బిర్యానీలు, కూరలు ఘుమఘుమలాడేలా చేసేందుకు కసూరీ మేతీని జత చేస్తుంటారు చాలా మంది. కూరల్లో కలిపితే వాటి రుచే వేరు.దీన్ని అందరూ కొనుక్కుంటారు. నిజానికి కసూరి మేతీని సులువుగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో చూడండి. కసూరిమేతీ అంటే ఇంకేదో అనుకుంటారు చాలా మంది. మెంతి ఆకులే. వాటితోనే కసూరి మేతీని తయారుచేస్తారు. 


ఎలా చేయాలంటే?
1. ముందుగా మెంతిఆకులను బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 
2. నీటిలో ఉప్పు కలిపి బాగా కరగబెట్టాలి. అందులో మెంతి ఆకులను వేసి నానబెట్టాలి. 
3. ఓ పావుగంటపాటు అలా వదిలేశాక ఒక పొడి వస్త్రంలో వాటిని వేసి నీరంతా పీల్చేలా చేయాలి. 
4. తడిమొత్తం బయటకు పోయేవరకు గాలిలో ఆరబెట్టాలి. ఇలా మూడు రోజులు చేయాలి. 
5. పొడిగా మారాక ఎర్రటి ఎండలో ఎండబెట్టాలి. ఓ గంటసేపు ఎండబెడితే చాలు పొడిగా మారిపోతాయి. 
6. ఇప్పుడు వాటిని ఓవెన్లో ఒక నిమిషం పాటు పెట్టి తీసేయాలి. లోపల ఎక్కడైనా తడి ఛాయలు ఉంటే అవి కూడా పోతాయి. 
7. ఇంట్లో ఓవెన్ లేకపోతే పెనంపై ఒక పళ్లెం పెట్టి వాటిలో ఈ ఆకులను వేసి వేయించాలి. ఒక నిమిషం పాటూ చేస్తే చాలు.
8. అంతే కసూరి మేతీ సిద్ధమైనట్టే. వీటిని గాలి చొరబడని బాక్సులో వేసి నిల్వ ఉంచుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేసుకుంటే ఒక ఏడాది పాటూ వాడుకోవచ్చు. 






Also read: ముఖం కాలిపోయింది, గుండె జబ్బు వేధిస్తోంది, అయినా మిస్ వరల్డ్ పోటీల్లో నిలిచి గెలిచింది