యాటిట్యూడ్.. రెమ్యునరేషన్, వర్కింగ్ అవర్స్ విషయంలో డిమాండ్స్ ఆమెకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయా?. అంటే అవుననే చెబుతోంది బాలీవుడ్ మీడియా. వీటి కారణంగానే ప్రభాస్ 'స్పిరిట్' మూవీ నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆమెను తప్పించారనే వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా.. ప్రభాస్ 'కల్కి 2' మూవీ నుంచి కూడా దీపికాను తొలగించే ఛాన్స్ ఉందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తల్లి అయిన తర్వాత ఆమె తక్కువ పని గంటలు డిమాండ్ చేయడం.. 8 గంటల వర్క్, ఎక్స్ ట్రా షూటింగ్ చేస్తే ఎక్స్ ట్రా పేమెంట్ అంటూ చెప్పడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. దీని వల్ల సెట్స్‌లో ఘర్షణకు కారణమవుతోందని సమాచారం. దీంతో మూవీలో ఆమె రోల్ తగ్గించడం కానీ లేదా పూర్తిగా తొలగించడం గురించి ఆలోచిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
త్వరలోనే 'కల్కి 2' షూటింగ్
రెబల్ స్టార్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898AD' గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్‌గా తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించారు. ప్రభాస్‌తో పాటు యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన కీలక పాత్రలు పోషించారు.
ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మారుతి డైరెక్షన్‌లో 'రాజాసాబ్', సందీప్ వంగా 'స్పిరిట్' మూవీస్ లైనప్‌లో ఉన్నాయి. వీటి తర్వాత ఈ ఏడాది చివర్లో 'కల్కి 2' సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇటీవలే ఓ ఈవెంట్‌లో ఈ విషయంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ రోల్‌కు ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉండేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. 'కల్కి' మూవీతో ఓ విజువల్ వండర్ క్రియేట్ చేశారు నాగ్ అశ్విన్. దీంతో సీక్వెల్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
Also Read: వైభవంగా అఖిల్ జైనాబ్‌ల వివాహం - వెడ్డింగ్ ఫోటోస్ చూశారా!
'స్పిరిట్' నుంచి దీపిక్ ఔట్
ప్రభాస్‌తో డైరెక్టర్ సందీప్ వంగా 'స్పిరిట్' మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికాను తీసుకోవాలని సందీప్ భావించారు. 'కల్కి' మూవీలో ఇద్దరూ కలిసి నటించినా పెద్దగా కలిసి కనిపించలేదు. దీంతో వీరి కాంబో అదిరిపోతుందంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే, మూవీ ప్రాఫిట్స్‌లో షేరింగ్, వర్కింగ్ అవర్స్, ఎక్కువ షూటింగ్ చేస్తే ఎక్స్ ట్రా పేమెంట్స్ వంటి కండీషన్లతో ఆమెను సందీప్ పక్కన పెట్టారనే వార్తలు వచ్చాయి. ఆమె స్థానంలో 'యానిమల్'లో నటించిన త్రిప్తి దిమ్రిని సెలక్ట్ చేశారు. దీనిపై బాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. అయితే, సందీప్ మాత్రం త్రిప్తి మాత్రమే 'స్పిరిట్' హీరోయిన్ అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే 'స్పిరిట్' మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.